భారత ఎన్నికల సంఘం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో స్వాధీనాలు
2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లో ఐదు రెట్లు పెరిగిన స్వాధీనాలు
ఎన్నికల్లో ధనబలం ముప్పును అరికట్టేందుకు సి-విజిల్ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించాలని
పౌరులను కోరిన ఈసీఐ
Posted On:
11 NOV 2022 12:51PM by PIB Hyderabad
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల చురుకైన భాగస్వామ్యంతో భారత ఎన్నికల సంఘం సమగ్ర ప్రణాళిక, సమీక్షల వల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో రికార్డు స్థాయిలో స్వాధీనాలు జరిగాయి. 2022, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సందర్భంగా, ప్రధాన ఎన్నికల కమీషనర్, శ్రీ రాజీవ్ కుమార్ ప్రలోభాలు లేని ఎన్నికల పై ప్రధాన దృష్టి పెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో గణనీయమైన మొత్తంలో జరిగిన జప్తులను ఉదహరించారు. ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే గుజరాత్‌లో రూ. 71.88 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో దాని ప్రభావం ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇది 2017 అసెంబ్లీ ఎన్నికలలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో జరిగిన స్వాధీనాలు విలువైన రూ. 27.21 కోట్లను కూడా అధిగమించింది. . అదేవిధంగా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా రూ.9.03 కోట్లతో పోలిస్తే రూ. 50.28 కోట్ల విలువైన జప్తులు జరిగి అవి ఐదు రెట్లు పెరిగాయి. ఇంకా, పౌరులు అప్రమత్తంగా ఉండి, సి-విజిల్ యాప్‌ను మరింత విస్తృతంగా ఉపయోగిస్తే, అది ఎన్నికల్లో ధనప్రభావాన్ని ఇంకా అరికట్టడంలో చాలా దోహదపడుతుంది.
సమర్థవంతమైన వ్యయ పర్యవేక్షణ ప్రక్రియ ఎన్నికల ప్రకటనకు నెలల ముందు ప్రారంభమైంది. అనుభవజ్ఞులైన అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించడం, మరింత సమన్వయం, సమగ్ర పర్యవేక్షణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సెన్సిటైజ్ చేయడం దీనిలో ముఖ్యమైన కార్యక్రమం. సమీక్షించడం, వ్యయ సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించడం, తగిన లభ్యత కోసం ప్రణాళిక వేయడం వంటి కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఎన్నికలను అడ్డుకోవడంలో ధనబలం పాత్రను అరికట్టాలనే ఉద్దేశ్యంతో పర్యవేక్షణ ప్రక్రియలో క్షేత్రస్థాయి బృందాలు, డీఈఓలు/ఎస్పీలతో నిరంతరంగా సమగ్ర పర్యవేక్షణ జరుగుతోంది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఇప్పటి వరకు (10.11.2022 నాటికి) జరిగిన స్వాధీనాల వివరాలు ఇలా ఉన్నాయి:
రాష్ట్రం
|
నగదు
|
మద్యం
|
మాదక ద్రవ్యాలు
|
విలువైన లోహాలు
|
ఉచితాలు
|
మొత్తం స్వాధీనం
|
|
(రూ.కోట్లలో)
|
పరిమాణం(లీటర్లలో)
|
విలువ (రూ.కోట్లలో)
|
విలువ (రూ.కోట్లలో)
|
విలువ (రూ.కోట్లలో)
|
విలువ (రూ.కోట్లలో)
|
(రూ. కోట్లలో)
|
హిమాచల్ ప్రదేశ్
|
17.18
|
972818.24
|
17.50
|
1.20
|
13.99
|
0.41
|
50.28
|
గుజరాత్
|
0.66
|
109189.19
|
3.86
|
0.94
|
1.86
|
64.56
|
71.88
|
గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించిన ప్రారంభ రోజులే అయినప్పటికీ, పోలీసుల చర్యల వల్ల రూ. 3.86 కోట్లు విలువైన సుమారు 1,10,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ కూడా రూ. 64 కోట్ల విలువైన బొమ్మలు, ఉపకరణాలు దిగుమతి కార్గోలో దాచడం ద్వారా అక్రమంగా రవాణా అవుతుండడాన్ని కనుగొన్నారు. వీటిని తప్పుగా ప్రకటించడంతో వాటిని ముంద్రా పోర్ట్‌లో భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. గుజరాత్ శాసనసభకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ధనబలాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, భారత ఎన్నికల సంఘం 69 మంది వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. 27 అసెంబ్లీ నియోజకవర్గాలు సున్నితమైనవిగా గుర్తించి ఈ నియోజకవర్గాల్లో నిశిత పర్యవేక్షణ పెట్టింది ఎన్నికల సంఘం. .
ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడానికి సెప్టెంబరులో కమిషన్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించింది. అలాగే అక్కడి ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించడానికి అక్టోబర్‌లో రెండు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు కూడా పర్యటించాయి. కమిషన్, రెండు రాష్ట్రాల్లో తన పర్యటన సందర్భంగా, ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన అంశాలను నిశితంగా, ప్రభావవంతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా అధికారులు, పోలీసు నోడల్ అధికారులపై విస్తృత సమీక్షలు జరిపారు. .
హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే, జిల్లాలు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సంసిద్ధతను సమీక్షిస్తూ, అక్రమ మైనింగ్ వ్యాపారం, మద్యం, అనుమానాస్పద నగదు చలామణి అయ్యే ప్రాంతాలపై గట్టి నిఘాను నొక్కి చెప్పారు. అదే తరహాలో, ప్రధాన భాగస్వామ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలలో ఒకటైన ఆదాయపు పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్, హిమాచల్ ప్రదేశ్, పరిసర రాష్ట్రాలలోని 27 ప్రాంగణాలలో స్టోన్ క్రషింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంది. దేశీయ మద్యం తయారీదారులు, వ్యాపారులపై ఆపరేషన్ నిర్వహించింది, ఇందులో లెక్కలో లేని నగదు స్వాధీనం చేసుకున్నారు. నిల్వ, ఖాతా నిర్వహణలో వ్యత్యాసాలను గమనించింది. సీజ్‌లు, ముఖ్యంగా మద్యం, డ్రగ్స్, ఉచితాలకు సంబంధించినవి కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కనుగున్నాయి. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు సార్వత్రిక ఎన్నికలలో ధన బలాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, భారత ఎన్నికల సంఘం 23 వ్యయ పరిశీలకులను కూడా నియమించింది.
బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ముగిసిన పోలింగ్‌లో రూ.9.35 కోట్ల భారీగా స్వాధీనాలు జరిగాయి. అత్యధిక వ్యయంతో కూడుకున్న తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సీజ్‌లు జరిగాయి, ఇక్కడ వేల లీటర్ల మద్యంతో పాటు రూ.6.6 కోట్ల నగదు, రూ. 1.78 కోట్ల విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నాయి, ఇది ఎన్నికలలో ధన బలం ముప్పును అరికట్టడానికి, ఖర్చు పర్యవేక్షణ ప్రక్రియపై కమీషన్ దృష్టిని పెంచింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సమగ్ర పర్యవేక్షణకు కమిషన్ అదనపు వ్యయ పరిశీలకుడిని నియమించింది. క్షేత్ర స్థాయిలో బృందాలు, పరిశీలకులతో వర్చువల్ సమావేశాల ద్వారా జిల్లా పరిపాలన, ఫీడ్‌బ్యాక్ సెషన్‌ల గురించి తరచుగా సమీక్షలు నిర్వహించాయి.
కమిషన్, నవంబర్ 7న, ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), డీజీపీలు, డీజీ (ఆదాయపు పన్ను, పరిశోధన), ఎక్సైజ్ కమిషనర్‌లు, ఐజీపీ (ఆపరేషన్స్), హిమాచల్ ప్రదేశ్, దాని పొరుగు రాష్ట్రాల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రలోభాలు, సరిహద్దుల సీలింగ్, అంతర్-రాష్ట్ర సరిహద్దు కదలికలపై నిఘా ఉంచడానికి తీసుకున్న చర్యలను సమీక్షించారు. గత 72 గంటల ప్రయత్నాల కోసం సెంట్రల్ అబ్జర్వర్‌లను కూడా కమిషన్ సమీక్షించింది. నిష్పక్షపాతంగా, ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వని విధంగా పోల్‌ను నిర్వహించడానికి అనుగుణంగా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో నిశిత పర్యవేక్షణపై ప్రయత్నాలు కొనసాగుతాయి. పట్టుబడిన గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
****
(Release ID: 1875554)
Visitor Counter : 175