సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక వార్షిక ఉపన్యాసాన్ని డిసెంబర్ 3, 2022న ప్రసారం చేయనున్న ఆల్ ఇండియా రేడియో
ప్రతిష్టాత్మక స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించనున్న లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
ఆల్ ఇండియా రేడియో పూర్తి నెట్‌వర్క్‌లో రాత్రి 9.30 గంటల నుంచి ప్రసారం
డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసాన్ని రాత్రి 10.30 గంటల నుంచి ప్రసారం చేయనున్న దూరదర్శన్ న్యూస్
Posted On:
02 DEC 2022 3:36PM by PIB Hyderabad
డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక వార్షిక ఉపన్యాసాన్ని ఆల్ ఇండియా రేడియో శనివారం, డిసెంబర్ 3, 2022న ప్రసారం చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక స్మారక ఉపన్యాస కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఆల్ ఇండియా రేడియో పూర్తి నెట్‌వర్క్‌లో రాత్రి 9.30 నుంచి ప్రసారం అవుతుంది. 100.1 ఎఫ్‌ఎం గోల్డ్, 102.6 ఎఫ్‌ఎం రెయిన్‌బో, ఆల్ ఇండియా రేడియో ఛానెళ్లు, ట్విట్టర్‌లో @airnewsalerts, న్యూస్‌ఆన్‌ఎయిర్ యూట్యూబ్ ఛానెల్, న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు ఈ ప్రసారాన్ని వినవచ్చు.
డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసాన్ని అదే రోజు రాత్రి 10.30 గంటల దూరదర్శన్ న్యూస్ ప్రసారం చేస్తుంది.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం ఉపన్యాస అంశంగా "అమృత్ కాల్ మే భారతీయత"ను నిర్ణయించారు.
డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసం గురించి:
నిరాడంబరతకు ప్రతిరూపం, విద్యావేత్త, రాజ్యాంగ సభ అధ్యక్షుడు, మది నిండా భారతీయతను నింపుకున్న వ్యక్తి, భారతదేశ మొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ స్మారకార్థం డా.రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్ - ఎయిర్) ఏటా నిర్వహిస్తుంది.
ఈ ఉపన్యాసాల పరంపర గౌరవ సంప్రదాయం 1969 నుంచి ప్రారంభమైంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయీ, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు, హజారీ ప్రసాద్ ద్వివేది, మహాదేవి వర్మ, హరివంశ్ రాయ్ బచ్చన్ వంటి సాహితీవేత్తలు ఈ ప్రతిష్టాత్మక స్మారక ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశ సాంస్కృతి, పురోగతి వంటి విస్తృత విషయాల మీద చర్చించారు.
భారతదేశ మొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ఈ ఉపన్యాసం రికార్డింగ్‌ను ఆల్ ఇండియా రేడియో పూర్తి నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తారు. దేశ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వాతావరణం గురించి ఈ ఉపన్యాసాల పరంపర చర్చిస్తుంది. భారతదేశం సాధించిన విజయాలు, భవిష్యత్ అవకాశాలను కూడా ఈ ఉపన్యాసాల ద్వారా విమర్శనాత్మకంగా విశ్లేషిస్తారు.
***
(Release ID: 1880595)
Visitor Counter : 214