ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్లోని  శ్రీ కేదార్ నాథ్ ధామ్ లో దైవ దర్శనం మరియు పూజల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 21 OCT 2022 12:17PM by PIB Hyderabad

గర్భగుడి లోపల రుద్రాభిషేకం జరిపారు

 

ఆది గురు శంకరాచార్య సమాధి స్థలాన్ని సందర్శించారు

 

మందాకిని ఆస్థాపథ్ లో మరియు సరస్వతి ఆస్థాపథ్ లో సాగుతున్న పనుల పురోగతి ని సమీక్షించారు

 

కేదార్ నాథ్ ధామ్ ప్రాజెక్టు శ్రమికుల తో భేటీ అయ్యారు

కేదార్ నాథ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించి శ్రీ కేదార్ నాథ్ దేవాలయం లో దైవ దర్శనం చేసుకొని పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. సాంప్రదాయిక పహాడీ వస్త్రాల ను ధరించిన ప్రధాన మంత్రి గర్భగుడి లో నిర్వహించిన రుద్రాభిషేకం లో పాలుపంచుకొన్నారు; నంది విగ్రహం సమక్షం లో ప్రధాన మంత్రి ప్రార్థన జరిపారు.

 

ఆది గురు శంకరాచార్య సమాధి స్థలాన్ని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు; అంతేకాకుండా మందాకిని ఆస్థాపథ్ మరియు సరస్వతి ఆస్థాపథ్ వెంబడి జరుగుతున్న పనుల యొక్క పురోగతి ని కూడా ఆయన సమీక్షించారు.


కేదార్ నాథ్ ధామ్ ప్రాజెక్టు లో పనిచేస్తున్న వ్యక్తుల ను ప్రధాన మంత్రి కలుసుకొన్నారు.
 

 

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి వెంట ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ శ్రీ గుర్ మీత్ సింహ్ మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామి లు ఉన్నారు.
 
కేదార్ నాథ్ అత్యంత ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల లో ఒకటి గా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతం లో సిక్కుల కు ఆరాధ్య తీర్థయాత్ర స్థలం అయిన హేమ్ కుండ్ సాహిబ్ సైతం నెలకొంది. ప్రస్తుతం చేపట్టబోతున్న కనెక్టివిటీ ప్రాజెక్టు లు ధార్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరచి ఆయా క్షేత్రాల కు సులభంగా చేరుకొనే విధం గా చర్యల ను తీసుకోవాలన్న ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత ను చాటి చెబుతున్నాయి.

*****

DS/TS



 



(Release ID: 1869963) Visitor Counter : 140