ప్రధాన మంత్రి కార్యాలయం

జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణ ను భారతదేశం ఈ రోజు న మొదలుపెడుతున్నది


- శ్రీ నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Posted On: 01 DEC 2022 9:59AM by PIB Hyderabad

జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాల ను అందించాయి. ఆ ఫలితాల లో స్థూల ఆర్థిక స్థిరత్వాని కి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమం గా వ్యవస్థీకరించడం, దేశాల కు రుణ భారాన్ని తగ్గించడం వంటి ఫలితాలు సహా మరెన్నో మహత్వపూర్ణమైనటువంటి పరిణామాలు కూడా భాగం అయ్యాయి. ఈ కార్యసాధన ల తాలూకు లాభాల ను మనం అందుకొన్నాం; అంతేకాదు, ఇక్కడి నుండి మరింత ముందుకు కూడా మనం సాగిపోతాం.

ఏమైనా, భారతదేశం తనకు అప్పగించినటుంటి ఈ యొక్క ముఖ్యమైన పదవి ని స్వీకరిస్తున్న తరుణం లో, నన్ను నేను ఒక ప్రశ్న వేసుకొంటున్నాను. ఆ ప్రశ్న ఏమిటి అంటే అది జి20 ఇంకా ముందుకు పోగలుగుతుందా? అనేదే. యావత్తు మానవాళి కి ప్రయోజనం అందేటట్టు గా, మనస్తత్వం లో మౌలికం గా పరివర్తన ను తీసుకువచ్చే ఒక ఉత్ప్రేరకం వలె మనం పనిచేయగలుగుతామా?

మనం దీనిని సాధించగలం అని నేను నమ్ముతాను.

మనం ఎటువంటి పరిస్థితుల లో ఉన్నామో అనే దానిని బట్టే మన మనస్తత్వాలు రూపు దాల్చుతాయి. చరిత్ర పర్యంతం, మానవ జాతి లోటుపాటు ల మధ్యన జీవిస్తూ వచ్చింది అని చెప్పాలి. పరిమితం గా ఉన్నటువంటి వనరుల కోసం మనం ఒకరి తో మరొకరం పోట్లాడుకొంటూ వచ్చాం. దీనికి కారణం, మన అస్తిత్వం అనేది ఆయా వనరుల ను ఇతరుల కు దక్కకుండా చూడడం పైన ఆధారపడి ఉండడమే. ఎదుర్కోవడం మరియు పోటీ పడడం అనేవి ఆదర్శాలు గా అయిపోయాయి. ఈ ప్రతిఘటన , స్పర్ధ లు అనేవి విభిన్న భావాల కు, సిద్ధాంతాల కు మరియు గుర్తింపుల కు మధ్య తలెత్తాయి.

దురదృష్ట వశాత్తు, మనం ఇప్పటికీ కూడా అదే తరహా శూన్య సారాంశ మనస్తత్వం యొక్క వల లో చిక్కుకుపోయి ఉన్నాం. ఒక ప్రదేశం గురించో, లేదా వనరుల గురించో దేశాలు జగడానికి దిగినప్పుడు ఈ అంశం మన కళ్ల కు కనిపిస్తుంది. నిత్యవసర వస్తువుల సరఫరాల ను ఆయుధాల వలె ఉపయోగించుకొంటున్నప్పుడు దీనిని మనం గమనించగలుగుతున్నాం. టీకామందు ల అలభ్యత తో వందల కోట్ల కొద్దీ ప్రజలు అల్లాడుతూ ఉంటే కొన్ని వర్గాలు ఆ వేక్సీన్ లను దాచిపెట్టుకొనే పోకడ ను పోతున్నప్పడు దీనిని మనం గ్రహించగలుగుతాం.

ఎదురు తిరగడం, ఇంకా దురాశ అనేవి మానవ స్వభావం లో భాగాలే అంటూ కొంత మంది ఓ వాదన ను లేవదీస్తే లేవదీయవచ్చును. ఈ వాదన ను నేను ఒప్పుకోను. మనుషులు స్వత:సిద్ధం గా స్వార్థపరులు అయి ఉంటే మరి మన అందరిలోనూ మౌలికం గా ఉన్న ఏకత్వాన్ని గురించి అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు అనాది గా ఘోషిస్తూ వచ్చాయి కదా, ఆ విజ్ఞ‌ప్తి ని ఏ విధం గా అర్థం చేసుకోవాలి?

అటువంటి ఒక సంప్రదాయమే ప్రాణులు అన్నిటి ని, చివర కు ప్రాణం లేని వాటి ని కూడాను, అయిదు తత్త్వాల తో ఏర్పడినవి గా చూడడం జరుగుతున్నది. ఈ సంప్రదాయం భారతదేశం లో ప్రజాదరణ కు పాత్రం అయింది. ఆ పంచ తత్వాలు ఏవేవి అంటే అవి నేల, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం అనేవే. ఈ మూలకాల మధ్యన గల సామంజస్యం మన లోపల మరియు మన అందరి మధ్య సైతం నెలకొనడం జరిగిందా అంటే అప్పుడు అది మన భౌతిక, సామాజిక మరియు పర్యావరణ శ్రేయాని కి ఎంతో ముఖ్యమైంది గా అవుతుంది.

ఈ ఏకత్వం తాలూకు సార్వత్రిక భావన ను ప్రోత్సహించడం కోసం భారతదేశం జి20 అధ్యక్ష స్థానం లో ఉంటూ పాటు పడనుంది. ఈ కారణం గానే, ‘ఒకే పృధ్వి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనేది మన ఇతివృత్తం గా ఉన్నది.

ఇది కేవలం ఒక నినాదం కాదు. ఇది మానవీయ పరిస్థితుల లో ఇటీవల వచ్చిన మార్పుల ను లెక్క లోకి తీసుకొంటుంది. ఆ స్థితిగతుల గుణాల ను గ్రహించడం లో మనమంతా ఉమ్మడి గా విఫలం అయ్యాం.

ప్రస్తుతం, ప్రపంచం లో ప్రజలందరి కనీస అవసరాల ను తీర్చడానికి చాలినంత ఉత్పాదనల ను తయారు చేసుకోగలిగేందుకు తగిన సాధనాలు మన దగ్గర ఉన్నాయి.

ప్రస్తుతం, మనం మన మనుగడ కోసం పోరాటానికి దిగవలసిన అగత్యం ఏమీ లేదు. నేటి మన యుగాని కి యుద్ధోన్ముఖ యుగం గా మారవలసిన పని లేదు. అలా అసలు జరగనే కూడదు.

ప్రస్తుతం, మనం ఎదుర్కొంటున్న జలవాయు పరివర్తన, ఉగ్రవాదం మరియు మహమ్మారులు అనే అతి పెద్దవి అయినటువంటి సవాళ్ళ కు పరిష్కారాల ను మన లో ఒకరితో మరొకరం పోరాడుకొంటుండడం ద్వారా గా కాకుండా కలిసికట్టుగా కృషి చేయడం ద్వారానే పరిష్కరించుకో గలుగుతాం.

సమస్త మానవాళి ఎదుర్కొనే సవాళ్ళ కు పరిష్కారాల ను అందించ గలిగే సాధనాల ను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం మనకు ప్రసాదిస్తుండడం అనేది మనం చేసుకొన్న అదృష్టం. మనం ప్రస్తుతం నివసిస్తున్న విశాల వర్చువల్ జగతి డిజిటల్ టెక్నాలజీ ల వ్యాప్తి ఎంతటి అపారమైందో చాటిచెబుతోంది.

ప్రపంచ దేశాల జనాభా లో ఆరింట ఒక వంతు ప్రజల కు ఆశ్రయాన్ని ఇస్తున్నటువంటి, మరి తన లో అనేకమైన భాషల ను, మతాల ను, ఆచారాల ను మరియు విశ్వాసాల ను ఇముడ్చుకొన్నటువంటి భారతదేశం ఈ విశాలమైన ప్రపంచం తాలూకు లఘు రూపం గా ఉన్నది అనవచ్చును.

సామూహిక నిర్ణయాల ను తీసుకొనేటటువంటి అతి ప్రాచీన సంప్రదాయాల కు నిలయం అయిన భారతదేశం ప్రపంచం లో ప్రజాస్వామ్యానికి మూలభూతమైన డిఎన్ఎ కు తన వంతు తోడ్పాటు ను అందిస్తున్నది. ప్రజాస్వామ్యాని కి జనని గా ఉన్న భారతదేశం లో జాతీయ ఏకాభిప్రాయం ఏ ఆజ్ఞ‌ ద్వారా నో రూపొందినది కాదు, లక్షల కొద్దీ స్వతంత్ర కంఠాలు ఒకే స్వరం లో ఆలాపించే శ్రావ్యమైన సంగీత బాణి గా దానిని అభివర్ణించవచ్చును.

ప్రస్తుతం, భారతదేశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది. మేం ఆచరిస్తున్న పౌర ప్రధాన పాలన నమూనా అనేది ఇటు మా ప్రతిభాశాలి యువత లో సృజనాత్మక ప్రతిభ ను పెంచి పోషిస్తూనే, అటు అత్యంత నిరాదరణ కు లోనైన మా పౌరుల ను గురించి శ్రద్ధ ను తీసుకొనేటటువంటిది గా కూడా ను ఉంది.

మేం దేశ అభివృద్ధి ప్రక్రియ ను పై స్థాయి నుండి కింది స్థాయి కి ప్రసరించేటటువంటి పాలన సంబంధి ప్రక్రియ కు భిన్నం గా పౌరులే నాయకత్వ స్థానం లో నిలచే ‘ప్రజా ఆందోళన’ గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేశాం.

మేం అందరికీ అందుబాటు లో ఉండేటటువంటి, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి, నిర్వహణ సులభతరం గా ఉండేటటువంటి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ను సృష్టించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొన్నాం. ఈ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కారణం గా సామాజిక సురక్ష, విత్తపరం గా అన్ని వర్గాల ను కలుపుకొనిపోవడం లతో పాటు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ వంటి విభిన్న రంగాల లో క్రాంతికారి ప్రగతి కూడా చోటు చేసుకొన్నది.

ఈ కారణాలు అన్నిటి రీత్యా భారతదేశం పోగేసుకొన్న అనుభవాలు ప్రపంచ స్థాయి పరిష్కార మార్గాల ను వెదకడం కోసం కావలసినటువంటి అంతర్ దృష్టి ని ప్రసాదించ గలుగుతాయి.

జి20 కి అధ్యక్షత వహించే కాలం లో, మేం భారతదేశం యొక్క అనుభవ సారాన్ని, భారతదేశం యొక్క జ్ఞానాన్ని మరియు భారతదేశం ఆవిష్కరించిన నమూనాల ను అన్యుల కోసం, మరీ ముఖ్యం గా అభివృద్ధిశీల దేశాల కోసం అవి అనుసరించదగ్గ విధం గా ప్రతిపాదించనున్నాం.

మన జి20 కూటమి ప్రాథమ్యాల ను- కేవలం జి20 భాగస్వామ్య దేశాల ను సంప్రదించడం తోనే సరిపెట్టకుండా, చాలా సందర్భాల లో వాటి అభిప్రాయాల ను వినిపించేందుకు అయినా అవకాశం లభించకుండా పోతున్న అటువంటి పేద దేశాలన్నిటి ని కూడా ను సంప్రదించడం ద్వారా - నిర్ణయించడం జరుగుతుంది.

మన ప్రాథమ్యాలు ఏ విధం గా ఉంటాయి అంటే అవి మనకు ఉన్నటువంటి ఒకే భూమిని సంరక్షించుకోవడం పైన, మన ఒకే పరివారంసభ్యుల మధ్య సద్భావన ను అంకురింపచేయడం పైన, అలాగే మన అందరి యొక్క ఏక భవిష్యత్తుపట్ల ఆశ ను చిగురింప జేయడం పైన శ్రద్ధ తీసుకొంటాయి.

మన భూ గ్రహాన్ని పోషించుకోవడం కోసం, ప్రకృతి విషయం లో ధర్మకర్తృత్వ భూమిక ను పోషిస్తూ వస్తున్నటువంటి భారతదేశం యొక్క సంప్రదాయాల వెలుగు లో దీర్ఘకాలం మనుగడ లో ఉండేటటువంటి మరియు పర్యావరణం తో స్నేహపూర్వకం గా నడుచుకొనేటటువంటి జీవన సరళుల లను మనం ప్రోత్సహించుకొందాం.

మానవ పరివారం సభ్యుల మధ్య పరస్పర సద్భావన ను పెంపొందింపచేయడం కోసం, ఆహారం, ఎరువులు మరియు చికిత్స ఉత్పత్తుల ను ప్రపంచవ్యాప్తం గా సరఫరా చేయడం లో రాజకీయాలు చోటు చేసుకోకుండా ఉండడానికి మనం కృషి చేద్దాం. మనం అటువంటి కృషి ని చేసినప్పుడు, భౌగోళిక ఉద్రిక్తత లు, రాజకీయ ఉద్రిక్తత లు సాటి మానవుల కు సంకట స్థితుల ను సృష్టించ జాలవు.

మన కుటుంబాల లో వలెనే ఎవరి అవసరాలు అయితే చాలా ఎక్కువ గా ఉంటాయో వారి ని గురించి మనం ముందు గా పట్టించుకొని తీరాలి.

మన భావి తరాల లో ఆశల ను రేకెత్తించడం కోసం, పెద్ద ఎత్తున విధ్వంసాన్ని కలగజేసేటటువంటి ఆయుధాల ద్వారా తలెత్తే ముప్పుల ను తగ్గించడం మరియు ప్రపంచ సురక్ష ను పెంపొందింప చేయడం అనే అంశాల పై అత్యంత శక్తిశాలి దేశాల మధ్య నిజాయితీ గల చర్చ జరిగేటట్టు మనం ప్రోత్సహించుదాం.

భారతదేశం అమలు పరచేటటువంటి జి20 కార్యక్రమాల పట్టిక అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటిది గాను, మహత్వాకాంక్షల తో నిండినది గాను, చేత లు ప్రధానమైంది గాను మరియు నిర్ణయాత్మకం అయింది గాను ఉంటుంది.

జి20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నెరవేర్చేటటువంటి కాలాన్ని సంరక్షణ, సద్భావం మరియు ఆశల తో కూడినటువంటి కాలం గా తీర్చిదిద్దడం కోసం ఏకతాటి మీద నిలబడదాం రండి.

మనిషి ప్రయోజనాల కు పెద్ద పీట ను వేసే తరహా ప్రపంచీకరణ కు తావు ను ఇచ్చే ఓ కొత్త వ్యవస్థ ను నిర్మించడం కోసం మనం కలసి పాటుపడదాం రండి.

 

***

 



(Release ID: 1880221) Visitor Counter : 300