సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

ప్రతినిధులందరికీ ప్రత్యేక చలనచిత్ర అనుభవాలను 53వ ఇఫ్ఫి అందిస్తుంది: భారత రాష్ట్రపతి

53వ ఇఫ్పి (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు విజయవంతం కావాలని కోరుకుంటూ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.

ఆసియాలోని ప్రఖ్యాత చలన చిత్రోత్సవాల్లో ఒకటైన ఇఫ్ఫి నిర్వాహకులకు, ప్రతినిధులకు, అతిథులకు శ్రీ ముర్ము అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను ప్రోత్సహించడంలో ఇఫ్ఫి సహకారం గొప్పదని చెప్పారు. ఈ వేడుక నిర్వహణ దక్షిణాసియాలో కీలక సత్సంబంధ వారధిగా నిలుస్తుందని; చిత్ర నిర్మాతలు, కళాకారులు, పరిశ్రమ నిపుణులు, సినీ ప్రముఖులు తమ ఆలోచనలను పరస్పరం మార్చుకోవడానికి, ఘనమైన అనుభవాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని రాష్ట్రపతి చెప్పారు.

సృజనాత్మక, వినోద మాద్యమంగా చలనచిత్రం నిలుస్తుందని రాష్ట్రపతి తెలిపారు. చలనచిత్రం అంటే దృశ్యం, శబ్ధం, కథా నైపుణ్యాలను అందించే మాద్యమం కాబట్టి, 53వ ఇఫ్ఫి వేడుక ప్రతినిధులందరికీ ప్రత్యేక చలనచిత్ర అనుభవాలను అందిస్తుందని తాను కచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రపతి సందేశ పూర్తి పాఠాన్ని ఈ దిగువన చదవవచ్చు.

 

 

****

iffi reel

(Release ID: 1877155) Visitor Counter : 195