సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వాస్తవానికి అందరూ చిత్ర నిర్మాతలే అన్నదే సినిమా బండి యొక్క ప్రధాన ఇతివృత్తం స్వతంత్ర సినిమాకు హృదయపూర్వక నివాళి: రాజేష్ నిడిమోరు

Posted On: 28 NOV 2022 5:02PM by PIB Hyderabad

భారతీయ చలనచిత్రంలో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు మరియు కథాంశాలను వెతికే క్రమంలో..దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రూపొందించిన 'సినిమా బండి' అనే కామెడీ డ్రామాలో ఆటో డ్రైవర్ నుండి సినీ నిర్మాతగా వరకూ ఓ వ్యక్తి సాగించే ప్రయాణం హృదయాన్ని కట్టిపడేస్తుంది.

ఈ రోజు ఐఎఫ్‌ఎఫ్‌ఐ 53వ ఎడిషన్‌లో పిఐబి నిర్వహించిన ఐఎఫ్ఎఫ్‌ఐ టేబుల్ టాక్స్‌లో సినిమా బండి చిత్ర నిర్మాత రాజేష్ నిడిమోరు మాట్లాడుతూ ' ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం స్క్రిప్ట్ రాయడం నుండి నిర్మాతకు ఆలోచనను అందించడం, ఆపై నటీనటులు మరియు వేదికలను కనుగొనడం వరకు ముడిపడి ఉంది.." అన్నారు.

 

image.png

 

హాస్యం, వాస్తవంతో కూడిన ఈ చిత్రం నెట్‌ఫిల్క్స్‌లో ప్రీమియర్‌గా రెండు వారాల పాటు నెంబర్‌ వన్‌గా ట్రెండింగ్‌లో ఉంది. సరైన స్టూడియో, పేరున్న నటీనటులు లేకుండా ఈ సినిమా చేయడానికి ఏకైక కారణం కథనం మరియు నటన అని నిర్మాత రాజేష్ నిడిమోరు వివరించారు. 'సాధారణంగా హృదయపూర్వకంగా తీసిన స్వతంత్ర సినిమాకు ఈ చిత్రం హృదయపూర్వక నివాళి. మా కెరీర్‌లో స్వతంత్ర ప్రారంభాన్ని పునరుద్ధరించాలని మరియు మొదటి భావోద్వేగాన్ని మళ్లీ అనుభవించాలని నేను కోరుకున్నాను' అని చెప్పారు. ఈ చిత్రం నిజంగా మంచి వినోదాత్మక చిత్రంగా ఉంటుందని అలాగే వాస్తవమైన మరియు ప్రామాణికత దాని ప్రత్యేకతను కలిగి ఉన్నాయని కూడా నిర్మాత తెలిపారు. చిత్రనిర్మాతలు ఇతర చిత్రనిర్మాతలతో సంభాషించడానికి మరియు వారి ఆలోచనలను రూపొందించడానికి ఐఎఫ్‌ఎఫ్‌ఐ రూపొందించిన ఫోరమ్ ఖచ్చితంగా దేశంలోనే అత్యుత్తమమైన వేదిక అని రాజేష్ నిడిమోరు హైలైట్ చేశారు.

 

image.png


వాస్తవానికి ప్రతి ఒక్కరూ  చిత్రనిర్మాతలే. తమ అభిరుచికి అనుగుణంగా ఎవరైనా  సినిమా తీయవచ్చని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. 'మా నాన్న నాకు కెమెరా ఇచ్చినప్పుడు నా చిన్నతనం నుండి వ్యక్తిగతంగా ప్రేరణ పొందడం ద్వారా నేను దానితో ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది' అని దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల అన్నారు. సినిమాలో నటీనటులు నటించలేదు ఆ పాత్రల్లో జీవించారని తెలిపారు. నిజమైన నటనను పొందడానికి మేము కెమెరా సెటప్‌ను దాచి ఉంచామని చెప్పారు.

పాత్రల యొక్క వ్యక్తిత్వం మరియు గ్రామీణ చిత్రణ ప్రేక్షకులను నవ్విస్తుంది.  ఈ చిత్రం కర్ణాటకలోని ముల్బాగల్ తాలూకాన గ్రామంలో చిత్రీకరించబడింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే రచయిత వసంత్ మరింగంటి వివరిస్తూ ' కేవలం 20-25 ఇళ్లతో అందంగా,నీట్‌గా ఉన్న ఆ ఊరు..మా సినికు వేసిన సెట్‌గా ఉంది. షూటింగ్ చేయడానికి వాతావరణం చాలా సౌకర్యంగా ఉంది అలాగే కథకు సరిపోయింది" అని చెప్పారు.

image.png

 

కథాంశం:పేదరికంతో కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్ వీరబాబుకు తన ఆటోలో ఎవరో వదిలేసిన ఖరీదైన కెమెరా దొరుకుతుంది. గ్రామానికి చెందిన ఏకైక వివాహ ఫోటోగ్రాఫర్ గణపతి ఆ కెమారాను చూసి సూపర్ స్టార్‌ల బ్లాక్‌బస్టర్ సినిమాలను తీయడానికి సరిగ్గా ఇదే కెమెరా అని చెబుతాడు. దీంతో ఔత్సాహిక వీరబాబు 'సూపర్‌స్టార్' కెమెరాతో ఒక బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఫోటోగ్రాఫర్ సాయం తీసుకుని మొత్తం గ్రామాన్ని తన సినిమాలో నటింపజేస్తాడు. అలా ఆటోవాలా నుంచి సినిమావాళ్ల ప్రయాణం మొదలవుతుంది.


 

* * *



(Release ID: 1879665) Visitor Counter : 123