మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమానికి హాజరైన తమిళ ప్రతినిధుల 8వ బృందం హనుమాన్ ఘాట్‌లో పవిత్ర స్నానం చేసింది


హాకీ, ఫుట్‌బాల్ క్రీడల్లో పోటీ పడేందుకు మొదటి తమిళనాడు క్రీడాకారుల బృందం వారణాసి చేరుకున్నారు

Posted On: 07 DEC 2022 5:17PM by PIB Hyderabad

నెల రోజుల పాటు జరిగే "కాశీ తమిళ సంగమం"లో భాగంగా వారణాసి చేరుకున్న 8వ తమిళ ప్రతినిధి బృంద సభ్యులు, గంగా తీరంలోని "హనుమాన్ ఘాట్" వద్ద పవిత్ర స్నానం చేశారు. గతంలో దీనిని 'రామేశ్వరం ఘాట్' అని పిలిచేవారు. వారణాసిలో ఎక్కువ మంది సందర్శించే ఘాట్‌లలో 'హనుమాన్ ఘాట్' ఒకటి. ఈ ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో కేరళ మఠం, కంచి శంకర మఠం, శృంగేరి మఠం మొదలైన దక్షిణ భారత మఠాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రతినిధి బృందం సభ్యులు 'హనుమాన్ ఘాట్' వద్ద ఉన్న పురాతన ఆలయంలో పూజలు చేశారు. 'హనుమాన్ ఘాట్' సమీపంలోనే ఉన్న సుబ్రహ్మణ్య భారతియార్ నివాసాన్ని కూడా సందర్శించారు.

"కాశీ తమిళ సంగమం"లో భాగంగా జరిగే హాకీ, ఫుట్‌బాల్ క్రీడల్లో పోటీ పడేందుకు తమిళనాడు క్రీడాకారుల మొదటి బృందం ఈ ఉదయం వారణాసికి చేరుకుంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ప్రాంగణంలో 2022 డిసెంబర్ 8 నుంచి 15 వరకు, 8 రోజుల పాటు "క్రీడా పోటీలను" భారత క్రీడా ప్రాథికార సంస్థ (శాయ్‌) నిర్వహిస్తోంది.

 

*  *  *


(Release ID: 1881708)