రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో 1206 కోట్ల రూపాయల విలువగల 3 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన శ్రీ నితిన్ గడ్కరి
Posted On:
17 NOV 2022 2:49PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డురవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో 1206 కోట్ల రూపాయల విలువగల 3 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేశారు. పార్లమెంటు సభ్యులు శ్రీ రాజు బిస్త్, శ్రీ జయంత్ కుమార్ రాయ్, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ గడ్కరి, ప్రారంభోత్సవం జరుపుకున్న ప్రాజెక్టులలో ఎన్హెచ్ 31 లోని 615.5 కిలోమీటర్ వద్ద (ఊడ్లబరి) రెండు లైన్ల ఆర్.ఒ.బి లెవల్ క్రాసింగ్ స్థానంలో రోడ్డు నిర్మాణం కూడా ఉందన్నారు. ఎన్.హెచ్.31 (మైనాగురి) వద్ద లెవల్ క్రాసింగ్ స్థానంలో ఆర్.ఓ.బి అంతర్జాతీయ అనుసంధానతకు అద్భుతంగా ఉపకరిస్తుందన్నారు. ఈ రోడ్డు పనుల వల్ల ప్రమాదాలు తగ్గుతాయని, మెరుగుపడిన భద్రతా ప్రమాణాలతో ప్రయాణ దూరం, సమయం ఆదాఅవుతాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల అభివృద్ధితో పశ్చిమబెంగాల్లో, దేశ తూర్పు ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్ధిక ప్రగతి జరుగుతుందని, వ్యవసాయరంగం చెప్పుకోదగిన ప్రగతికి ఇది దోహదపడుతుందని అన్నారు.
సిలిగురిలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెల్లుచీటీ చెబుతూ సిలిగురి వద్ద ఎన్.హెచ్ 31 (నూతన ఎన్.హెచ్ 10)పై 4/6లేన్
నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ లేన్కు ఇరువైపులా సర్వీసు రోడ్డును కూడా నిర్మిస్తారు. ( ఎన్హెచ్ 31 పై ఎహెచ్ 02 ప్రాజెక్టు శివమందిర్ నుంచి సెవోక్ ఆర్మీ కంటోన్మెంట్వరకు కిలోమీటర్ 569.258 నుంచి 581.030 కిలోమీటర్ వరకు )ఇది ఈశాన్య ప్రాంతం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో అనుసంధానతను పెంపొందిస్తుంది.
***
(Release ID: 1876950)
Visitor Counter : 143