మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) దరఖాస్తులు (కొత్తవి/పునరుద్ధరణ) సమర్పించడానికి గడువు తేదీ నవంబర్ 30, 2022 వరకు పొడిగింపు
प्रविष्टि तिथि:
17 NOV 2022 1:18PM by PIB Hyderabad
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని నవంబర్ 30, 2022 వరకు పొడిగించారు. పేద కుటుంబాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్' కింద కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తోంది. 8వ తరగతి తర్వాత బడి మానేస్తున్న వారిని అడ్డుకుని, చదువు కొనసాగించేలా వారిని ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు అందిస్తోంది. 9వ తరగతి నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ఏటా ఒక లక్ష కొత్త స్కాలర్‌షిప్‌లు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10 నుంచి 12వ తరగతి వరకు కొనసాగడానికి లేదా చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులు తిరిగి కొనసాగించడానికి ఉపకార వేతనాలు ఇస్తారు. స్కాలర్‌షిప్ మొత్తం సంవత్సరానికి రూ.12000/-.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో (ఎన్‌ఎస్‌పీ) చేర్చారు. విద్యార్థుల ఉపకార వేతన పథకాల కోసం రూపొందించిన ఏక గవాక్ష వేదిక ఇది. ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ స్కాలర్‌షిప్‌లు డీబీటీ పద్ధతిలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్) ద్వారా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి.
తల్లిదండ్రుల ఏడాది ఆదాయం రూ. 3,50,000/- కంటే మించని విద్యార్థులు ఈ ఉపకార వేతనం అందుకోవడానికి అర్హులు. స్కాలర్‌షిప్ పొందే విద్యార్థుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరు కావడానికి విద్యార్థులు 8వ తరగతి పరీక్షలో కనీసం 55% మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ విద్యార్థులకు 5% సడలింపు ఉంటుంది.
ధృవీకరణలో రెండు స్థాయిలు ఉంటాయి. మొదటి దశ (ఎల్1) ఇన్‌స్టిట్యూట్ నోడల్ అధికారి (ఐఎన్‌వో) స్థాయి, రెండో దశ (ఎల్2) జిల్లా నోడల్ అధికారి (డీఎన్‌వో) స్థాయి. ఐఎన్‌వో స్థాయి (ఎల్1) ధృవీకరణకు చివరి తేదీ 15 డిసెంబర్ 2022. డీఎన్‌వో స్థాయి (ఎల్2) ధృవీకరణకు చివరి తేజీ 31 డిసెంబర్ 2022.
***
(रिलीज़ आईडी: 1876825)
आगंतुक पटल : 210