మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2020-21తో పోలిస్తే 2021-22లో ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ సెకండరీ స్థాయి పాఠశాల విద్యలో మెరుగుపడిన జీఈఆర్
2021-22 సంవత్సరంలో కొత్తగా 8 లక్షలకు పైగా బాలికల నమోదు
2021-22లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సీడబ్ల్యూఎస్ఎన్ కింద పెరిగిన విద్యార్థుల నమోదు
2021-22లో పాఠశాల విద్యలో 95.07 లక్షల మంది ఉపాధ్యాయుల సేవలు: వీరిలో 51% పైగా మహిళా ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల నియామకంలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానం
2021-22లో భారతదేశంలోని దాదాపు 77% పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ సదుపాయం; ఇది 2018-19 సంవత్సరంతో పోలిస్తే 3.4% మెరుగుదల
ఫిట్ ఇండియా స్కూళ్ల కింద సర్టిఫికెట్ పొందిన 33% లేదా 4.98 లక్షల స్కూళ్లు
2021-22లో భారతదేశంలోని దాదాపు 27.7% పాఠశాలల్లో కిచెన్ గార్డెన్; ఇది 2018-19 సంవత్సరంతో పోలిస్తే 32% మెరుగుదల
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఐఎస్ఇ+) 2021-22 పై సమగ్ర నివేదికను విడుదల చేసిన విద్యా మంత్రిత్వ శాఖ
Posted On:
03 NOV 2022 10:02AM by PIB Hyderabad
భారత దేశ పాఠశాల విద్య కు సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఐఎస్ఇ+) 2021-22 పై విద్యా మంత్రిత్వ శాఖ సమగ్ర నివేదికను విడుదల చేసింది.
పేపర్ ఫార్మాట్ లో మాన్యువల్ డేటా ఫిల్లింగ్ మునుపటి అభ్యాసానికి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి, ముఖ్యంగా డేటా క్యాప్చర్, డేటా మ్యాపింగ్ , డేటా వెరిఫికేషన్ కు సంబంధించిన రంగాల్లో మెరుగుదల కు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం 2018-19 సంవత్సరంలో పాఠశాలల నుండి ఆన్ లైన్ డేటా సేకరణ కు యుడిఐఎస్ ఇ+ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది.
యుడిఐఎస్ఇ + 2021-22 లో, డిజిటల్ లైబ్రరీ, పీర్ లెర్నింగ్, హార్డ్ స్పాట్ ఐడెంటిఫికేషన్, స్కూల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాల సంఖ్య మొదలైన ముఖ్యమైన సూచికలపై అదనపు డేటాను ఎన్ఈపి 2020 చొరవలతో అలైన్ చేయడానికి మొదటిసారి సేకరించారు.
స్కూలు ఎడ్యుకేషన్ లో విద్యార్థులు- ఉపాధ్యాయులు
2020-21లో 25.38 కోట్ల మంది విద్యార్థుల నమోదుతో పోలిస్తే 2021-22లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యలో చేరిన మొత్తం విద్యార్థులు 25.57 కోట్ల మంది ఉన్నారు. ఇది 19.36 లక్షలు ఎక్కువ. 2020-21లో 4.78 కోట్లుగా ఉన్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నమోదు 2021-22 నాటికి 4.82 కోట్లకు పెరిగింది. అదేవిధంగా, మొత్తం షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల నమోదు 2020-21 లో 2.49 కోట్ల నుండి 2021-22 లో 2.51 కోట్లకు పెరిగింది. 2020-21లో 11.35 కోట్లుగా ఉన్న ఇతర వెనుకబడిన విద్యార్థులు 2021-22లో 11.48 కోట్లకు పెరిగారు.
2020-21తో పోలిస్తే 2021-22లో ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) మెరుగుపడింది. ముఖ్యంగా, హయ్యర్ సెకండరీలో జిఇఆర్ 2021-21 లో 53.8% నుండి 2021-22 లో 57.6% కు గణనీయమైన మెరుగుదలను సాధించింది.
2020-21లో ప్రత్యేక అవసరాలతో ఉన్న పిల్లల (సి డబ్ల్యు ఎస్ ఎన్) నమోదు 21.91 లక్షల మందితో పోలిస్తే 2021-22లో 22.67 లక్షలకు పెరిగి 2020-21లో 3.45 శాతం వృద్ధి నమోదైంది.
2021-22లో 95.07 లక్షల మంది ఉపాధ్యాయులు పాఠశాల విద్యలో నియమితులయ్యారు. వీరిలో 51% పైగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా, 2021-22 లో, విద్యార్థి -ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) ప్రాథమికానికి 26, అప్పర్ ప్రైమరీకి 19, సెకండరీకి 18, హయ్యర్ సెకండరీకి 27 గా ఉంది, ఇది 2018-19 నుండి మెరుగుదలను చూపించింది. 2018-19లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ , హయ్యర్ సెకండరీ స్థాయి లో పిటిఆర్ వరుసగా 28, 19, 21, 30 గా ఉంది.
2021-22లో 12.29 కోట్ల మంది బాలికలు ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చేరారు. ఈ సంఖ్య 2020-21 తో పోలిస్తే 8.19 లక్షలు ఎక్కువ. జిఈఆర్ లింగ వ్యత్యాస సూచీ (జిపిఐ) పాఠశాల విద్యలో మహిళల ప్రాతినిధ్యం సంబంధిత వయస్సు గ్రూపు జనాభాలో బాలికల ప్రాతినిధ్యానికి అనుగుణంగా ఉందని చూపిస్తుంది. పాఠశాల విద్య అన్ని స్థాయిల వద్ద జి పీ ఐ విలువ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాఠశాల విద్యలో బాలికలు ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది.
2020-21లో 4.78 కోట్ల నుంచి 2021-22లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు మొత్తం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థుల సంఖ్య 4.83 కోట్లకు పెరిగింది. అదేవిధంగా, మొత్తం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విద్యార్థులు 2.49 కోట్ల నుండి 2.51 కోట్లకు, ఇతర వెనుకబడిన కులాల (ఒబిసి) విద్యార్థులు 11.35 కోట్ల నుండి 2021-22 లో 11.49 కోట్లకు పెరిగారు.
2020-21లో 15.09 లక్షలతో పోలిస్తే 2021-22లో మొత్తం పాఠశాలల సంఖ్య 14.89 లక్షలుగా ఉంది. ప్రైవేట్ , ఇతర యాజమాన్య పాఠశాలలను మూసివేయడం , వివిధ రాష్ట్రాలలో పాఠశాలల విలీనం/ చేర్చడం మొత్తం పాఠశాలల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం.
పాఠశాల మౌలిక సదుపాయాలు: సమగ్ర శిక్షా పథకం ప్రభావం:
2021-22 నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లభ్యత ఈ క్రింది విధంగా ఉంది:
*విద్యుత్ కనెక్షన్: 89.3%
*తాగునీరు: 98.2%
*బాలికల టాయిలెట్: 97.5%
*సి డబ్ల్యు ఎస్ ఎన్ టాయిలెట్: 27%
*హ్యాండ్ వాష్ సదుపాయం: 93.6%
*ఆటస్థలం: 77%
*సి డబ్ల్యు ఎస్ ఎన్ కోసం హ్యాండ్ రెయిల్ తో ర్యాంప్: 49.7%
*లైబ్రరీ/ రీడింగ్ రూమ్/ రీడింగ్ కార్నర్: 87.3%
స్కూలు కు సుస్థిర పర్యావరణ చొరవలు
*కిచెన్ గార్డెన్: 27.7%
*రెయిన్ వాటర్ హార్వెస్టింగ్: 21%
వివరాల కోసం దిగువ లింక్ చూడండి:
http://dashboard.udiseplus.gov.in.
లేదా
http://udiseplus.gov.in/#
*****
(Release ID: 1873373)
Visitor Counter : 523