ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
‘‘గోవా లో కనీస సదుపాయాల ను మెరుగుపరచడం తో పాటు మౌలిక సదుపాయాల ను తీర్చిదిద్దడం అనేది ‘స్వయంపూర్ణ గోవా’ యొక్క దృష్టి కోణం గా ఉంది’’
‘‘గోవా ప్రభుత్వం రాష్ట్రం యొక్క అభివృద్ధి కి ఒక కొత్త నమూనా ను తీసుకువచ్చింది’’
‘‘మీ జీవనం లో అత్యంత ముఖ్యమైనటువంటి 25 సంవత్సరాలుప్రస్తుతం మొదలవుతున్నాయి. గోవా అభివృద్ధి తో పాటు 2047 కల్లా న్యూ ఇండియా అనే లక్ష్యాలు మీ ఎదుటఉన్నాయి’’
Posted On:
24 NOV 2022 12:14PM by PIB Hyderabad
గోవా ప్రభుత్వం ఆధ్వర్యం లో జరిగిన రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.
కేంద్రీయ స్థాయి లో రోజ్ గార్ మేళా భావన ను ప్రధాన మంత్రి ధన్ తేరస్ రోజు న ఆవిష్కరించారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయి లో పది లక్షల ఉద్యోగాల ను కల్పించడం లో నాంది. ఇక అప్పటి నుండి ప్రధాన మంత్రి గుజరాత్, జమ్ము & కశ్మీర్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల రోజ్ గార్ మేళా లను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటుగా ప్రభుత్వం లోని వివిధ విభాగాల లో నూతనం గా నియామకాలు జరిగిన వారందరి కి ఉద్దేశించిన ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సుల కోసం రూపుదిద్దుకొన్నటువంటి ‘కర్మయోగి ప్రారంభ్’ మాడ్యూల్ ను కూడా ప్రారంభించారు; అంతకు ముందు రోజు న, ఉద్యోగాల లోకి కొత్త గా చేర్చుకొన్న వారికి దాదాపు గా డెబ్భయ్ ఒక్క వేల నియామక లేఖల ను పంపిణీ చేయడం జరిగింది.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, నియామక పత్రాల ను అందుకొన్న యువత కు అభినందనల ను తెలిపారు. ఇది ఉద్యోగ కల్పన లో గోవా ప్రభుత్వం తీసుకొన్న ఒక ముఖ్యమైన చర్య గా ఉందని ఆయన అన్నారు. రాబోయే నెలల్లో గోవా పోలీసు శాఖ లో, ఇంకా ఇతర విభాగాల లో కొలువు ల భర్తీ కార్యక్రమాలు మరిన్ని జరగనున్నాయని ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘ఇది గోవా పోలీసు బలగాన్ని బలోపేతం చేస్తుంది; ఇది పౌరుల కు మరియు పర్యటకుల కు సురక్ష వ్యవస్థ ను పెంపొందింపచేస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘గడచిన కొన్ని వారాలు గా దేశం లో వివిధ రాష్ట్రాల లో రోజ్ గార్ మేళాల ను నిరంతరాయం గా నిర్వహించడం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కూడా వేల కొద్దీ యువతీ యువకుల కు నౌకరీల ను ఇస్తోంద’’ని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యువత సశక్తీకరణ కోసం డబల్ ఇంజన్ ప్రభుత్వాల పాలన లో ఉన్న రాష్ట్రాలు వాటి వాటి స్థాయిల లో ఈ తరహా ఉద్యోగ మేళాల ను ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గత ఎనిమిది సంవత్సరాల లో, గోవా అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ను పెట్టుబడి గా పెట్టిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. గోవా లో నిర్మాణాధీనం లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు లు మరియు సంధాన సంబంధి ప్రాజెక్టు లు చాలా మంది కి ఉపాధి ని కల్పించినట్లు గానే, దాదాపు గా 3వేల కోట్ల రూపాయల ఖర్చు తో రూపుదిద్దుకొని త్వరలో ప్రారంభం కానున్న మోపా లోని విమానాశ్రయం వేల మందికి బ్రతుకుతెరువు తాలూకు ఒక ప్రధానమైనటువంటి మూలం గా మారిందని ఆయన అన్నారు. ‘‘ ‘స్వయంపూర్ణ గోవా’ యొక్క దృష్టికోణం ఏమిటి అంటే అది రాష్ట్రం లో మౌలిక సదుపాయాల ను తీర్చిదిద్దుతూనే కనీస సదుపాయాల ను మెరుగుపరచాలదే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గోవా పర్యటన సంబంధి బృహత్ ప్రణాళిక మరియు విధానం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గోవా అభివృద్ధి కోసం ఒక కొత్త నమూనా తో ముందుకు వచ్చింది. ఈ నమూనా పర్యటన రంగం లో పెట్టుబడి కి గాను కొత్త అవకాశాల ను అందించింది. దీని ద్వారా పెద్ద సంఖ్య లో ఉపాధి కి ఉత్తేజం లభించింది అని ఆయన అన్నారు. గోవా లోని గ్రామీణ ప్రాంతాల కు ఆర్థికపరమైన బలాన్ని ఇవ్వడం కోసం తీసుకొంటున్న చర్యల ను గురించి, సాంప్రదాయిక వ్యవసాయం లో ఉపాధి ని పెంచడానికి తీసుకొంటున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, వరి ని, కొబ్బరి ని, జనుము ను మరియు మసాల దినుసులను పండిస్తున్న రైతుల ను, ఇంకా ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రక్రియ ను స్వయంసహాయ సమూహాల తో జత పరచడం జరుగుతోందన్నారు. ఈ ప్రయాస లు గోవా లో ఉపాధి, ఇంకా స్వతంత్రోపాధి సంబంధి నూతన అవకాశాల ను ఎన్నిటినో సృష్టిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు.
కొత్త గా ఉద్యోగ నియామకం పొందిన వారు గోవా అభివృద్ధి కోసం, అలాగే దేశం అభివృద్ధి కోసం కూడాను శ్రమించవలసింది గా ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘మీ యొక్క జీవన కాలం లో అత్యంత ముఖ్యమైనటువంటి 25 సంవత్సరాల కాలం ఇప్పుడు మొదలవుతోంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం గురించిన తన దృష్టికోణాన్ని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, 2047వ సంవత్సరం లో ఒక న్యూ ఇండియా ను సాకారం చేయాలి అనే లక్ష్యాన్ని ప్రస్తావించారు. ‘‘మీ ఎదుట గోవా అభివృద్ధి తో పాటే 2047వ సంవత్సరపు న్యూ ఇండియా ను సాకారం చేయాలనే లక్ష్యం సైతం ఉంది. మీరంతా పూర్తి సమర్పణ భావం తో, పూర్తి సన్నద్ధత తో మీ కర్తవ్య పథాన్ని తప్పక అనుసరిస్తారన్న నమ్మకం నాలో ఉంది’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
(Release ID: 1878549)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam