సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వార్తల సేకరణలో వేగం కాదు ఖచ్చితత్వం ప్రధానం అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్


ప్రజల విశ్వాసాన్ని పొందడం లక్ష్యంగా బాధ్యతాయుత మీడియా సంస్థలు పని చేయాలి .. శ్రీ అనురాగ్ సింగ్

Posted On: 29 NOV 2022 1:49PM by PIB Hyderabad

'ఖచ్చితమైన సమాచారం అందించడం మీడియా ప్రధాన బాధ్యత. సమాచారాన్ని ప్రజలకు అందించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి' అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ 2022 ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 'సమాచార వ్యాప్తి వేగంగా జరగాలి. అయితే, ఇదే సమయంలో సమాచార ఖచ్చితత్వం కూడా అవసరం. ఖచ్చితత్వం అంశానికి మీడియా సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి' అని శ్రీ అనురాగ్ సింగ్ అన్నారు. పెరిగిన సామాజిక మాధ్యమాల సంఖ్యతో పాటు అవాస్తవ నకిలీ  వార్తల ప్రసారం కూడా పెరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు.నకిలీ వార్తల బెడద నుంచి  ఆ దిశగా, ఆధారం లేకుండా ప్రచురించిన వార్తలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాన్ని అందించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లో ప్రభుత్వం   ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలియజేశారు.

ప్రజల విశ్వాసాన్ని చూరగొనే అంశానికి మీడియా సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల విశ్వాసం చూరగొనే  దిశగా సంస్థలు పనిచేయాలని అన్నారు. పక్షపాతం లేకుండా నిజాయితీతో వార్తలు అందిస్తున్న దూరదర్శన్, ఆకాశవాణి  ప్రజల నమ్మకం, అభిమానం పొందాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీడియా పాత్ర కీలకంగా ఉంటుందని శ్రీ అనురాగ్ సింగ్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు రక్షించడం కీలకంగా ఉంటుందని అన్నారు. దీనిని గుర్తించి జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక లో మీడియా కు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 

 

కోవిడ్-19 సమయంలో ప్రజలకు మీడియా అందించిన సహకారం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్లకు పరిమితం అయిన ప్రజలకు బాహ్య ప్రపంచంతో మీడియా సంబంధాలు కల్పించిందని అన్నారు. కోవిద్ సమయంలో మీడియా ముఖ్యంగా దూరదర్శన్,ఆకాశవాణి అందించిన సేవలను మంత్రి ప్రశంసించారు. మహమ్మారి సమయంలో ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేసిన భారతదెశ మీడియా రంగం ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సందేశాలు, మార్గదర్శకాలు, ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన  ఆన్‌లైన్ సంప్రదింపులు దేశంలోని నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరికీ చేరేలా చేసిందని  ఆయన అన్నారు. కోవిద్ సమయంలో విధి నిర్వహణలో దాదాపు 100 మంది ప్రసారభారతి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి తెలిపారు. అయితే, బాధ్యత మరువకుండా ప్రసారభారతి ప్రజలకు సమాచారం అందించడంలో విజయం సాధించిందని మంత్రి అన్నారు. 

ప్రభుత్వ పాలనలో మీడియా భాగస్వామి కావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా ' ప్రజలు ప్రభుత్వం మధ్య మీడియా వారధిగా ఉండాలి. జాతీయ ప్రాంతీయ స్థాయిలో  నిరంతర అభిప్రాయాన్ని అందించాలి" అంటూ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని మంత్రి ప్రస్తావించారు. సంక్షోభ సమయంలో మీడియా పోషించాల్సిన  పాత్రపై మీడియా ప్రతినిధులకు అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాలతో ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్  శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. 

సమాచార రంగానికి చెందిన అంశాలపై ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ తో కలిసి భారతదేశం పనిచేస్తోందని శ్రీ అనురాగ్ సింగ్ తెలిపారు. ఈ విషంయంలో ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్  మీడియా అకాడమీతో కలిసి ప్రసారభారతి అనుబంధ శిక్షణా సంస్థ NABM కార్యక్రమాలు అమలు చేస్తున్నాదని మంత్రి వివరించారు. ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, ఫిజీ, మాల్దీవులు, నేపాల్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలతో సహా 40 దేశాలతో కంటెంట్ మార్పిడి, సహ-ఉత్పత్తి, సామర్థ్యం పెంపుదల మొదలైన రంగాలలో భారతదేశం  ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తేలిపోయారు. “కార్యక్రమాల మార్పిడి  కోసం మార్చి 2022 లో ప్రసార రంగంలో ఆస్ట్రేలియాతో భారతదేశం కలిసి పనిచేసింది.   రెండు దేశాల ప్రసారకర్తలు వివిధ రంగాలలో కలిసి కార్యక్రమాలు రూపొందించడం, కలిసి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.” అని మంత్రి అన్నారు. 

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో  ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను మసాగాకి వివరించారు. ప్రజా ప్రాముఖ్యత కలిగిన వార్తలను తమలో తాము పంచుకోవడంలో ఈ ప్రాంతంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్‌లు అమలు చేస్తున్న  ప్రయత్నాలను అభినందించారు.

ఆసియా-పసిఫిక్  ప్రాంతం భిన్నత్వంతో కూడి ఉందని, అయితే   ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ సభ్య దేశాల మధ్య   సారూప్యత ఉందని శ్రీ జావద్ మొట్టగీ అన్నారు.  విస్తృత భిన్నత్వంలో నిజమైన ఏకత్వాన్ని ప్రదర్శిస్తామని శ్రీ జావద్ మొట్టగీ పేర్కొన్నారు. 

ప్రసార భారతి సీఈవో  శ్రీ గౌరవ్ ద్వివేది తన స్వాగత ప్రసంగంలో టెలివిజన్ మరియు రేడియో ప్రసార సంస్థ  సమిష్టి ప్రయోజనాలు మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రసార సంస్థల  మధ్య ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ పో షిస్తున్న పాత్రను ప్రశంసించారు.  

 వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన 75 వ వార్షికోత్సవాన్ని భారతదేశం గర్వంగా నిర్వహిస్తున్న   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  ద్వారా  , మీడియా మరియు కమ్యూనికేషన్ రంగంలో దేశం సాధించిన విజయాలు పంచుకోవడానికి ఈ సదస్సు గొప్ప అవకాశం అని  శ్రీ గౌరవ్ ద్వివేది అన్నారు. గొప్ప వారసత్వం, విస్తారమైన వైవిధ్యం మరియు ప్రగతిశీల భారతదేశాన్ని ప్రపంచానికి చూపాలని మీడియా సంస్థలకు ఆయన సూచించారు. 

ప్రభుత్వ రంగ మీడియా సంస్థ అయిన  ప్రసార భారతి 59వ  ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ 2022 కు ఆతిధ్యం ఇస్తోంది.  ఈ సంవత్సరం  “ప్రజలకు సేవ చేయడం: సంక్షోభ సమయాల్లో మీడియా పాత్ర”  అనే అంశం ఇతివృత్తంగా సమావేశాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో సమాచార  ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, , సమాచార ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర,   ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ అధ్యక్షుడు   శ్రీ మసగాకి సతోరు,  ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ సెక్రటరీ జనరల్  జావద్ మొట్టగీ, సమక్షంలో  సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు సాధారణ సభను ప్రారంభించారు. లాభాపేక్ష రహిత, వృత్తిపరమైన సంఘంగా  ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్  పనిచేస్తోంది. ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతంలో  50 సంస్థల నుంచి 40 దేశాల నుంచి 300 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

 

***

 

 


(Release ID: 1879797) Visitor Counter : 177