రైల్వే మంత్రిత్వ శాఖ
ప్యాసెంజర్ విభాగంలో 76% పెరిగిన రైల్వేల ఆదాయం
రిజర్వడ్ ప్యాసెంజర్ సెగ్మెంట్‌లో 50%, అన్‌రిజర్వడ్ ప్యాసెంజర్ సెగ్మెంట్‌లో 422% వృద్ధిని నమోదు చేసిన రైల్వేలు
Posted On:
02 DEC 2022 2:43PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు మూలాధార ఆధారంగా ఏప్రిల్ నుంచి నవంబర్ 2022 వరకు మొత్తం రూ. 43324 కోట్లను ఆదాయాన్ని గడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 24631 కోట్లతో పోలిస్తే 76 శాతం ఎక్కువ.
రిజర్వడ్ ప్యాసెంజర్ వర్గంలో, 1 ఏప్రిల్ నుంచి 30 నవంబర్ 2022 మొత్తం బుక్ చేసున్న మొత్తం ప్యాసెంజర్ల సంఖ్య 5365 లక్షలు. కాగా గత ఏడాది 4860 లక్షలతో పోలిస్తే ఇది10% ఎక్కువ. రిజర్వడ్ ప్యాసెంజర్ వర్గం నుంచి 1 ఏప్రిల్ నుంచి 30 నవంబర్ 2022 వరకు వచ్చిన ఆదాయం రూ. 34303 కోట్లు. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 22904 కోట్లతో పోలిస్తే 50% ఎక్కువ.
అన్‌రిజర్వడ్ ప్యాసెంజర్ సెగ్మెంట్‌లో 1 ఏప్రిల్ నుంచి 30 నవంబర్ 2022 కాలానికి బుక్ చేసుకున్న మొత్తం ప్యాసెంజర్ల సంఖ్య 35273 లక్షలు. గత ఏడాది ఇదే కాలంలో బుక్ చేసుకున్న ప్యాసెంజర్ల సంఖ్య 13813. ఇది 155% పెరుగుదల. అన్‌రిజర్వడ్ ప్యాసెంజర్ సెగ్మెంట్‌లో 1 ఏప్రిల్ నుంచి 30 నవంబర్ 2022 వరకు ఆర్జించిన ఆదాయం రూ. 9021 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1728 కోట్లతో పోలిస్తే 422% పెరుగుదల.
***
(Release ID: 1880594)
Visitor Counter : 144