ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వచ్చే కేంద్ర బడ్జెట్ 2023-24 కోసం బడ్జెట్ ముందస్తు సమావేశాలను ముగించిన - కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 28 NOV 2022 4:47PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్ 2023-24 కోసం 2022 నవంబర్, 21 తేదీ నుంచి, 28 తేదీ వరకు దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపు సమావేశాలకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. బడ్జెట్ ముందస్తు సమావేశాలు రోజు ఇక్కడ ముగిశాయి.

సమయంలో నిర్వహించిన నిర్ణీత ఎనిమిది సమావేశాల్లో ఏడు భాగస్వామ్య బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 110 కంటే ఎక్కువ మంది ఆహ్వానితులు పాల్గొన్నారు. భాగస్వామ్య బృందాలలో వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ; పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు; ఆర్థిక రంగం, మూలధన మార్కెట్లు; సేవలు, వాణిజ్యం; సామాజిక రంగం; కార్మిక సంఘాలు; కార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు, ఆర్థికవేత్తలు ఉన్నారు

 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ పంకజ్ చౌదరి, డా. భగవత్ కిషన్రావ్ కరద్; కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ T.V. సోమనాథన్; డి... కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్; ముఖ్య ఆర్థిక సలహాదారు డా. వి. అనంత నాగేశ్వరన్; డి..పి..ఎం. కార్యదర్శి శ్రీ తుహిన్ కాంత పాండే; ఆర్ధిక సేవల శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ జోషి; కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ గోవిల్; రెవెన్యూ శాఖ .ఎస్.డి. శ్రీ సంజయ్ మల్హోత్రా తో పాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలు / విభాగాల కార్యదర్శులు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

భాగస్వామ్య బృందాల ప్రతినిధులు, వచ్చే బడ్జెట్ కోసం చేసిన అనేక సలహాలు, సూచనల్లో - ఎం.ఎస్.ఎం.. లకు సహాయం చేయడానికి వీలుగా గ్రీన్ సర్టిఫికేషన్ కోసం అనువైన యంత్రాంగం; పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాలను పెంచేందుకు పట్టణ ఉపాధి హామీ కార్యక్రమం; ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ, ఆవిష్కరణ క్లస్టర్ల ఏర్పాటు; దేశీయ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి పథకాలు, విద్యుత్ వాహనాలపై పన్ను తగ్గింపు; .వి. విధానాన్ని ప్రవేశపెట్టడం; గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా భారతదేశాన్ని ప్రోత్సహించడానికి చర్యలు, సోషల్ ఇంపాక్ట్ కంపెనీల కోసం సోషల్ సెక్టార్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫండ్, కేర్ ఎకానమీ వర్కర్ల శిక్షణ, గుర్తింపు; పిల్లలకు పోర్టబుల్ సామాజిక ప్రయోజనం; నీరు, పారిశుద్ధ్యం కోసం జాతీయ నియంత్రణ సాధికార సంస్థ; అసంఘటిత కార్మికులకు .ఎస్..సి. కింద ప్రయోజనం; పబ్లిక్ క్యాపెక్స్ కొనసాగింపు; ఆర్థిక ఏకీకరణతో పాటు, తక్కువ కస్టమ్స్ సుంకాలు మొదలైనవి ఉన్నాయి.

తమ విలువైన సలహాలు, సూచనలు పంచుకున్నందుకు, సమావేశాల్లో పాల్గొన్న వారందరికీ, ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, 2023-24 బడ్జెట్ను రూపొందించేటప్పుడు వారి సలహాలు, సూచనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

 

 

*****

 


(Release ID: 1879674) Visitor Counter : 170