ప్రధాన మంత్రి కార్యాలయం

పదిలక్షల ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ను ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 22 OCT 2022 1:10PM by PIB Hyderabad

“మన ఉద్యోగుల కృషివల్ల ప్రభుత్వ విభాగాల సామర్ధ్యం పెరిగింది. గత 8 సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఇవాళ ఇండియా 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. ”

“ ఇంతకుముందెన్నడూ ముద్ర యోజన స్థాయిలో స్వయం ఉపాధి కార్యక్రమాన్ని దేశంలో  అమలు చేయలేదు”
“ మన దేశ యువత మనకున్న పెద్ద బలం”
“కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి వివిధ రకాలుగా కృషిచేస్తున్నది”
“21 వశతాబ్దపు భారతదేశంలో ప్రభుత్వ సర్వీసు అంటే సేవ చేసేందుకు చిత్తశుద్ది, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉండడం”
“ మీరు కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి  కర్తవ్య పథాన్ని  ఎప్పుడూ మనసులో ఉంచుకోండి”

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించి రోజ్గార్ మేళాను ఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి, కొత్తగా నియమితులైన 75 వేల మందికి నియామక పత్రాలు అందజేశారు.

ఉద్యోగాలలో నియమితులైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి వారికి ధన్ తెరాస్ శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో గత 8 సంవత్సరాలుగా సాగుతున్న ఉపాధి, స్వయం ఉపాధి ప్రచారాలకు  రోజ్ గార్ మేళా  రూపంలో కొత్త అనుసంధానత కల్పిస్తున్నట్టు చెప్పారు.  75 సంవత్సరాల స్వాంతత్ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం కింద 75 వేల మంది యువతకు నియామక పత్రాలు అందజేస్తున్నట్టు చెప్పారు. “ ఒక్కసారిగా నియామక పత్రాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించాలని మేం నిర్ణయించాం. దీనివల్ల వివిధ శాఖలలో నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేసే సమష్టిచొరవ ప్రారంభమవుతుంది” అని రోజ్గార్ మేళా నిర్వహించడం వెనుకగల హేతుబద్ధతను వివరిస్తూ ప్రధానమంత్రి అన్నారు.రానున్న రోజులలో కూడా అభ్యర్థులు ప్రభుత్వం నుంచి అపాయింట్మెంట్ లేఖలు ఎప్పటికప్పుడు అందుకుంటారని అన్నారు.ఎన్.డి.ఎ పాలిత, బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాలు ఇలాంటి మేలాలు నిర్వహిస్తాయని ప్రధానంత్రి తెలిపారు.

కొత్తగా నియామక పత్రాలు అందుకుంటున్న వారికి స్వాగతం పలుకుతూ ప్రధాన మంత్రి, వారు ఉద్యోగాలలో చేరుతున్న సమయం ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ,  అమృత్ కాల్లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు చెప్పుకున్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు మనం స్వావలంబిత భారతదేశ పథంలో ముందుకు సాగిపోతున్నామన్నారు.ఆవిష్కర్తలు, ఎంటర్ప్రెన్యుయర్లు, పారిశ్రామిక వేత్తలు, రైతులు, తయారీ , సేవల రంగంలోని ప్రజలు ఇండియాను స్వావలంబిత దేశంగా మార్చడంలో కీలకపాత్ర వహిస్తారన్నారు. సబ్ కా ప్రయాస్ ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి , దేశ ప్రగతి ప్రస్థానంలో ప్రతి ఒక్కరి కృషి కీలకమని అన్నారు .అన్ని కీలక సదుపాయాలూ ప్రతిఒక్కరికీ చేరినప్పుడు ఈ సబ్ కా ప్రయాస్ భావన ఏర్పడుతుందన్నారు.

లక్షలాది ఖీఆళీల భర్తీకి సంబంధించి కొద్ది నెలలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయడం, వారికి నియామకపత్రాలు అందజేయడం అనేది గమనించినపుడు గత 7‌‌–8 సంవత్సరాలలో నియామక  వ్యవస్థలో వచ్చిన మార్పును సూచిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
‘ఇవాళ పని సంస్కృతి మారుతోంది’ అని ఆయన అన్నారు. కర్మయోగుల కృషితో  ప్రభుత్వ విభాగాల సమర్ధత పెరిగిందని ఆయన అన్నారు.  గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం క్లిష్టమైన ప్రక్రియగా ఉండేదని, అవినీతి, పక్షపాతం విపరీతంగా ఉండేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
తాను అధికారంలోకి వచ్చిన కొత్తలలో సర్టిఫికేట్ల స్వీయ ధృవీకరణ, కేంద్ర ప్రభుత్వ  గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇది యువతకు ఎంతో మేలు చేకూర్చిందని అన్నారు.


ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ అని అంటూ ప్రధానమంత్రి, గత 8 సంవత్సరాలలో తీసుకువచ్చన సంస్కరణల వల్ల ఇది సాధ్యమైనదని అన్నారు. గత 7, 8 సంవత్సరాలలో ఇండియా ఆర్థిక వ్యవస్థ విషయంలో 10 వస్థానం నుంచి 5 వ స్థానానికి చేరిందని ప్రధానమంత్రి అన్నారు.
దేశం ముందున్న ఆర్ధిక సవాళ్లను గుర్తిస్తూనే, చాలావరకు ఆర్ధిక రంగానికి సంబంధించిన వ్యతిరేక పరిణామాలను ఇండియా నిలువరించగలిగిందని అన్నారు. గత 8 సంవత్సరాలలో దేశ ఆర్ధిక వ్యవస్థకు అడ్డంకులుగా నిలిచిన వాటిని వదిలించుకోగలిగినట్టు తెలిపారు.

ఉపాధికి అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యవసాయ, ప్రైవేటు, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, భారత దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకోసం వారికి నైపుణ్యాలు సమకూర్చాల్సిన ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు.
ఇవాళ మనం చాలావరకు యువతకు నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టిపెడుతున్నానం.  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద దేశ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు పెద్దఎత్తున నైపుణ్యశిక్షణ ఇస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
స్కిల్ ఇండియా  అభిఆన్ కింద 1.25 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా కౌశల్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వందలాది ఉన్నత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి చెప్పారు. డ్రోన్ విధానాన్ని సరళతరం చేయడం,
అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి స్వాగతం పలకడం, ముద్ర యోజన కింద 20 లక్షల కోట్ల రూపాయల విలువగల రుణాలను అంజేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ ఈ స్థాయిలో స్వయం ఉపాధి పథకాలు అమలు కాలేదని ప్రధానమంత్రి చెప్పారు.
స్వయం సహాయక బృందాలతో పాటు గ్రామాలలో ఉపాధి కల్పించడంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు.  దేశంలోనే మొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు ల విలువ 4 లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంటూ ఖాదీ గ్రామీణ పరిశ్రమలలో 4 కోట్ల కు పైగా
ఉద్యోగాలను కల్పించడం  జరిగిందన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళల వాటా ఉందని ఆయన అన్నారు.

స్టార్టప్ ఇండియా ప్రచారం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దేశ యువత శక్తిసామర్ధ్యాలను ఇది ప్రపంచానికి  చాటిచెప్పిందని అన్నారు. అలాగే, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎం.ఎస్.ఎం.ఇలకు మద్దతు ఇచ్చామని , 1.5 కోట్ల ఉద్యోగాలను కాపాడడం జరిగిందని అన్నారు.
ఎంజిఎన్ఆర్ఇజిఎ దేశంలోని 7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నదని అన్నారు. 21 శతాబ్దంలో భారతదేశంలో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు  మేక్ ఇన్ ఇండియా ,ఆత్మ నిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశం,
 దిగుమతులు చేసుకునే దశనుంచి చాలా ఉత్పత్తుల విషయంలో పెద్ద ఎత్తున ఎగుమతులు చేసే దేశంగా ఎదిగిందని అన్నారు. అంతర్జాతీయ హబ్ గా ఎదిగిన ఎన్నో రంగాలు దేశంలో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. రికార్డు'స్థాయిలో జరుగుతున్న ఎగుమతులు, ఉపాధి అవకాశాల వృద్ధిని సూచిస్తున్నాయని అన్నారు.

"ప్రభుత్వం తయారీ, పర్యాటక రంగాలలో సమగ్రదృష్టితో పనిచేస్తోంది. ఇవి ఉపాధి కల్పనకు పుష్కలమైన అవకాశాలు గల రంగాలు అని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గల కంపెనీలు ఇండియాకు వచ్చేందుకు, ఇక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పి ప్రపంచ డిమాండ్ ను తీర్చేందుకు
 వివిధ ప్రక్రియలను  సులభతరం చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఉత్పాదకత ఆధారంగా పి.ఎల్.ఐ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. మరింత ఉత్పత్తి, మరిన్ని ప్రోత్సాహకాలు  అన్ని ఇండియా విధానమని ప్రధానమంత్రి అన్నారు. దీని ఫలితాలు ఇప్పటికే
స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇపిఎఫ్ఒ నుంచి అందుతున్న ఇటీవలి కొద్ది సంవత్సరాల గణాంకాలు గమనించినపుడు 17 లక్షలమంది ఇపిఎఫ్ఒ లో చేరినట్టు తేలింది. వీరంతా దేశ ఆర్ధిక వ్యవస్థలో భాగం.  8 లక్షల మంది 18 నుంచి 25 సంవత్సరాల
వయసు మధ్య వారు ఉన్నట్టు ఆయన తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధి కల్పన అంశాన్ని ప్రధానమంత్రి తమ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారులను గత 8 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా నిర్మించినట్టు ప్రధానమవంత్రి తెలిపారు. రైల్వేకి సంబంధించి డబ్లింగ్ , గజ్ కన్వర్షన్,
రైల్వేలైన్ల విద్యుదీకరణ పనులను పెద్ద ఎత్తున నిరంతరాయంగా చేపడుతున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. కొత్త జలమార్గాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.

దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పలు రకాలుగా  పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి 100 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు.  స్థానికంగా లక్షలాదిమంది  యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకశాలు కల్పించేందుకు
పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. విశ్వాసాలు , ఆధ్యాత్మికత,చారిత్రక ప్రాధాన్యతగల ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా వీటిని అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. పర్యాటక రంగానికి కొత్త ఊతం ఇచ్చేందుకు, మారుమూల ప్రాంతాలతో సహా
యువతకు ఉపాధి అకకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
భారతదేశపు గొప్ప బలం దేశ యువతలో ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆజాది కా అమృత్ కాల్లో ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత చోదకశక్తిగా ఉంటారని అన్నారు. ఉద్యోగాలలో కొత్తగా నియమితులైన అభ్యర్థులు కార్యాలయ గుమ్మంలో అడుగుపెట్టగానే తమ
కర్తవ్య పథాన్ని మనసులో నింపుకోవాలని ప్రధానమంత్రి అన్నారు.
“మీరు దేశ పౌరుల సేవకు నియమితులయ్యారు.’’అని ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి అన్నారు. 21 వశతాబ్దపు ప్రభుత్వ ఉద్యోగం కేవలం ఉద్యోగం కాదని, నిర్ణీత కాలవ్యవధిలో దేశం నలుమూలలాగల ప్రజలకు సేవచేసేందుకు దక్కిన అద్భుత సువర్ణావకాశమని ఆయన అన్నారు.
.నేపథ్యం:
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని , పౌరుల సంక్షేమానికి పాటుపడాలన్న  ప్రధానమంత్రి నిరంతర ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో ఇవాళ జరిగిన కార్యక్రమం చెప్పుకోదగినది.  ప్రధానమంత్రి ఆదేశాల మేరకు అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆమొదిత పోస్టులను
శరవేగంగా భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులు భారతప్రభుత్వానికి చెందిన  38 మంత్రిత్వశాఖలు, విభాగాలలో చేరుతారు. ప్రస్తుతం నియమితులైన వారు గ్రూప్‌‌ఎ, గ్రూప్ బి(గజిటెడ్), గ్రూప్ బి‌‌ నాన్ గెజిటెడ్, గ్రూప్ సి ఉద్యోగాలలోని వారు. ప్రస్తుతం నియామకాలు  జరుగుతున్న విభాగాలలో
కేంద్ర సాయుధ బలగాలు, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్డిసి, స్టెనో, పిఎ, ఆదాయపన్ను ఇన్స్పెక్టర్లు, ఎం.టిఎస్ తదితరులు ఉన్నారు.
ఈ నియామకాలను ఆయా మంత్రిత్వశాఖలు , విభాగాలు మిషన్ మోడ్ లో చేపడతాయి. ఇవి. ఈ నియామకాలను ఆయా సంస్థలు వాటంతట అవే కానీ లేదా యుపిఎస్సి, ఎస్ ఎస్ సి  , రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ చేపడతాయి. ఇందుకు సంబంధించి ఎంపిక ప్రక్రియను సులభతరం చేశారు. రిక్రూట్మెంట్ విధానాన్ని త్వరితగతిన చేపట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు.



(Release ID: 1870655) Visitor Counter : 236