సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతదేశ వృద్ధి ఇంజిన్ యువత .. ప్రపంచ వృద్ధి ఇంజిన్ భారతదేశం - కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
హిసార్‌లో కమ్యూనిటీ రేడియో స్టేషన్ 90.0 'భవ్యవాణి'ని ప్రారంభించిన కేంద్ర సమాచార మరియు ప్రసార మరియు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
04 DEC 2022 4:41PM by PIB Hyderabad
భారతదేశ అభివృద్ధిలో ఇంజిన్ గా మారిన యువత నైపుణ్యాన్ని, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ బలమైన శక్తిగా అభివృద్ధి చెందాలని కేంద్ర సమాచార ప్రసార కాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం (NEP) ద్వారా అందుబాటులోకి వచ్చిన బహుళ విద్యా విధానం ద్వారా సంపూర్ణ విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచి దేశం, ప్రజల అభివృద్ధికి సహకరించాలని ఆయన అన్నారు.నైపుణ్యం కలిగిన యువకులు జాతీయ ఆస్తి గా తమ కుటుంబం, దేశం, దేశ ప్రజలకు సేవలు అందించగలుగుతారని శ్రీ అనురాగ్ సింగ్ అన్నారు.
స్టార్టప్ రంగంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉందన్నారు.
ఈరోజు జరిగిన హిసార్‌లోని ఓం స్టెర్లింగ్ గ్లోబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం లో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతక ఉపన్యాసం ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థలు క్రీడా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.' ఫిట్‌నెస్ కా డోస్ , ఆదా గంటా రోజ్' నినాదం ఆరోగ్య రక్షణలో కీలకంగా ఉంటుందని అన్నారు. భారతదేశం అధ్యక్షతన జరగనున్న జీ -20 కార్యక్రమాల్లో భాగంగా యువజన సదస్సు కూడా ఉంటుంది అని మంత్రి తెలిపారు.
.హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులు, క్రీడాకారులు, బాలికలు తమ రంగాల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకు రావడానికి చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు.
విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేషన్ మరియు డిగ్రీలు పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. దేశంలో 750 ప్రాంతాల్లో 'యువ సంవద్' నిర్వహిస్తున్నట్లు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
స్నాతకోత్సవంలో 815 మంది విద్యార్థులకు డిగ్రీ, డిప్లొమా, 15 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన 184 మంది విద్యార్థులు, 59 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన 426 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేశారు. 14 డిప్లొమా కోర్సులకు చెందిన 178 మంది విద్యార్థులు డిప్లొమాలు ప్రదానం చేశారు. వివిధ విభాగాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల బంగారు పతకాలు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 8 మందికి మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు.
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ 90.0 'భవ్యవాణి'ని ప్రారంభించారు. దీనిని హిసార్‌లోని ఓం స్టెర్లింగ్ గ్లోబల్ విశ్వవిద్యాలయం జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగంలో నెలకొల్పారు. కేంద్ర మంత్రి ప్రసంగాన్ని స్టేషన్ ప్రసారం చేసింది. హిసార్ లోక్‌సభ ఎంపి శ్రీ బ్రిజేంద్ర సింగ్, హర్యానా పట్టణ స్థానిక సంస్థల మంత్రి డాక్టర్ కమల్ గుప్తా మరియు ఇతర ప్రముఖులు స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
హిసార్‌లోని దూరదర్శన్ కేంద్రం మరియు ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌లను కేంద్ర మంత్రి సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు.
***
(Release ID: 1880865)
Visitor Counter : 155