వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
చౌకధరల దుకాణాల ఆర్ధిక వెసులుబాటును మెరుగుపరిచేందుకు వాటికి అదనపు రాబడి సమకూర్చే అవకాశాలను వెతకనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు :డిఎఫ్పిడి కార్యదర్శి
202324 నాటికి అన్ని ప్రభుత్వ పథకాలలో బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేసే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
:డిఎఫ్పిడి కార్యదర్శి
ఆహార కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన డిపార్టమెంట్ ఆఫ్ ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
Posted On:
19 NOV 2022 3:46PM by PIB Hyderabad
చౌకధరల దుకాణాలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ఉండేలా చూసేందుకు వాటికి అదనపు రాబడి సమకూర్చే అంశాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్వేషించనున్నట్టు ఆహారం, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా తెలిపారు. రాష్ట్రాలు,, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన
ఆహార కార్యదర్శులతో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు.
తమిళనాడు ప్రభుత్వ కార్యదర్శి ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న మెరుగైనవిధానంపై అత్యుత్తమ ప్రజంటేషన్ ఇచ్చారు. వివిధరకాల నాణ్యమైన సరకులు, చిరుధాన్యాలు, గ్రోసరీ వస్తువులు, ఈ చౌకధరల దుకాణాలలో విక్రయించే ఏర్పాటు చేశామని, అలాగే చౌకధరల దుకాణాలకు ఐఎస్ఒ సర్టిఫికేషన్ పొందేలా చేశామని తమిళనాడు కార్యదర్శి తమ ప్రెజెంటేషన్ లో తెలిపారు.

తమిళనాడు రాష్ట్రం చౌకధరల దుకాణాలను మెరుగుపరచడంలో నిరంతరం తీసుకుంటున్న చర్యలను డిఎఫ్పిడి కార్యదర్శి అభినందించారు. అలాగే చౌకధరల దుకాణాల పరివర్తన ప్రాధాన్యతను వారు నొక్కి చెప్పారు. డిఎఫ్పిడి కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఈ విభాగం అమలు చేస్తున్న వివిధ పథకాలు, బలవర్ధక బియ్యం పంపిణీ, ఒక దేశం ఒక కార్డు (ఒ ఎన్ ఒ ఆర్ సి), స్మార్ట్ పిడిఎస్, రూట్ ఆప్టిమైజేషన్ తదితర అంశాలను , వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులతో సవివరంగా చర్చించారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ఇస్తూ ఈ శ్రీ చోప్రా, డిఎఫ్పిడి అమలు చేస్తున్న వివిధ పథకాలకు రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయని అన్నారు.
2023–24 నాటికి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బలవర్దక బియ్యం ప్రొక్యూర్మెంట్, సరఫరా, పంపిణీలను నిర్ణీత కాలవ్యవధిలోగా అందించేందుకు ఆయా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిగా రాష్ట్రాలు,కేంద్ర పాలితమప్రాంతాలకు సూచించారు. ఎఫ్.సి.ఐ దేశవ్యాప్తంగా ఇందుకు చొరవ చూపుతున్నదని ఆయన అన్నారు.
ఒక దేశం, ఒక రేషన్కార్డు (ఒఎన్ ఒ ఆర్ సి) పథకం కింద ఆహారధాన్యాలను వివిధ ప్రాంతాలకు వలసవెల్ళి న వారికి అందించేందుకు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ పథకం వల్ల , ఇప్పటివరకు 91 కోట్లమంది పోర్టబిలిటీ సదుపాయాన్ని వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని నదంర్బార్ ప్రతినిధులు తాము చేపట్టిన చర్యలను వివరించారు.జిల్లా డాష్ బోర్డు ఏర్పాటు, వలసవచ్చిన వారి ప్రొఫైల్లను అందులోచూపినట్టు తెలిపారు. దీనివల్ల పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి వీలు కలిగిందనిచెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్ పి) సహకారంతో తమ విభాగం అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ ఎం ఎస్) గురించి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందులో వేలాది మంది రిజిస్టర్ చేసుకోగా, 34 వేల మంది కోర్సు పూర్తి చేసుకున్నట్టు సర్టిఫికేట్లు పొందారు. ప్రస్తుతం ఎల్ ఎం ఎస్ లో ఆరు మాడ్యూల్స్ ఉన్నాయి. మరిన్ని మాడ్యూళ్లను దీనికి జతచేయనున్నారు. ఇందుకు ఉపయోగపడే మరిన్ని టాపిక్లను తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విభాగం కోరింది. పిడిఎస్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని సామర్ధ్యాల నిర్మాణాన్ని ఎల్.ఎం.ఎస్ డిజిటలైజ్ చేసింది.
పిడిఎస్ సాంకేతికతను బలోపేతం చేసేందుకు తమ డిపార్టమెంట్ నూతన , సమగ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డిఎఫ్పిడి కార్యదర్శి తెలిపారు. డాటా ఆధారంగా నిర్ణయాలు జరిగే విధంగా దీనిని తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఈ పథకం మొత్తం పిడిఎస్ ఐటి వ్యవస్థను క్లౌడ్,న్యూఏజ్ టెక్నాలజీ ఆధారంగా నిర్వహించనున్ట్టు చెప్పారు. దీనిని స్మార్ట్ పిడిఎస్ అంటే స్కీమ్ ఫర్ మోడర్నైజేషన్ అండ్ రిఫార్మ్స్ త్రూ టెక్నాలజీ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆ ఆంగ్లంలో పిలవనున్నారు.సంక్షిప్తంగాదీనిని ఎస్.ఎం.ఎ.ఆర్.టి–పిడిఎస్ గా పిలుస్తారు. ఈ సదస్సుసందర్భంగా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం ఖాతాల ఖరారు, వాటి పెండింగ్ స్థితి,దీనిని మరింత మెరుగు పరిచి సమర్ధంగా తీర్చిదిద్దడం గురించి ప్రస్తావించారు. డిఎప్పిడి కార్యదర్శి, దీని గురించి వివరిస్తూ, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని, వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల ఖాతాలను వచ్చే ఆర్ధిక సంవత్సరం ముందు నాటికి పూర్తి చేస్తామన్నారు. మండీలలో ,ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆయన నొక్కిచెప్పారు. ఇది మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. టిడిపిఎస్ సప్లయ్ చెయిన్ కు సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇది లాజిస్టిక్ ఖర్చులను గణనీయంగా తగ్గించనుంది.అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఎపిఎస్, గోడౌన్ లను సమర్ధంగా వినియోగించుకోవడానికి ఉపకరిస్తుంది. ఉత్తరాఖండ్లో రూట్ ఆప్టిమైజేషన్పై ప్రపంచ ఆహార కార్యక్రమం అధ్యయనం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం 3 రాష్‌టరాల రూట్ ఆప్టిమైజేషన్ ను ప్రపంచ ఆహార సంస్థ చేపడుతోంది. 2023 మార్చి నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. ఈ డాటా సేకరణలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తమ మద్దతునివ్వాలని , ప్రాధాన్యతా పద్ధతిలో ఈ అధ్యయన ఫలితాలను అమలు చేసేందుకు వీలు కల్పించాలని అన్నారు.
డబ్ల్యుఎఫ్పి అభివృద్ధి చేసిన అన్నపూర్తి గ్రెయిన్ ఏటిఎం ప్రణాళిక గురించి కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది రెండు రకాల వస్తువులను పంపిణీ చేస్తుంది. 90 సెకన్లల ఇది 50 కేజిల ఆహారధాన్యాలను పంపిణీ చేస్తుంది. ఈ పరిష్కారం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి కార్మిక శ్రమను తగ్గించి ఆహార ధాన్యాలను పంపిణీచేయడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం 4 అన్నపూర్తి సొల్యూషన్లను గుర్గాం, డెహ్రాడూన్,, వారణాశి, భువనేశ్వర్ లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాక మరో ఆరు సొల్యూషన్లను గోరఖ్పూర్, లక్నో, షిల్లాంగ్, అహ్మదాబాద్, ముంబాయి, బెంగళూరులలో ఏర్పాటు చేయనున్నారు. ఈ అన్ని యూనిట్లను ప్రొ బోనో ప్రాతిపదికపై డబ్ల్యు ఎఫ్ పి ఏర్పాటు చేసింది. ఇది కాజువల్ వర్కర్లు, మైగ్రెంట్ వర్కర్లు, పారిశ్రామిక వర్కర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల వారు తమ పనిగంటలు అయిపోయిన అనంతరం ఆటోమేటిక్ పద్ధతిలో సరకులు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ పరిష్కారాలను పారిశ్రామిక కాంప్లెక్సులలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి కార్మికులు తమ కు రావలసిన సరకులను పనిప్రదేశం నుంచే తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది సాధారణ బ్యాంకింగ్ ఎటిఎం లాగా పనిచేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరారు.
వేర్ హౌసింగ్ డవలప్‌మెంట్, రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యు డిఆర్ ఎ)ఛైర్మన్ ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ, వేర్ హౌస్‌్ ల రిజిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్ (ఇ ఎన్ డబ్ల్యుఆర్) తనఖాకు సంబంధించి పరిస్థితిని మెరుగు పరిచేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ఆయా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ వేర్ హౌస్ లను డబ్ల్యుడిఆర్ ఎ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. అలాగే ఈ ఎన్ డబ్ల్యుఆర్ ప్రయోజనాలను వివరించారు. ఇది రైతులు పంట కోత తర్వాత ఇఎన్ డబ్ల్యుఆర్ వద్ద తనఖా పెట్టడం ద్వారా ఫైనాన్స్ పొందడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తులను విధిలేని పరిస్థితులలో తక్కువ ధరకు అమ్ముకునే స్థితిని తప్పిస్తుందని అన్నారు.
గత రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్.ఎం.ఎస్ )2022`23 లో గోధుమలను తక్కువగా ప్రొక్యూర్ చేశారని, అందువల్ల అన్ని రాష్ట్రాలు సకాలంలో గోధుమ పంటను నాటి, 2023`24 రబీ మార్కెటింగ్ సీజన్ లో మెరుగైన రీతిలో గోధుమ ప్రొక్యూర్‌మెంట్‌కు వీలు కల్పించాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.
ప్రోక్యూర్‌మెంట్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవలసిందిగా రాష్ట్రాలకు ప్రభుత్వం సూచించింది. అలాగే 20222`23 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ, మిల్లింగ్ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను మెరుగుపరచుకోవలసిందిగా రాష్ట్రాలను కోరడంజరిగింది. ఆహారధాన్యాల ప్రొక్యూర్‌మెంట్, మిల్లింగ్‌లలో పారదర్శకత పాటించాల్సిందిగా కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.ఆహార ప్రజా పంపిణీ విభాగం, ఆహార ధాన్యాలకు సంబంధించిన నాణ్యత మెరుగుపరిచే విషయంలో ఎప్పటికపప్పుడు కృషిచేస్తూ వస్తోంది.ఈ ధాన్యాన్ని ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అలాగే వివిధ సంక్షేమ పథకాల కింద సమాజంలోని పేద వర్గాలకు అందజేస్తూ వస్తున్నది. ఆహారధాన్యాల ప్రొక్యూర్‌మెంట్ నుంచి పంపిణీ వరకు అత్యంత పకడ్బందీ యంత్రాంగం, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ , వివిధ ప్రమాణాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలను సంప్రదిస్తూ వీటిని ఎప్పటికప్పుడు రూపొందించడం జరుగుతూ వస్తోంది.
***
(Release ID: 1877814)