కేంద్ర మంత్రివర్గ సచివాలయం

బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన సమావేశం అయిన నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ (NCMC)

Posted On: 21 OCT 2022 6:55PM by PIB Hyderabad

 కేబినెట్ కార్యదర్శి  శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ (NCMC)   బంగాళాఖాతంలో  తుఫాను ఏర్పడితే పరిస్థితిని  ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన చర్యలపై కేంద్ర మంత్రిత్వ శాఖలు/ సంస్థలు  మరియు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల  సంసిద్ధతను సమీక్షించింది.
బంగాళాఖాతంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కమిటీ సభ్యులకు వివరించారు. ప్రస్తుత వ్యవస్థ ఉత్తర దిశగా కదులుతూ అక్టోబర్ 24 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. 24 తర్వాత ఇది ఈశాన్య దిశలో పయనించి అక్టోబర్ 25 నాటికి ఒడిశా తీరం వెంబడి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరం చేరుకుంటుంది. అక్టోబర్ 25 అర్ధరాత్రి సమయంలో తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని  భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ వివరించారు.
తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసిన ప్రాంతాలలో  నివసిస్తున్న  ప్రజల భద్రత కోసం స్థానిక పరిపాలనా యంత్రాంగం తీసుకుంటున్న సన్నద్ధత మరియు చర్యల గురించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు అండమాన్ నికోబార్ దీవుల ప్రధాన కార్యదర్శులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిటీకి వివరించారు.   సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని ఆదేశాలు జారీచేసిన  అధికారులు  సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఎన్డీఆర్ఎఫ్  తన బృందాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచింది .  అదనపు బృందాలను కూడా సిద్ధం ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేసింది. సహాయ చర్యలు చేపట్టేందుకు సైనిక, వైమానిక దళాలకు చెందిన సహాయ బృందాలు సహాయ చర్యలు చేపట్టేందుకు నౌకలు విమానాలు సహాయ సామాగ్రితో  సిద్ధంగా ఉంచబడ్డాయి.
 తాజా పరిస్థితిని  సమీక్షించిన  శ్రీ రాజీవ్ గౌబా రాష్ట్రాలు మరియు కేంద్ర సంస్థలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా  యంత్రాంగం,  సంబంధిత అధికారులు నివారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రాణనష్టం లేకుండా చూడడానికి, ఆస్తి నష్టం జరగకుండా చూడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.   విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ వంటి  మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని, దెబ్బతిన్న సౌకర్యాలను సాధ్యమైనంత తక్కువ సమయంలో దాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి పిలిపించాలని, తుఫాను వచ్చే ముందు ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సకాలంలో తరలించేలా చూడాలని  శ్రీ రాజీవ్ గౌబా సూచించారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి  అన్ని కేంద్ర సంస్థలు  పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని మరియు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాయని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ రాజీవ్ గౌబా హామీ ఇచ్చారు.  
ఈ సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల ముఖ్య కార్యదర్శులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం వ్యవహారాలు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు మరియు టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతినిధులు, ఎన్డీఎంఏ, సీఐఎస్సి,ఐడీసీ సభ్య కార్యదర్శులు, ఎన్డీఆర్ఎఫ్ డిజి ,  ఐఎండి డిజి, కోస్ట్ గార్డ్ డిజి మరియు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1870182) Visitor Counter : 141