రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఒక వరుస స్తంభాల ఆధారంగా హైవే ఫ్లైఓవర్ & మెట్రో రైల్ తో అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ వంతెన (3.14 కిమీలు)ను నాగ్‌పూర్‌లో నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించిన ఎన్‌హెచ్ఎఐ, మహా మెట్రో బృందాన్ని అభినందించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
05 DEC 2022 4:31PM by PIB Hyderabad
ఒక వరుస స్తంభాల ఆధారంగా హైవే ఫ్లైఓవర్ & మెట్రో రైల్ తో అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ వంతెన (3.14 కిమీలు)ను నాగ్‌పూర్‌లో నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించిన ఎన్‌హెచ్ఎఐ, మహా మెట్రో బృందాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తన ట్వీట్లలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఆసియా బుక్, ఇండియా బుక్‌ల రికార్డులను సాధించిందని శ్రీగడ్కరీ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రఖ్యాత అవార్డును సాధించడమన్నది మాకు గర్వకారణమైన విషయమన్నారు. ఇవన్నీ సాధ్యమయ్యేందుకు రేయింబవళ్ళు కష్టించి పని చేసిన అద్భుతమైన ఇంజనీర్లు, అధికారులు & కార్మికులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నెరవేర్చడమే ఇటువంటి అభివృద్ధి అని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1880999)
आगंतुक पटल : 198