శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పలు కార్యక్రమాలను అమలు చేస్తుంది

प्रविष्टि तिथि: 20 OCT 2022 12:26PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, దాని అనుబంధ కార్యాలయాలు మరియు స్వయంప్రతిపత్త సంస్థల (AIలు)తో కలిసి 2 అక్టోబర్ 2022 నుండి 31 అక్టోబర్, 2022 వరకు స్వచ్ఛత మరియు పెండింగ్‌లో ఉన్న విషయాలను పూర్తి చేయడం కోసం ప్రత్యేక ప్రచారాన్ని వేగంగా అమలు చేస్తోంది.

 

 

ప్రచారం సందర్భంగా, న్యూ ఢిల్లీలోని టెక్నాలజీ భవన్‌లోని కొత్త భవనాల నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న ప్రస్తుత ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్ (AUM) యూనిట్ తాజా కాలుష్య స్థాయిలను ప్రదర్శించే డ్యాష్‌బోర్డ్‌తో అనుసంధానించబడింది.

ఏ యూ ఏం నుండి వెలువడే డేటా ఇప్పుడు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిషన్‌తో యూ పీ ఐ  ఇంటర్‌ఫేస్ ద్వారా సజావుగా షేర్ చేయబడుతోంది.

 

డిపార్ట్‌మెంట్ తన ప్రాంగణంలో రైడ్-ఆన్ స్వీపర్, ఆటో స్క్రబ్బర్ డ్రైయర్, సింగిల్ డిస్క్ క్లీనర్, వెట్ & డ్రై క్లీనర్, డ్రై వాక్యూమ్ క్లీనర్, హై ప్రెజర్ క్లీనర్ మొదలైన యంత్రాల ద్వారా పరిశుభ్రం చేస్తున్నారు.

 

  

కొత్త భవనాల నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా, డిపార్ట్‌మెంట్ తన పాత భవనాలలో ఒకటైన టిఫాక్ బ్లాక్‌ను అత్యంత పర్యావరణ అనుకూలమైన రీతిలో కూల్చివేస్తోంది. దుమ్ము కాలుష్యాన్ని అరికట్టేందుకు ఫాగింగ్ మిషన్‌ను డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసింది మరియు ఇలాంటి మరిన్ని ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. స్వచ్ఛతా కార్యక్రమం టెక్నాలజీ భవన్ క్యాంపస్‌లో నిర్మాణంలో “హరిత” అంశాలను మరింత మెరుగైన విధానం అమలు చేస్తోంది అలాగే కార్యాలయ స్థలాన్ని మెరుగుపరచడానికి ప్రోత్సాహాన్ని అందించింది.

***


(रिलीज़ आईडी: 1869486) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Kannada