ప్రధాన మంత్రి కార్యాలయం
జి20 కిభారతదేశం యొక్క అధ్యక్షత సంబంధి లోగో ను, ఇతివృత్తాన్ని మరియు వెబ్ సైట్ ను నవంబర్8వ తేదీ న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
లోగో, ఇతివృత్తంమరియు వెబ్ సైట్ లు ప్రపంచానికి భారతదేశం యొక్క సందేశాన్ని, ప్రాథమ్యాల నుప్రతిబింబించనున్నాయి
అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగిన అత్యవసర అంశాల పై ప్రపంచవ్యాప్తం గా చేపట్టవలసిన కార్యక్రమపట్టిక కు తోడ్పాటు ను అందించేందుకు ఒక అవకాశాన్ని భారతదేశానికి ఇవ్వజూపుతున్నజి20 అధ్యక్ష హోదా
జి20 అధ్యక్షపదవి కాలం లో, భారతదేశం అంతటా అనేక స్థానాల లో 32 విభిన్న రంగాల కు సంబంధించినదాదాపు గా 200 సమావేశాల ను నిర్వహించనున్న ఇండియా
Posted On:
07 NOV 2022 11:38AM by PIB Hyderabad
జి20 కి భారతదేశం యొక్క అధ్యక్షత కు సంబంధించిన అధికార చిహ్నాన్ని, ఇతి వృత్తాన్ని మరియు వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీ న సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆవిష్కరించనున్నారు.
ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం తాలూకు మార్గదర్శకత్వం లో, భారతదేశం విదేశీ విధానం ప్రపంచ రంగస్థలం పైన నాయకత్వ పాత్రల ను స్వీకరించడం కోసం సిద్ధం అవుతున్నది. ఈ దిశ లో ఒక ముఖ్యమైన అడుగా అన్నట్లుగా, భారతదేశం 2022 డిసెంబర్ 1వ తేదీ నాడు జి20 అధ్యక్ష స్థానాన్ని అలంకరించనుంది. అంతర్జాతీయం గా ప్రామఖ్యం కలిగివుండే ఆవశ్యక అంశాల విషయం లో చేపట్టవలసిన కార్యక్రమాల పట్టిక కు తోడ్పాటు ను అందించేటటువంటి ఒక విశిష్టమైన అవకాశాన్ని భారతదేశాని కి జి20 అధ్యక్ష పదవి ప్రాప్తింపచేస్తుంది.
జి20 అనేది అంతర్జాతీయ ఆర్థిక పరమైన సహకారం కోసం ఏర్పాటైన ఒక ప్రముఖ వేదిక. ఇది ప్రపంచ జిడిపి లో సుమారు 85 శఆతానికి, ప్రపంచ వ్యాపారం లో 75 శాతానికి పైచిలుకు వ్యాపారానికి, మరియు ప్రపంచ దేశాల జనాభా లో దాదాపు గా మూడింట రెండు వంతుల జనాభా కు ప్రాతినిధ్యం వహిస్తున్నది. జి20 అధ్యక్షపదవి కాలం లో భారతదేశం 32 విభిన్న రంగాల కు సంబంధించిన దాదాపు గా 200 సమావేశాల ను దేశం లో అనేక స్థానాల లో నిర్వహించనుంది. వచ్చే సంవత్సరం లో జరుగనున్న జి20 శిఖర సమ్మేళనం భారతదేశం ఆతిథేయి గా వ్యవహరించే అత్యధిక ప్రాధాన్యాన్ని కలిగివుండేటటువంటి అంతర్జాతీయ సభల లో ఒకటి గా ఉంటుందని చెప్పాలి.
***
(Release ID: 1874185)
Visitor Counter : 239
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam