సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిఐబికి చెందిన ఎలక్ట్రిక్‌ కార్‌ ఫ్లీట్‌ను ప్రారంభించిన సమాచార మరియు ప్రసారశాఖ , మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమశాఖ సహాయమంత్రి డాక్టర్‌ ఎల్‌. మురుగన్‌


పెట్రోల్ / డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లతో భర్తీ చేయడం వలన ఉద్గారాల తీవ్రత తగ్గుతుంది. తద్వారా మన నిబద్దత రుజువవుతుంది: డాక్టర్ ఎల్. మురుగన్

प्रविष्टि तिथि: 14 NOV 2022 5:46PM by PIB Hyderabad

ఈ రోజు ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఎలక్ట్రిక్ కార్ ఫ్లీట్‌ను మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మరియు సమాచార & ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి దార్శనికతను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం బహుముఖ విధానాన్ని తీసుకుందని వ్యాఖ్యానించారు.

 

 

డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ  ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను మరింత పెంచడానికి 2023 నాటికి భారత ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కొనుగోలు చేసే లేదా అద్దెకు తీసుకున్న కార్లలో కనీసం మూడింట ఒక వంతు కార్లు ఎలక్ట్రిక్‌గా ఉండేలా భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆ లక్ష్యాన్ని అధిగమించి ఈరోజు 14 కార్లను భర్తీ చేసినందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఆయన ప్రశంసించారు.

 

***


(रिलीज़ आईडी: 1876010) आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Odia , Tamil