రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డిఫెన్స్ ఎక్స్ పో 022 సందర్భంగా బాంగ్లాదేశ్ & కజఖస్తాన్ ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక చర్చలను నిర్వహించిన రక్షణ కార్యదర్శి

प्रविष्टि तिथि: 20 OCT 2022 9:07AM by PIB Hyderabad

గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరుగుతున్న 12వడిఫెన్స్ ఎక్స్ పో (అంతర్జాతీయ రక్షణ ఆయుధాల ప్రదర్శ) సందర్భంగా బాంగ్లాదేశ్, కజఖస్తాన్ ప్రతినిధి బృందాలతో రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ 19 అక్టోబర్ 2022న ద్వైపాక్షిక చర్చలను నిర్వహించారు. బాంగ్లాదేశ్ సాయుధ దళాల డివిజన్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ జనరల్ వకర్ -ఉజ్ - జమాన్ నాయకత్వంలోని బాంగ్లాదేశ్ ప్రతినిధి బృందాన్ని ఆయన కలిశారు. ఇరు దేశాల మధ్య నడుస్తున్న కీలక ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలను సమీక్షించి, రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంచేందుకు మార్గాలను అన్వేషించారు.
అనంతరం కజఖస్తాన్ రక్షణ శాఖ సహాయ మంత్రి లెఫ్టెనెంట్ జనరల్ రుస్లాన్ ష్పెక్బయేవ్ నాయకత్వంలోని కజఖస్తాన్ ప్రతినిధి బృందంతో రక్షణ కార్యదర్శి సమావేశమయ్యారు. శిక్షణ, సంయుక్త విన్యాసాలు, సామర్ధ్య నిర్మాణంపై నిర్ధిష్ట దృష్టిని పెడుతూ రక్షణ సహకారానికి సంబంధించిన అనేక ద్వైపాక్షిక అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి.  

 

***


(रिलीज़ आईडी: 1869488) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil