ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

Posted On: 03 NOV 2022 1:24PM by PIB Hyderabad

నమస్కారం,

(ప్రసంగాన్ని మొదలుపెట్టేందుకు ముందు స్థానిక భాష లో కొన్ని మాట లు మాట్లాడడం జరిగింది.)

ఈ రోజు న మహారాష్ట్ర కూడా వివిధ ప్రభుత్వ విభాగాల లో ఉద్యోగాల కు సంబంధించి యువతీ యువకుల కు నియామక పత్రాల ను ఇచ్చేటటువంటి సామూహిక ఉద్యమం లో పాలు పంచుకొంది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల నౌకరీల ను కల్పించేందుకు ఒక ఉద్యమాన్ని ధన్ తేరస్ రోజు న మొదలు పెట్టింది. ఆ సందర్భం లో నేను చెప్పాను, రాబోయే రోజుల లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇదే విధమైన ఉద్యోగ కల్పన కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తాయి అని. దీనికి అనుగుణం గా, ఈ రోజు న, మహారాష్ట్ర లో వందల కొద్దీ యువతీ యువకుల కు నియామక పత్రాల ను ఇవ్వడం జరుగుతున్నది. నేను ఈ రోజు న నియామక పత్రాల ను అందుకొంటున్న యువతీయువకుల ను మనసారా అభినందిస్తున్నాను.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే గారి ని మరియు ఉప ముఖ్యమంత్రి భాయి శ్రీ దేవేంద్ర ఫడ్‌ ణవీస్ గారి ని కూడా ను నేను అభినందిస్తున్నాను. ఇంత తక్కువ కాలం లో రోజ్ గార్ మేళాను ఏర్పాటు చేయడం ద్వారా స్పష్టం అయింది ఏమిటి అంటే యువత కు ఉపాధి ని కల్పించే దిశ లో మహారాష్ట్ర ప్రభుత్వం బలమైన సంకల్పాల తో ముందుకు సాగిపోతోంది అనేదే. ఈ తరహా రోజ్ గార్ మేళాల ను రాబోయే కాలాల్లో మహారాష్ట్ర లో మరిన్నింటిని నిర్వహించడం జరుగుతుందని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. మహారాష్ట్ర లోని హోం డిపార్ట్ మెంట్ లో వేల కొద్దీ పోలీసు కానిస్టేబుల్స్ ను భర్తీ చేయడం జరుగుతుందని, మరి అదే మాదిరి గా గ్రామీణాభివృద్ధి విభాగం లో కూడాను ఒక నియామక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని నా దృష్టి కి వచ్చింది.

మిత్రులారా,

ప్రస్తుతం దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకొంటోంది. అభివృద్ధి చెందిన అటువంటి భారతదేశం అనే లక్ష్య సాధన కోసం దేశం కృషి చేస్తున్నది. ఈ లక్ష్యాన్ని సాధించుకోవడం లో ఒక కీలకమైనటువంటి పాత్ర మన యువతది, మీదే. మారుతున్న కాలాల్లో కొలువు ల స్వభావం ఎంత వేగం గా మారిపోతున్నాయో, అంతే వేగం గా ప్రభుత్వం కూడాను మారుతున్న సన్నివేశాల కు తగ్గట్టు వేరు వేరు విధాలైన ఉద్యోగాల కోసం అవకాశాల ను నిరంతరాయం గా సృజిస్తున్నది. ‘ముద్ర’ పథకం లో భాగం గా ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు సహాయాన్ని యువతీ యువకుల కు అందించింది. స్వతంత్రోపాధి కల్పన కోసం ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండానే రుణాల ను అందించడం అనేది ‘ముద్ర’ పథకం యొక్క ధ్యేయం గా ఉంది. ఈ పథకం తాలూకు గరిష్ఠ స్థాయి ప్రయోజనాల ను మహారాష్ట్ర కు చెందిన యువత అందుకొన్నారు. స్టార్ట్-అప్‌ స్ మరియు చిన్న తరహా పరిశ్రమ లు - ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప్రభుత్వం అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది, తద్వారా యువతీ యువకులు తమ ప్రతిభ ను ప్రదర్శించడానికి సరైన అవకాశాన్ని పొందుతారు.

మిత్రులారా,

ప్రభుత్వ ప్రయాసల పరం గా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అది ఉపాధి మరియు స్వతంత్రోపాధి సంబంధి అవకాశాలు దళితుల కు, వెనుకబడిన వర్గాల కు, ఆదివాసిల కు, సామాన్య వర్గాని కి మరియు మహిళల కు.. అందరి కి కూడా ను సమానం గా లభిస్తున్నాయి అనేదే. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల లో స్వయం సహాయ సమూహాల ను సైతం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. గడచిన 8 సంవత్సరాల లో 8 కోట్ల మంది మహిళ లు స్వయం సహాయ సమూహాల లో చేరారు. ఈ స్వయం సహాయ సమూహాల కు 5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సమూహాల తో జతపడ్డ మహిళ లు ప్రస్తుతం వారి సొంత ఉత్పాదనల ను రూపొందించడం ఒక్కటే కాకుండా ఇతర మహిళల కు కూడా ఉపాధి ని కల్పిస్తున్నారు.

మిత్రులారా,

ప్రస్తుతం దేశవ్యాప్తం గా మౌలిక సదుపాయాలు, సమాచార సాంకేతిక విజ్ఞానం, ఇంకా ఇతర రంగాల లో ప్రభుత్వం పెడుతున్న రికార్డు పెట్టుబడుల వల్ల ఉపాధి తాలూకు సరికొత్త అవకాశాలు నిరంతరాయమానం గా సృష్టి అవుతున్నాయి. మనం ఒక్క మహారాష్ట్ర ను గురించే మాట్లాడుకొంటే గనక, 2 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన దాదాపు 225 ప్రాజెక్టుల కు కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. ఈ ప్రాజెక్టు ల పనులు అయితే నిర్మాణాధీనం లో ఉండడమో, లేదా అతి త్వరలో ఆరంభం కానుండడమో జరుగుతుంది. మీరు ఊహించగలరు, మహారాష్ట్ర లో రైల్ వేల కోసం 75 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కు మరియు ఆధునిక రహదారుల కోసం 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కు ఆమోదం తెలపడమైంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం అంత పెద్ద మొత్తం లో బడ్జెటు ను వెచ్చిస్తూ ఉన్నప్పుడు, తద్ద్వారా లక్షల మంది కి నూతన ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి.

మిత్రులారా,

భవిష్యత్తు లో మహారాష్ట్ర లో యువతీ యువకుల కోసం ఇదే విధం గా ఉపాధి తాలూకు లెక్కలేనన్ని అవకాశాల ను సృష్టించడం అనేది తప్పక కొనసాగుతుంది అని నాకు నమ్మకం ఉంది. మరోసారి, ఈ రోజు న ఉద్యోగ నియామక పత్రాల ను అందుకొన్న యువతీ యువకులు అందరికి నేను శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి సందేశాని కి భావానువాదం. మూల ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

 

***

 



(Release ID: 1875115) Visitor Counter : 92