సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కాశ్మీరీ పండిట్ల విషాదాన్ని తెరకెక్కించి కాశ్మీరీ పండిట్లకు కలిగించిన కాశ్మీరీ పండిట్స్ సినిమా


'సినిమాలో నేను కార్చిన కన్నీళ్లు, అనుభవించిన కష్టాలు నటన కాదు.. వాస్తవం '

'వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారు'

Posted On: 23 NOV 2022 2:56PM by PIB Hyderabad

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా 1990లలో కాశ్మీరీ పండిట్‌లకు జరిగిన అన్యాయం, వారు అనుభవించిన క్షోభ, జరిగిన నష్టాన్ని  ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. కాశ్మీర్ ఫైల్స్  చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన  అనుపమ్ ఖేర్  గోవాలోని పనాజీలో జరుగుతున్న 53 వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం లో భాగంగా నిర్వహించిన  టేబుల్ టాక్ లో పాల్గొన్నారు . 

'వాస్తవ సంఘటనల ఆధారంగా కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిర్మాణం జరిగింది. చిత్రం తీయడానికి ముందు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన 500 తో సుదీర్ఘంగా మాట్లాడారు. హింస చెలరేగడంతో  1990 జనవరి 19 రాత్రి  కాశ్మీర్ లోయకు చెందిన 5 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లను వదిలి, అనుబంధాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాశ్మీరీ హిందువుగా నేను కూడా వ్యధను అనుభవించాను. అయితే, విషాదానికి దారి తీసిన కారణాలు తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. వాస్తవాలను దాచి పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి.విషాదాన్ని తెరకెక్కించడం ద్వారా  ద్వారా  కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఉపశమనం కలిగేలా చేసింది.” అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. 

తాను అనుభవించిన విషాదాన్ని  గుర్తు చేసుకున్న  అనుపమ్ ఖేర్  ది కాశ్మీర్ ఫైల్స్  తనకు కేవలం సినిమా  కాదని అన్నారు. భావోద్వేగంతో చిత్రంలో జీవించానని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.  "నేను వారి ఇళ్ల నుంచి బహిష్కృతులు అయిన  వ్యక్తులకు నేను ప్రాతినిధ్యం వహిస్తాను.  కాబట్టి, దాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో వ్యక్తీకరించడం గొప్ప బాధ్యత అని  నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో మీరు చూసే  నా కన్నీళ్లు, నా కష్టాలు అన్నీ నిజమే’’ అని వివరించారు. 

 కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తాను ఒక నటుడిగా కాకుండా ఒక మనిషిగా నటించి నిజ  జీవితంలో జరిగిన సంఘటనల వెనుక ఉన్న కారణాలు ఫ్రీ ఒక్కరికి అర్థం అయ్యేలా పాత్రకు న్యాయం చేశానని అన్నారు. అంతా అయిపోయిందని భావించడం తప్పు అన్నది చిత్రం ప్రధాన ఇతివృత్తం అని అనుపమ్ ఖేర్ అన్నారు. ' ఆశ అనేది ఎప్పుడూ ఉంటుంది' అని ఆయన అన్నారు. 

కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ప్రజలు సినిమాలు చూసే తీరులో మార్పు తెచ్చిందని అనుపమ్ ఖేర్ అన్నారు. ఓటిటీ అందుబాటులోకి రావడంతో ప్రజలు ఇతర దేశాలకు చెందిన చిత్రాలు, వివిధ భాషల్లో నిర్మాణం జరిగిన చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డారని పేర్కొన్నారు. 'వాస్తవ సంఘటనలు ఆధారంగా నిర్మాణం అయిన సినిమాల గొప్పతనాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. విజయం సాధించిన కాశ్మీరీ పండిట్స్ లాంటి చిత్రాలు దీనికి నిదర్శనం. పాటలు, హాస్య సన్నివేశాలు లేకుండానే కాశ్మీరీ పండిట్స్ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇది సినిమా సాధించిన విజయం' అని అనుపమ్ ఖేర్ అన్నారు. 

చిత్ర నిర్మాతలు ఒక భాషకు పరిమితం కారాదని అనుపమ్ ఖేర్ అన్నారు. ' భారత చలన చిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  తాము ఒక భాషలో చిత్రాన్ని నిర్మిస్తున్నాము అన్న భావనతో పని చేయాలి.  జీవితం కంటే పెద్ద సినిమా పరిశ్రమ పెద్దది ' అని అనుపమ్ ఖేర్ ఔత్సాహిక నిర్మాతలకు సలహా ఇచ్చారు.  

ఐఎఫ్ఎఫ్ఐ తో తనకున్న అనుబంధాన్ని అనుపమ్ ఖేర్ గుర్తు చేసుకున్నారు. 1985 లో 28 సంవత్సరాల వయస్సులో తొలిసారిగా తన చిత్రం  సారాంశ్ కోసం  ఐఎఫ్ఎఫ్ఐ  కి హాజరయ్యానని తెలిపారు. ' ఆ చిత్రం నేను 65 వయస్సు గల పాత్రలో నటించాను. దీంతో ఆ సమయంలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. 37 సంవత్సరాల తర్వాత 532 చిత్రాల అనుభవంతో మరోసారి ఐఎఫ్ఎఫ్ఐ కి రావడం ఎంతో ఆనందంగా ఉంది. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ప్రపంచంలో అత్యుత్తమ చిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది' అని అనుపమ్ ఖేర్ అన్నారు. 

ఒరియా సినిమా ప్రతీక్ష ను హిందీలో నిర్మిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. తండ్రి కొడుకు సంబంధాలు  నిరుద్యోగం ప్రధాన అంశంగా సినిమా ఉంటుందని వివరించారు. చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పారు. పిఐబి నిర్వహించిన పత్రికా గోష్టిలో  ప్రతీక్ష దర్శకుడు అనుపమ్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తానూ చిత్రాన్ని ఎన్నుకోలేదని చిత్రం తనను ఎంపిక చేసుకుందని వ్యాఖ్యానించారు. 

సారాంశం
కృష్ణ పండిట్ 1990 కాశ్మీరీ పండిట్ల మారణహోమాన్ని చూసి కాశ్మీర్ నుండి పారిపోయి  వచ్చిన తన తాతతో నివసిస్తున్న యువ కాశ్మీరీ పండిట్ శరణార్థి. పుష్కర నాథ్ పండిట్ తన జీవితాంతం ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడారు. కశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో తన తల్లిదండ్రులు చనిపోయారని కృష్ణ నమ్మిస్తాడు.  జెఎన్ యూ విద్యార్థి అయిన కృష్ణ పండిట్ తన  గురువు ప్రొఫెసర్ రాధికా మీనన్ ప్రభావంతో మారణహోమానికి వ్యతిరేకిస్తూ   తిప్పికొట్టాడు మరియు ఆజాద్ కాశ్మీర్ కోసం పోరాడాడు. కానీ అతను తన తాత చనిపోయిన తర్వాత మాత్రమే నిజం తెలుసుకుంటాడు.

***



(Release ID: 1878295) Visitor Counter : 163