మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా 2022 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
"అవినీతి రహిత భారతదేశం – అభివృద్ధి చెందిన భారతదేశం” ఇతి వృత్తంగా కార్యక్రమాలు
పారదర్శక పాలన కోసం ఈ - ఆఫీస్ విధానంలో 100% కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జెమ్ పోర్టల్ ద్వారా అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్న మంత్రిత్వ శాఖ
వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు, పోస్టర్ తయారీ పోటీలు
Posted On:
06 NOV 2022 11:37AM by PIB Hyderabad
అవినీతి రహిత పాలన అందించేందుకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరిగే విధంగా మంత్రిత్వ శాఖ తన కార్యకలాపాలను పూర్తిగా ఈ - కార్యాలయం విధానంలో నిర్వహిస్తున్నది. అంతేకాకుండా, అన్ని వస్తువులను జెమ్ పోర్టల్ ద్వారా మంత్రిత్వ శాఖ సేకరిస్తున్నది.
పారదర్శకత మరియు సమగ్రత అంశాలపై సిబ్బందికి మరింత అవగాహన కల్పించేందుకు “భ్రష్టాచార్ ముక్త్ భారత్ – విక్షిత్ భారత్” "అవినీతి రహిత భారతదేశం – అభివృద్ధి చెందిన భారతదేశం” ఇతి వృత్తంగా కార్యక్రమాలు నిర్వహించింది. మంత్రిత్వ శాఖ వారంలో ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించింది.
i. 31.10.2022న మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరూ ఆన్‌లైన్ లో సమగ్రత ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ii. శాస్త్రి భవన్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో, జీవన్‌విహార్ మరియు జీవన్ తారా బిల్డింగ్‌లలో వివిధ ప్రదేశాలలో బ్యానర్లు ప్రదర్శించబడ్డాయి.
iii. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జారీ చేసిన సూచనలు మంత్రిత్వ శాఖలోని అన్ని అనుబంధ సంస్థలకు పంపడం జరిగింది. సూచనలకు అనుగుణంగా ఔట్రీచ్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
iv. కార్యాలయంలో చేయాల్సిన మరియు చేయకూడని (ప్రవర్తన నియమాలకు అనుగుణంగా) పనులపై మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాలకు సర్క్యులర్ పంపిణీ చేయబడింది.
v.02.11.2022న వ్యాస రచన మరియు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించబడ్డాయి.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన వ్యాసరచన పోటీలు
(Release ID: 1874198)