ప్రధాన మంత్రి కార్యాలయం

హజీరాలో ‘అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ ప్లాంటు విస్తరణ సందర్భంగా ప్ర‌ధానమంత్రి ప్రసంగం


“రూ.60వేల కోట్లకుపైగా పెట్టుబడితో గుజరాత్‌ సహా
దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుంది”;

“బలమైన ఉక్కు రంగంతో బలమైన మౌలిక సదుపాయాలకు బాటలు”;

“ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు
‘భారత్‌లో తయారీ’ దృక్కోణంలో ఒక మైలురాయి”;

“ముడి ఇనుము ఉత్పాదక సామర్థ్యం రెట్టింపు లక్ష్యంగా దేశం నిర్దేశించుకుంది”

Posted On: 28 OCT 2022 4:24PM by PIB Hyderabad

   గుజరాత్‌లోని హజీరాలో నేడు ‘అర్సెలర్‌ మిట్టల్ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ (ఎంఎ/ఎన్‌ఎస్‌- ఇండియా) ప్లాంటు విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా- ఉక్కు కర్మాగారం ద్వారా పెట్టుబడులు రావడంతోపాటు అనేక కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటున్నాయని ఆయన అన్నారు. “రూ.60వేల కోట్లకుపైగా పెట్టుబడితో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగ అవకాశాల సృష్టికి వీలు కలుగుతుంది. ఈ విస్తరణ తర్వాత హజీరా స్టీల్ ప్లాంట్‌లో ముడి ఉక్కు ఉత్పాదక సామర్థ్యం 9 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెరుగుతుంది” అని ఆయన తెలిపారు.

   భారత్‌ 2047నాటికి ప్రగతిశీల దేశంగా ఆవిర్భవించడంలో ఉక్కు పరిశ్రమ రంగం పాత్ర పెరుగుతుండటాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. బలమైన ఉక్కు రంగంతో బలమైన మౌలిక సదుపాయాలకు బాటలు పడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, నిర్మాణ రంగం, ఆటోమోటివ్, మూలధన వస్తూత్పత్తి,  ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాలకు ఉక్కు రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

   ఈ ప్లాంటు విస్తరణతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్, ఇతర ఉత్పాదక రంగాల్లో భారీ తోడ్పాటు దిశగా మన దేశానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ‘భారత్‌లో తయారీ’ దృక్కోణంలో ఒక మైలురాయిగా రుజువు చేసుకోగలదని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ప్రగతిశీల-స్వయం సమృద్ధ భారత దేశం దిశగా ఉక్కు రంగంలో మనం కృషి కొత్త బలాన్నిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.

భారతదేశం పై ప్రపంచం పెట్టుకొన్న ఆశల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రపంచం లోనే అతి పెద్ద తయారీ కేంద్రం గా మారే దిశ లో శర వేగం గా సాగిపోతోందని, ప్రభుత్వం ఈ రంగం యొక్క వికాసానికి అవసరమైన విధానాల ను రూపొందించడం లో క్రియాశీలం గా నిమగ్నం అయిందన్నారు. ‘‘గత ఎనిమిది సంవత్సరాలు గా అందరి ప్రయాస ల వల్ల భారతదేశం యొక్క ఉక్కు పరిశ్రమ ప్రపంచం లో ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్న రెండో అతి పెద్ద పరిశ్రమ గా ఆవిర్భవించింది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అపారమైన సంభావ్యత ఉంది’’ అని కూడా ఆయన అన్నారు.

భారతదేశం ఉక్కు పరిశ్రమ ను మరింత గా ప్రోత్సహించడానికి సంబంధించిన చర్యల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. పిఎల్ఐ పథకం ఈ పరిశ్రమ యొక్క వృద్ధి కి సరికొత్త మార్గాల ను తెరచింది అని ఆయన అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఉదాహరణ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, హై-గ్రేడ్ స్టీల్ లో దేశం నైపుణ్యాన్ని సంపాదించింది. ఈ హై-గ్రేడ్ స్టీల్ ను ఉపయోగించడం కీలకమైనటువంటి వ్యూహాత్మక ఏప్లికేశన్స్ లో అధికం అవుతున్నదని పేర్కొన్నారు. విమాన వాహక నౌకల లో ఉపయోగించేటటువంటి ప్రత్యేకమైన ఉక్కు ను డిఆర్ డిఒ కు చెందిన శాస్త్రవేత్త లు అభివృద్ధిపరచారు అని ప్రధాన మంత్రి అన్నారు. లోని కంపెనీ లు వేల కొద్దీ మీట్రిక్ టన్నుల ఉక్కు ను ఉత్పత్తి చేశాయి. మరి ఐఎన్ ఎస్ విక్రాంత్ అచ్చంగా స్వదేశీ సామర్థ్యం తో, సాంకేతిక విజ్ఞానం తో రూపొందింది. ఆ తరహా సామర్థ్యాన్ని పెంచడం కోసం, దేశం ఇక ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకొంది. మనం ప్రస్తుతం 154 మీట్రిక్ టన్నుల ముడి ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్నాం. తదుపరి తొమ్మిది, పది సంవత్సరాల లో 300 ఎమ్ టి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలన్నది మన లక్ష్యం గా ఉంది.

అభివృద్ధి తాలూకు దృష్టికోణం ఆచరణ రూపాన్ని సంతరించుకొంటూ ఉంటుందో, అప్పుడు ఎదురుపడేటటువంటి సవాళ్ల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఉక్కు పరిశ్రమ నుండి వెలువడే కర్బన ఉద్గారాల తాలూకు ఉదాహరణ ను ప్రస్తావించారు. భారతదేశం ఒక వైపు నుండి ముడి ఉక్కు ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని విస్తరించుకొంటూనే మరి మరో వైపు నుండి పర్యావరణ మిత్రపూర్వకంగా ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు. ‘‘ప్రస్తుతం, భారతదేశం కర్బన ఉద్గారాల ను తగ్గించే కోవ కు చెందిన ఉత్పత్తి సంబంధి సాంకేతిక విజ్ఞ‌ానాన్ని అభివృద్ధిపరచడం పై శ్రద్ధ తీసుకోవడం తో పాటు గా కర్బనాన్ని వెలికి తీసి మరి దానిని రెండో సారి ఉపయోగించడానికి సైతం ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కు కూడా ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతున్నది; మరి ప్రభుత్వం , ఇంకా ప్రైవేటు రంగం ఈ దిశ లో కలసికట్టుగా పనిచేస్తున్నాయి అని కూడా ఆయన వెల్లడించారు. ‘‘ఎఎమ్ఎన్ఎస్ ఇండియా గ్రూపునకు చెందిన హజీరా ప్రాజెక్టు కూడాను హరిత సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని ఉపయోగించడం పట్ల అమిత ప్రాముఖ్యాన్ని ఇస్తుండడం అనేది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం దిశ లో పూర్తి బలం తో సాగిపోయేందుకు కృషి చేయడం మొదలుపెడతారో, అప్పుడు దానిని చేరుకోవడం కష్టం కాదు.’’ అన్నారు. ఉక్కు పరిశ్రమ ను కొత్త శిఖరాల కు తీసుకుపోవడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు యావత్తు ప్రాంతం యొక్క అభివృద్ధి కి మరియు ఉక్కు రంగం యొక్క అభివృద్ధి కి తప్పక ప్రేరణ ను ఇస్తుందని నేను తలుస్తున్నాను.’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

****

 DS/TS

 



(Release ID: 1871726) Visitor Counter : 143