గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

'అర్బన్ మొబిలిటీ ఇండియా' (యూఎంఐ) సదస్సు &ప్రదర్శన-2022 ఈ నెల 4-6 తేదీల్లో కొచ్చిలో జరగనుంది


కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్‌ పూరి, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ నవంబర్ 4న సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

“ఆజాదీ@75 – సుస్థిర స్వయం సంవృద్ధి పట్టణ ప్రాంత రవాణా” అంశం మీద యూఎంఐ సదస్సు & ప్రదర్శన-2022 దృష్టి పెడుతుంది

Posted On: 03 NOV 2022 11:27AM by PIB Hyderabad

15వ 'అర్బన్ మొబిలిటీ ఇండియా' (యూఎంఐ) సదస్సు & ప్రదర్శన-2022 నవంబర్ 4, 2022న కొచ్చిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో ప్రారంభమవుతుంది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. కేరళ ప్రభుత్వ సహకారంతో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, మెట్రో రైల్‌ కంపెనీల మేనేజింగ్‌ డైరెక్టర్లు, రవాణా సంస్థల ముఖ్య కార్యనిర్వాహకులు, అంతర్జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఇందులో పాల్గొంటారు.

పట్టణ రవాణా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర & నగర స్థాయుల్లో సామర్థ్యాలను పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పట్టణ రవాణా విధానం (ఎన్‌యూటీపీ)-2006 ముఖ్య ప్రాధాన్యత ఇస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన, స్థిరమైన పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మార్గదర్శకాలు అందిస్తోంది.

ఎన్‌యూటీపీలో భాగంగా... భారతదేశ పట్టణ రవాణా మీద వార్షిక అంతర్జాతీయ సదస్సు & ప్రదర్శన నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుంది. ఈ సదస్సు యూఎంఐగా అందరికీ సుపరిచితం. ఈ సదస్సుకు హాజరయ్యే నగర సంస్థల అధికారులకు తాజా సమాచారాన్ని అందించడం సదస్సు ప్రాథమిక లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న కొత్త, ఉత్తమ పట్టణ రవాణా విధానాల గురించి నగర అధికారులు తాజా సమాచారం తెలుసుకుంటారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణులు, సాంకేతికత & సేవల సంస్థలతో పరస్పరం మాట్లాడడానికి నగర అధికారులకు ఈ సదస్సు అవకాశాన్ని అందిస్తుంది. తద్వారా, తమ నగరాల్లో రవాణాను స్థిరమైన మార్గంలో అభివృద్ధి చేయడానికి మంచి ఆలోచనలతో వారు తిరిగి వెళ్తారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, సాంకేతికత & సేవల సంస్థలు, విధాన రూపకర్తలు, పట్టణ రవాణా రంగానికి చెందిన అధికారులను ఒకే వేదికపైకి ఈ కార్యక్రమం తీసుకువస్తుంది.

“ఆజాదీ@75 – సుస్థిర స్వయం సంవృద్ధి పట్టణ ప్రాంత రవాణా” అంశం మీద ఈ సంవత్సరం అర్బన్ మొబిలిటీ ఇండియా (యూఎంఐ) సదస్సు & ప్రదర్శన దృష్టి పెడుతుంది. నగరాల్లో సమర్థవంతమైన, అధిక నాణ్యమైన, స్థిరమైన రవాణా వ్యవస్థల రూపకల్పన, అమలు అవసరాన్ని ఇది ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ప్రజలందరి రవాణా అవసరాలను తీర్చేలా రవాణా వ్యవస్థలను మరింత అనుకూలంగా వినియోగించుకునేలా సమాచార సాంకేతికతలో వేగవంతమైన పురోగతి, ఆవిష్కరణలు పరిస్థితులను మారుస్తున్నాయి. విస్తృతమైన రవాణా ఎంపికలను ఆవిష్కరణలు అందిస్తున్నాయి. తద్వారా, ప్రయాణీకుల ఎంపికల పరిధి పెరిగింది. ఉదాహరణకు, మెట్రో రైలుకు మెట్రో నియో, మెట్రో లైట్ తక్కువ ధర ఎంపికలుగా మారాయి. మధ్యస్థాయి నగరాలకు ఇవి మంచి ఎంపికలుగా ఉపయోగపడతాయి. ఒకే నగరంలో ఎక్కువ ప్రాంతాలకు ప్రజలను చేరవేయగలిగేలా నగరాలు వినూత్నమైన రవణా సేవలు అందించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా వ్యక్తిగత మోటారు వాహనాల అవసరాన్ని అవి తగ్గిస్తాయి.

యూఎంఐ సదస్సు & ప్రదర్శన 2022 వివరణాత్మక రోజువారీ కార్యక్రమాలు

 

***(Release ID: 1873449) Visitor Counter : 165