రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 2022 వరకు సరుకు రవాణా ద్వారా రూ.92345 కోట్లు ఆర్జించిన రైల్వేలు
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17% పెరిగిన సరుకు రవాణా పై ఆదాయం
గత సంవత్సరం సాధించిన దానికన్నా 9% మెరుగుదలను చూపుతూ అక్టోబర్ 22 వరకు 855.63 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాను సాధించిన రైల్వేలు
Posted On:
01 NOV 2022 3:52PM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి ఏడునెలల్లో భారతీయ రైల్వేలు మిషన్ మోడ్ (ఒక లక్ష్యంతో అమలుచేసిన) సరుకు లోడింగ్ గత ఏడాది లోడింగ్, ఆర్జనను దాటిపోయింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 22 వరకు సంచిత ప్రాతిపదికన గత ఏడాది చేసిన 786.2 మెట్రిక్ టన్నులకు వ్యతిరేకంగా 855.63 మెట్రిక్ టన్నులను సాధించింది. ఇది గత సంవత్సరం లోడింగ్ కంటే దాదాపు 9% ఎక్కువ. గత ఏడాది ఆర్జించిన రూ. 78921 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 92345 కోట్లను ఆర్జించి, 17% మెరుగుదలను చూపింది.
అక్టోబర్ నెల, 2022లో గత ఏడాది అదే మాసంలో సాధించిన 117.34 మెట్రిక్ టన్నుల లోడింగ్కు వ్యతిరేకంగా 118.94 మెట్రిక్ టన్నుల ఆవిర్భావ సరుకు లోడింగ్ ను సాధించి, గత ఏడాదికన్నా 1.4% మెరుగుదలను సాధించింది. అక్టోబర్ 21లో ఆర్జించిన రూ. 12313 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని మించి ఈ ఏడాది రూ. 13335 కోట్లను ఆర్జించి, గత ఏడాదికన్నా 8% మెరుగుదలను చూపింది.
హంగ్రీ ఫర్ కార్గో (సరుకు కోసం ఆకలి గొని ఉన్నాం) అన్న మంత్రాన్ని అనుసరించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, పోటీ ధరలకు సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేలు చేసిన నిరంతర ప్రయత్నం ఫలితంగా, సంప్రదాయ, సంప్రదాయేతర వస్తువుల ధారల నుంచి రైల్వేలకు నూతన వ్యాపారం వస్తోంది. వినియోగదారులే కేంద్రమన్న విధానం, చురుకైన విధాన నిర్ణయాల ద్వారా, ప్రత్యామ్నాయ, ప్రణాళికతో కూడిన వ్యాపార అభివృద్ధి యూనిట్ల చురుకైన విధానం రైల్వేలు ఈ మైలు రాయిని సాధించడంలో సహాయపడ్డాయి.
***
(Release ID: 1872879)
Visitor Counter : 120