హోం మంత్రిత్వ శాఖ

ప్రత్యేక ప్రచారం 2.0ని విజయవంతంగా నిర్వహించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 01 NOV 2022 12:05PM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచారం 2.0ని  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 అక్టోబర్ 2 నుంచి 31 వరకు  విజయవంతంగా నిర్వహించింది. ప్రజలు సందర్శించే ప్రాంతాలతో సహా ఫీల్డ్ మరియు అవుట్‌స్టేషన్ కార్యాలయాలతో సహా 11,559 ప్రాంతాలలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా ఎంపీ  రెఫరెన్స్‌లు, పార్లమెంటరీ హామీలు, ఐఎంసీ  సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పీఎంఓ  సూచనలు, ప్రజా సమస్యలు, మరియు పీజీ  అప్పీల్స్ వంటి వివిధ తరగతుల్లో పెండింగ్ లో ఉన్న అంశాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ   సమర్థవంతంగా పరిష్కరించింది. 

ప్రత్యేక ప్రచారం 2.0 లో మంత్రిత్వ శాఖ దాని అనుబంధ/ సబార్డినేట్ కార్యాలయాల్లో  మొత్తం 5.15 లక్షల ఫైళ్ళను సమీక్షించాలని గుర్తించారు. . వీటిలో 4.77 లక్షల ఫైళ్లను పరిశీలించి 2.81 లక్షల ఫైళ్లను తొలగించారు. 

 పనికిరాని వ్యర్థాలను తొలగించడం ద్వారా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంతవరకు 1,40,99,510 రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. దాదాపు 90,525 చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి అందుబాటులోకి వచ్చింది. 

ప్రత్యేక ప్రచారం 2.0 అమలుకు నిర్వహించిన  సన్నాహక దశలో మొత్తం 5,126 ప్రజా ఫిర్యాదులు మరియు అప్పీళ్లు పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖ గుర్తించింది.  వాటిలో 4,708 ప్రజా క్ ఫిర్యాదులు మరియు అప్పీళ్లు సమర్థవంతంగా పరిష్కరించబడ్డాయి.

కార్యక్రమం అమలుకు సంబంధించి  కేంద్ర సాయుధ పోలీసు దళం, ఢిల్లీ పోలీసులు మరియు అటాచ్డ్/సబార్డినేట్ కార్యాలయాలు  2,000 కంటే ఎక్కువ ట్వీట్‌లు పోస్ట్ చేశాయి.  వీటిలో 200 కంటే ఎక్కువ ట్వీట్లు మంత్రిత్వ శాఖ  PIB ట్విట్టర్ హ్యాండిల్ @PIBHomeAffairs నుండి రీ-ట్వీట్ చేయబడ్డాయి. 

స్వచ్ఛత కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలు 

కార్యక్రమం అమలుకు ముందు అమలు జరిగిన తర్వాత నార్త్ బ్లాక్ లో బ్యాడ్మింటన్ కోర్టు  

 

  

కార్యక్రమం అమలుకు ముందు అమలు జరిగిన తర్వాత NKSTPP కార్యాలయం  

 

  

కార్యక్రమం అమలుకు ముందు అమలు జరిగిన తర్వాత నార్త్ బ్లాక్ కారిడార్ 

 

   

కార్యక్రమం అమలుకు ముందు అమలు జరిగిన తర్వాత జమ్మూ NCB కార్యాలయం 

 

      

కార్యక్రమం అమలుకు ముందు అమలు జరిగిన తర్వాత షిల్లాంగ్ లైకోర్ బయట దృశ్యాలు   

 

 

అరుణాచల్ ప్రదేశ్ ఛంగ్లాంగ్ లో పరిశుభ్రత కార్యక్రమాలు 

 

 

 HQR/153 Bn లో  పరిశుభ్రత కార్యక్రమాలు

 

  

జీలం నది తీరంలో 53 Bn చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమం 

 

   

***



(Release ID: 1872677) Visitor Counter : 154