ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్ లోని బేతూల్ లో ఓ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించిందుకు సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు

Posted On: 04 NOV 2022 10:01AM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని బేతూల్ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఎంపీ లోని బేతూల్ లో ఓ దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు నేను దు:ఖిస్తున్నాను. శోకం లో మునిగిపోయిన కుటుంబాల కు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో స్వస్థులు అవ్వాలని నేను కోరుకొంటున్నాను. చనిపోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది : ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

 

 

***

DS/SH



(Release ID: 1873646) Visitor Counter : 121