ప్రధాన మంత్రి కార్యాలయం

బాలి లో జి20 శిఖర సమ్మేళనం లో భాగం గా ఆహార భద్రతమరియు శక్తి భద్రత అంశాల పై జరిగిన ఒకటో సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం 

Posted On: 15 NOV 2022 10:25AM by PIB Hyderabad

నమస్కారం,

సవాళ్ళ ను రువ్వుతున్న ప్రపంచ స్థితిగతుల లో జి20 కి సమర్థ నాయకత్వాన్ని ఇచ్చినందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో ను నేను మనసారా అభినందిస్తున్నాను. జలవాయు పరివర్తన, కోవిడ్ మహమ్మారి, యూక్రేన్ లో చోటు చేసుకొన్నటువంటి ఘటన క్రమాలు మరియు దానితో ముడిపడ్డ ప్రపంచ సమస్య లు.. ఇవి అన్నీ కలసికట్టుగా ప్రపంచం లో ఉపద్రవాన్ని కలగజేశాయి. ప్రపంచవ్యాప్తం గా సరఫరా వ్యవస్థ లు అతలాకుతలం అయిపోయాయి. ఇది ప్రపంచ దేశాలన్నిటా జీవనానికి అవసరమైన సరుకుల, నిత్యవసర వస్తువుల సరఫరాల కు సంకటం ఏర్పడింది. ప్రతి ఒక్క దేశం లో పేద ప్రజల కు ఎదురైన సవాలు మరీ గంభీరం గా ఉన్నది. వారు అప్పటికే రోజువారీ జీవనం లో అలసిపోతూ ఉన్నారు; ఈ రెండింత ల భారీ నష్టాని కి ఎదురొడ్డి నిలచే ఆర్థిక స్తోమత వారి కి లేదు. ఈ జోడు విపత్తు ల కారణం గా, ఈ స్థితి ని సంబాళించుకొనేందుకు అనువైన ఆర్థికమైన తాహతు ను వారు కోల్పోయారు. ఇటువంటి అంశాల లో ఐక్య రాజ్య సమితి వంటి బహుళ పక్ష సంస్థ లు విఫలం అయ్యాయి అని ఒప్పుకోవడానికి మనం వెనుకాడనక్కర లేదు. ఆయా సంస్థల లో తగిన సంస్కరణల ను తీసుకు రావడం లో మనమంతా వైఫల్యం చెందాం. అందువల్ల నేటి ప్రపంచం జి20 పైన ఎన్నో ఆశల ను పెట్టుకొంది. మన సమూహం యొక్క ప్రాసంగికత మరింత గా ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది.


శ్రేష్ఠులారా,

యూక్రేన్ లో యుద్ధ విరమణ మరియు దౌత్యం మార్గం వైపున కు తిరిగి వచ్చేందుకు ఒక దారి ని మనం అన్వేషించితీరాలి అని నేను పదే పదే చెబుతూ వచ్చాను. రెండో ప్రపంచ యుద్ధం గడచిన వందేళ్ల కు పైగా, ప్రపంచం లో భారీ నష్టాన్ని కలగజేసింది. తదనంతరం ఆ కాలం లోని నాయకులు శాంతి పథాన్ని అనుసరించడం కోసం ఒక గంభీరమైనటువంటి ప్రయాస ను చేపట్టారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. కోవిడ్ అనంతర కాలం లో ఒక సరిక్రొత్త ప్రపంచ వ్యవస్థ ను ఏర్పరచేటటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ప్రపంచం లో శాంతి కి, సద్భావన కు, ఇంకా భద్రత కు పూచీపడడం కోసం నిర్దిష్టమైన మరియు సామూహికమైన సంకల్పాన్ని చాటుకోవడం తక్షణ అవసరం అంటాను. వచ్చే సంవత్సరం లో- ఎప్పుడైతే జి20 బుద్ధుడు మరియు గాంధీ పుట్టిన పవిత్ర భూమి లో సమావేశం అవుతుందో- మనమందరం ప్రపంచానికి ఒక బలమైనటువంటి మరియు శాంతియుత సందేశాన్ని ఇవ్వడం కోసం సమ్మతి ని వ్యక్తం చేస్తామన్న విశ్వాసం నాలో ఉంది.

శ్రేష్ఠులారా,

మహమ్మారి కాలం లో, భారతదేశం తన 1.3 బిలియన్ మంది పౌరుల కు ఆహార భద్రత పరం గా పూచీపడింది. అదే కాలం లో, ఆహార ధాన్యాల ను అవసరమైన అనేక దేశాల కు కూడా సరఫరా చేయడమైంది. ఆహార భద్రత పరం గా చూసినప్పుడు ప్రస్తుతం తలెత్తిన ఎరువుల కొరత సైతం ఒక పెను సంకటం గా ఉన్నది. వర్తమాన కాలం లోని ఈ ఎరువుల కొరత అనేది భావి కాలం లో ఆహార సంకటం గా మారుతుంది. అదే జరిగితే, దానికి ప్రపంచం దగ్గర ఒక పరిష్కారమంటూ ఉండబోదు. ఆహార ధాన్యాలు, ఎరువులు.. ఈ రెండిటికి సంబంధించిన సరఫరా వ్యవస్థ స్థిరం గా, బరోసా ను ఇచ్చేది గా ఉండేటట్లు చూడడానికి మనం పరస్పరం అంగీకారాని కి రావాలి. భారతదేశం లో, స్థిరత్వం కలిగిన ఆహార భద్రత కై మేం ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీనికి తోడు, చిరుధాన్యాల వంటి పుష్టికరమైన మరియు సాంప్రదాయికమైన ఆహార ధాన్యాల కు తిరిగి ప్రజాదరణ దక్కేటట్టు శ్రద్ధ ను తీసుకొంటున్నాం. చిరుధాన్యాలు ప్రపంచం లో పౌష్టికాహార లోపం మరియు ఆకలి అనే సమస్యల ను పరిష్కరించగలుగుతాయి. రాబోయే సంవత్సరం లో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని మనమంతా ఎక్కడ లేని ఉత్సాహం తోను అవశ్యం జరుపుకోవాలి మరి.


శ్రేష్ఠులారా,

భారతదేశం యొక్క శక్తి సంబంధి భద్రత ప్రపంచం లో వృద్ధి పరం గా చూసినా కూడాను ముఖ్యమైనటువంటిది గా ఉంది. ఎలాగంటే, ప్రపంచం లో కెల్లా అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం ఉంది కాబట్టి. శక్తి సరఫరాల పై ఎటువంటి ఆంక్షల ను అయినా సరే మనం ప్రోత్సహించకూడదు. దీనితో పాటు గా శక్తి బజారు లో స్థిరత్వానికి పూచీపడాలి. భారతదేశం స్వచ్ఛ శక్తి కి మరియు నిర్మలమైనటువంటి పర్యావరణానికి కట్టుబడి ఉంది. 2030వ సంవత్సరాని కల్లా మా యొక్క విద్యుత్తు అవసరాల లో సగ భాగాన్ని నవీకరణ యోగ్య వనరుల నుండి ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. శక్తి రంగం లో మార్పు అనే దిశ లో అందరినీ కలుపుకొని పోవడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల కు కాలబద్ధమైనటువంటి, భరించగలిగే స్థాయి లో ఉండేటటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు సాంకేతిక విజ్ఞానాన్ని నిలకడ గా సరఫరా చేస్తుండక తప్పదు.


శ్రేష్ఠులారా,

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించే కాలం లో, ఈ అంశాలన్నింటి పైన ప్రపంచ వ్యాప్తం గా ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం మనం పాటుపడదాం.


మీకు అందరికీ ఇవే ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి సందేశాని కి భావానువాదం. మూల ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

 

***

 (Release ID: 1876051) Visitor Counter : 197