సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్ఫి 53 వర్ణమిశ్రమంః అధికారిక ఫెస్టివల్ కేటలాగ్
అందరూ చదివే పుస్తకాలనే నువ్వూ చదువుతుంటే, ఇతరులు ఆలోచించేదానికన్నా నువ్వు ఎక్కువ ఆలోచించలేవు, అంటాడు జపనీస్ రచయిత హరుకీ మురాకమి.ప్రస్తుతం ఇఫ్ఫి (ఐఎఫ్ఎఫ్ఐ) అనే సినిమా వేడుకకు మనం సంసిద్ధమవుతున్న తరుణంలో, మనం అందరూ చూసే సినిమాలే చూస్తే, మనం కూడా ఇతరులకు అనుభవంలోకి వచ్చినదానినే రుచి చూసి, ఆలోచించి జీవించగలం అని మనం అనుకోవలసిన అవసరం ఉంది.
ఫిల్మ్ పెస్టివళ్ళను ప్రత్యేకం చేసే లక్షణాలలో వారు మనకు అందించే కళాత్మక ప్రకాశపు పరిశీలనాత్మక సేకరణను అందించడం ప్రధానమైంది. ప్రస్తుతం 53వ ఎడిషన్ నిర్వహిస్తున్న తరుణంలో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రధాన లక్ష్యాలలో భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఉండే ప్రేక్షకుల సమక్షానికి ఉత్తమమైన భారతీయ, అంతర్జాతీయ సినిమాను తీసుకురావడం ఒకటి.
మనం సినిమాల వేడుకను ప్రారంభిస్తున్న నేపథ్యంలో, ఈ వేడుకల వర్ణమిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. భారతీయ సినిమా, అంతర్జాతీయ సినిమా కేటలాగ్‌ను ఒక్క క్షణం పరిశీలించండి.
ఇఫ్ఫి 53కి భారతీయ సినిమా కేటలాగ్ కోసం - ఇక్కడ క్లిక్ చేయండి
ఇఫ్ఫి 53కి అంతర్జాతీయ సినిమా కేటలాగ్ కోసం - ఇక్కడ క్లిక్ చేయండి
వ్యక్తిగతంగా గోవాలో జరుగుతున్న ఇఫ్ఫికి హాజరుకానున్నవారు చక్కటివాటిని ఎంచుకుని, ఈ వేడుక కారణంగా స్ఫూర్తి పొందాలన్న ఆకాంక్షకు అనుగుణంగా మీ వేడుకను రూపొందించుకోండి.
ఒకవేళ మీరు వ్యక్తిగతంగా గోవాలో వేడుకలకు హాజరుకాకపోతుంటే, ఆ చిత్రాల హారమన్నది మీరు సశరీరంగా కాకపోయినా మనస్సు, ఆత్మ, బుద్ధితో హాజరయ్యేందుకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం.
****
(Release ID: 1876826)
Visitor Counter : 196