ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేశియా లోని బాలి లో భారతీయ సముదాయం మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తోభేటీ అయిన ప్రధాన మంత్రి

Posted On: 15 NOV 2022 4:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా లోని బాలి లో భారతీయ ప్రవాసులు మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా 8 వందల మంది కి పైగా సభికులతో 2022 నవంబర్ 15వ తేదీ న సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాని కి ఇండోనేశియా నలు మూలల నుండి విభిన్న వర్గాల వారు పలువురు ఉత్సాహం గా తరలివచ్చారు.

ఇండోనేశియా కు మరియు భారతదేశాని కి మధ్య సన్నిహిత సాంస్కృతిక సంబంధాల ను గురించి మరియు నాగరకత సంబంధమైనటువంటి అంశాల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రస్తావించారు. ఉభయ దేశాల మధ్య చిరకాలం గా కొనసాగుతున్నటువంటి సాంస్కృతికపరమైన మరియు వ్యాపారపరమైన సన్నిహితత్వాన్ని ప్రముఖం గా ప్రదర్శించే ప్రాచీన ‘‘బాలి జాతర’’ సంప్రదాయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. వివిధ రంగాల లో ఇండోనేశియా కు మరియు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సమానతల ను గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు.

సముదాయం లోని సభ్యులు వారు వలసపోపయిన దేశం లో కఠోర శ్రమ ద్వారాను, సమర్పణ భావం ద్వారాను విదేశాల లో భారతదేశం యొక్క స్థాయి ని, గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నందుకు గాను వారిని ప్రశంసించారు. భారతదేశం-ఇండోనేశియా సంబంధాల లో సకారాత్మక పురోగతి ని గురించి, అంతేకాకుండా ఆ సంబంధాన్ని బలపరచడం లో భారతీయ సముదాయం సభ్యులు పోషిస్తున్న కీలక పాత్ర ను గురించి కూడా ఆయన మాట్లాడారు.

భారతదేశం యొక్క వృద్ధి గాథ ను గురించి, భారతదేశం యొక్క కార్యసిద్ధుల ను గురించి మరియు డిజిటల్ టెక్నాలజీ, విత్త రంగం, ఆరోగ్యం, టెలికమ్యూనికేశన్స్ మరియు అంతరిక్షం వంటి వివిధ రంగాల లో భారతదేశం వేస్తున్న గొప్ప ముందంజల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచం యొక్క రాజకీయ ఆకాంక్ష లు, ప్రపంచం యొక్క ఆర్థిక ఆకాంక్ష లు మరియు స్వయం సమృద్ధ భారతదేశం యొక్క దృష్టి కోణం అనేవి అభివృద్ధి విషయం లో భారతదేశం అనుసరిస్తున్న మార్గసూచి లో భాగం గా ఉన్నాయని, ఈ మార్గ సూచి ప్రపంచ హితం తాలూకు స్ఫూర్తి ని ఇముడ్చుకొందని కూడా ఆయ అన్నారు.

తదుపరి ప్రవాసీయ భారతీయ దివస్సమ్మేళనం 2023వ సంవత్సరం లో జనవరి 8వ తేదీ మొదలుకొని 10వ తేదీ వరకు మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో జరుగుతుందని, ఆ సమ్మేళనానికి హాజరు కావాలని, ఆ తరువాత గుజరాత్ లో నిర్వహించే గాలిపటాల ఉత్సవం లో కూడా పాల్గొనాలని సముదాయం సభ్యుల ను మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

***

 

 


(Release ID: 1876188) Visitor Counter : 148