రక్షణ మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ ఉద్యోగాలలో మాజీ అగ్నివీర్‌లకు రిజర్వేషన్ పై భారత రక్షణ పరిశ్రమతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
01 DEC 2022 9:15AM by PIB Hyderabad
కంపెనీల కార్పొరేట్ నియామక ప్రణాళిక కింద మాజీ అగ్నివీర్‌లకు లాభదాయక ఉపాధి అవకాశాలు కోరేందుకు భారత రక్షణ ఉత్పత్తిదారుల సమాజం నేతృత్వంలో భారతీయ రక్షణ పరిశ్రమతో నవంబర్ 30, 2022న సమావేశ సెషన్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సెషన్‌కు రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ ఆరమానే అధ్యక్షత వహించారు. ప్రధానమైన భారత రక్షణ పారిశ్రామిక సంస్థలు ఎల్&టి, అదానీ డిఫెన్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం లిమిటెడ్, అశోక్ లేలాండ్, తదితర సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఈ చర్చలో పాల్గొన్నారు.
దేశ నిర్మాణంలో నిమగ్నమైన వివిధ రంగాలలో పూర్తి అంకితభావం, క్రమశిక్షణ, కలిగిన యువతకు లాభదాయక ఉపాధిని కల్పించే లక్ష్యంతో సాయుధ దళాలతో పని చేసిన అగ్నివీర్‌ల నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని రక్షణ కార్యదర్శి పట్టి చూపారు. సాయుధ దళాలలో పని చేసిన సమయంలో అగ్నివీర్‌లు గడించిన నైపుణ్యాలు పరిశ్రమతో ఉత్పాదకమైన, ఫలవంతమైన పని కోసం సంసిద్ధంగా ఉన్న అత్యంత సమర్ధవంతమైన, వృత్తిపరమైన శ్రామిక శక్తిని నిర్మించేందుకు తోడ్పడతాయి.
ఈ కృషిలో తమ తిరుగులేని తోడ్పాటును, నిబద్ధతను వ్యక్తం చేయడమే కాక, సాయుధ దళాలో నిర్ణీత కాలాన్ని పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్‌లను తమ సంస్థలలోకి తీసుకునేందుకు సినియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నైపుణ్యాల ఆధారంగా అగ్నివీర్‌లకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ నియామక విధానాలలో తగిన ప్రొవిజన్లను చేస్తామని వారు హామీ ఇచ్చారు. పరిశ్రమ అవసరాలు, అగ్నివీర్‌లు నేర్చుకున్న నైపుణ్యాల మధ్య వంతెనను నిర్మించేందుకు కొన్ని సూచనలు చేశారు.
పాల్గొన్నవారి నుంచి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను గుర్తిస్తూ, భారతీయ రక్షణ ఉత్పత్తిదారులు తమ హామీకి కట్టుబడి ఉండి, సాధ్యమైనంత వేగంగా కార్పొరేట్ నియామక ప్రణాళిక కింద తమ విధాన్ని ప్రకటించవలసిందిగా రక్షణ కార్యదర్శి కోరారు.
***
(Release ID: 1880441)