పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం పై కాప్-19 తీసుకున్న నిర్ణయాలతో భారతదేశ హస్తకళ ఎగుమతిదారులకు భారీ ఉపశమనం

Posted On: 21 NOV 2022 3:14PM by PIB Hyderabad

 • ఇండియన్ రోజ్ వుడ్ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి నియమాలు సడలించడంతో ఊపందుకోనున్న  ఎగుమతులు 

• భారతదేశం కోరిక మేరకు ఎగుమతి నియమాలు సడలింపు 

అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాల ఆధారిత  అంశాల కూటమి   (CITES)   19 వ  సమావేశం  2022 నవంబర్ 14 న పనామాలో ప్రారంభమయింది.    25 వ తేదీ వరకు సమావేశం జరుగుతుంది. అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యంపై  కూటమి  చర్చలు జరుపుతుంది.

రోజ్ వుడ్ ( Dalbergia sissoo )  సమావేశం అనుబంధం II లో ఉంది. దీంతో ఈ జాతికి సంబంధించి జరిగే కార్యకలాపాలకు అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలం (CITES)పై ఏర్పాటైన కూటమి రూపొందించిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 కేజీలకు మించి బరువు ఉండే  ప్రతి సరుకుకు కూటమి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజ్ వుడ్ ఉపయోగించి భారతదేశంలో తయారవుతున్న ఫర్నిచర్, హస్తకళ వస్తువుల ఎగుమతులు దారుణంగా తగ్గిపోయాయి. అనుబంధం II లో రోజ్ వుడ్ ని చేర్చక ముందు భారతదేశం నుంచి ఏడాదికి 1000 కోట్ల రూపాయల (~129 మిలియన్ అమెరికా డాలర్లు ) విలువ చేసే ఫర్నిచర్, హస్తకళ వస్తువుల ఎగుమతులు జరిగేవి. అనుబంధం II లో రోజ్ వుడ్ ని చేర్చిన తర్వాత ఎగుమతులు 500- 600 కోట్ల రూపాయలకు  (~64 నుండి 77 మిలియన్ అమెరికా డాలర్లు) తగ్గిపోయాయి. రోజ్ వుడ్ ఉపయోగించి తయారు చేసే వస్తువుల ఎగుమతులు తగ్గిపోవడంతో దాదాపు 50,000 కళాకారుల  జీవనోపాధిపై ప్రభావం చూపింది.

భారతదేశం చేసిన ప్రతిపాదన మేరకు ఇండియన్ రోజ్ వుడ్ (డాల్బెర్జియా సిస్సూ)  ఉపయోగించి తయారు చేసే ఫర్నిచర్ మరియు కళాఖండాలు వంటి వస్తువుల పరిమాణాన్ని సమీక్షించడానికి  ప్రస్తుత సమావేశం నిర్ణయించింది.  భారతదేశ ప్రతినిధి వర్గంతో చర్చలు జరిపిన అనంతరం మొత్తం  సరుకులో ఒక్కొక్క వస్తువు బరువు 10 కిలోల కంటే తక్కువ ఉంటే  CITES అనుమతులు లేకుండా రవాణా చేయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. వస్తువుల తయారీలో ఉపయోగించే లోహాల బరువును మినహాయించి   రోజ్ వుడ్ బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల భారతదేశ హస్తకళ ఎగుమతిదారులకు భారీ ఉపశమనం కలుగుతుంది. 

నేపథ్యం 

2016లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP)   17 వ సమావేశంలో అనుబంధం II లో అన్ని జాతుల డాల్బెర్జియా జాతులను చేర్చడం జరిగింది. దీనితో  డాల్బెర్జియా  జాతుల ఆధారిత వస్తువుల  వాణిజ్యం కోసం CITES నిబంధనలను అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది.   భారతదేశంలో  డల్బెర్జియా సిస్సూ (నార్త్ ఇండియన్  రోజ్‌వుడ్  లేదా షిషమ్ ) జాతులు సమృద్ధిగా ఉన్నాయి.  వీటిని  అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చలేదు.   డల్బెర్జియా సిస్సూ  అంతరించిపోతున్న జాతి కాదని సమావేశం నిర్ధారించింది. అయితే, డాల్బెర్జియా ను వివిధ తరగతులుగా విభజించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వివిధ రూపాలు సంతరించుకున్న  డాల్బెర్జియా ను వివిధ వర్గాలుగా పరిగణించడం తగదని పేర్కొనడం జరిగింది. కస్టమ్స్ పాయింట్ వద్ద డాల్బెర్జియా  కలపను వేరు చేయడానికి అధునాతన సాంకేతిక సాధనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని దేశాలు పేర్కొన్నాయి.    పూర్తి చేసిన కలపను వేరు చేయడానికి స్పష్టమైన సాంకేతికత లేనందున CITES అనుబంధం:II జాబితా నుంచి  డాల్బెర్జియా జాతులను   తొలగించడానికి కాప్ అంగీకరించలేదు.  అయితే,  ప్రతి వస్తువుకు బరువు పరంగా ఇవ్వబడిన ఉపశమనం భారతీయ చేతివృత్తుల సంఘాల సమస్యను చాలా వరకు పరిష్కరిస్తుంది మరియు వారు ఉత్పత్తి చేసే వస్తువుల ఎగుమతులకు  ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

***


(Release ID: 1877858) Visitor Counter : 271