రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆలిండియా టూరిస్టు వాహనాలు (ఆథరైజేషన్ లేదా పర్మిట్) నిబంధనలు, 2021లో మార్పులు తెస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ
Posted On:
15 NOV 2022 12:56PM by PIB Hyderabad
ఆలిండియా టూరిస్ట్ వెహికిల్ (ఆథరైజేషన్ లేదా పర్మిట్) నిబంధనలు, 2021లో మార్పులు తెస్తూ జిఎస్ఆర్ 815(ఇ) ముసాయిదా నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా& రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) 11 నవంబర్, 2022న జారీ చేసింది.
టూరిస్టు వాహనాల పర్మిట్ విధానాన్ని క్రమబద్ధీకరించి, సరళతరం చేయడం ద్వారా పర్యాటక రంగానికి చెప్పుకోదగిన ప్రోత్సాహాన్ని 2021లో నోటిఫై చేసిన నిబంధనలు అందించాయి.
ఇప్పుడు ప్రతిపాదిత ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ (పర్మిట్) నిబంధనలు, 2022తో, మరింత క్రమబద్ధీకరించి, బలోపేతం చేసేలా పర్యాటకుల పర్మిట్ విధానం ఉండనుంది.
ప్రతిపాదించిన నిబంధనల కీలక లక్షణాలు దిగువ పేర్కొన్నట్టుగా ఉన్నాయిః
1. ఆలిండియా పర్మిట్ దరఖాస్తుదారుల ప్రక్రియను సులభతరం చేసి, అనువర్తన భారాన్ని తగ్గించేందుకు, ఆలిండియా టూరిస్ట్ పర్మిట్‌ను, ప్రమాణీకరించే అంశాన్ని వేర్వేరు చేశారు.
2. పర్యాటక వాహనాల్లో మరిన్ని వర్గాలు, తక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు (పది కంటే తక్కువ) పర్మిట్ ఫీజులు తగ్గించాలని ప్రతిపాదించారు. తక్కువ సీటింగ్ సామర్ధ్యం గల చిన్న వాహనాలు కలిగిన చిన్నస్థాయి పర్యాటక ఆపరేటర్లకు ఇది గణనీయమైన ఆర్థిక ఊరటను అందించనుంది. వారు తమ వాహనం (నాలు) సీటింగ్ సామర్ధ్యానికి అనుగుణంగా తక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది కనుక వారికి ఊరట లభిస్తుంది.
3. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణను ప్రోత్సహించేందుకు ఆపరేటర్లకు ఎటువంటి ఖర్చు లేకుండా క్రమబద్ధీకరించిన నియంత్రణ పర్యావరణ వ్యవస్థను ప్రతిపాదించడం జరిగింది.
ముప్పై రోజుల లోగా అందరు భాగస్వాముల నుంచి వ్యాఖ్యలను, సూచనలను ఆహ్వానిస్తున్నారు.
గజెట్ నోటిఫికేషన్ కోసం దిగువన క్లిక్ చేయండి-
***
(Release ID: 1876182)
Visitor Counter : 168