సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్ఫి-53లో తొలిసారిగా ఏర్పాటు చేసిన చలనచిత్ర సాంకేతికత ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
సినిమాల నిర్మాణం కోసం ఉపయోగించే అత్యాధునిక పరికరాలను ప్రదర్శించిన ప్రముఖ తయారీ సంస్థలు
గోవాలో జరిగిన ఇఫ్ఫి 2022లో చలనచిత్ర కళ/సినిమా, నిర్మాణ సౌందర్యానికి సంబంధించిన సాంకేతికత, వివిధ అంశాలను ప్రదర్శించే చలనచిత్ర సాంకేతికత ప్రదర్శనను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు (నవంబర్ 21, 2022న) ప్రారంభించారు. ఇఫ్ఫిలో ఈ తరహా ప్రదర్శన ఇదే తొలిసారి. ప్రదర్శన ప్రారంభోత్సవం తర్వాత, వివిధ స్టాల్స్, అత్యాధునిక పరికరాలు, సాంకేతికతలను మంత్రి పరిశీలించారు. ఆయా పరికరాలను ధరించి స్వయంగా అనుభూతి పొందారు.


ఇఫ్ఫిలో ఏర్పాటు చేసిన చలనచిత్ర సాంకేతికత ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఇఫ్ఫి-53లో ఏర్పాటు చేసిన చలనచిత్ర సాంకేతికత ప్రదర్శనలో చలనచిత్ర కళ/సినిమా, నిర్మాణ సౌందర్యానికి సంబంధించిన సాంకేతికత, వివిధ అంశాలను ప్రదర్శించారు. చలనచిత్ర కళ, నిర్మాణ సౌందర్యం, వివిధ అంశాలు కలిసి వీక్షకులకు గొప్ప అనుభవాన్ని మిగల్చడంలో సాంకేతికత ఎలా పని చేస్తుందన్న విషయాలను ఈ ప్రదర్శనకు హాజరైన చలనచిత్ర ఔత్సాహికులకు వివరించారు.
“సినీ నిర్మాణానికి సంబంధించిన అత్యుత్తమ సాంకేతికతను చిత్ర వేడుకల్లో భాగంగా చలనచిత్ర సాంకేతికత తొలి ప్రదర్శన తీసుకు వచ్చింది. కొత్తగా వచ్చిన సాంకేతికత గురించి తెలుసుకోవడానికి చలనచిత్ర విద్యార్థులు, నిపుణులకు ఇది సువర్ణ అవకాశం” అని ఎఫ్‌టీఐఐ డైరెక్టర్ సందీప్ షా హరే చెప్పారు.
ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ మైదానం కళ అకాడమీని ఆనుకుని ఉంది. నవంబర్ 21-27, 2022 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
ప్రముఖ సినీ పరికరాల తయారీ సంస్థలైన సోనీ, కెనాన్, జీస్, రెడ్, లైకా, అల్టాస్, డీజో, అపుచర్ లైట్స్, హన్స సినీ ఎక్విప్‌మెంట్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రస్తుత సినిమాల నిర్మాణంలో నిపుణులు ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలను వారు ప్రదర్శిస్తున్నారు. కెమెరాలు, లెన్స్‌లు, లైట్లు, గ్రిప్‌లు, కలర్ గ్రేడింగ్ సాఫ్ట్‌వేర్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఏఆర్, వీఆర్, ఆడియో మానిటర్లు, అకౌస్టిక్స్, రియల్ టైమ్ డబ్బింగ్, టాక్-బ్యాక్‌లు, ప్రిజర్వేషన్, రిస్టోరేషన్ మొదలైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. 7000 చ.మీ. విస్తీర్ణంలో ఉన్న ప్రదర్శనశాలలో స్టాల్స్‌తో పాటు, చర్చలు, వివిధ కార్యక్రమాల కోసం ప్రత్యేక స్థలాలను కూడా కేటాయించారు.

(Release ID: 1877849)
Visitor Counter : 237