రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సరుకుల రవాణా కోసం దేశంలో మొట్టమొదటిసారిగా అల్యూమినియం ఉపయోగించి నిర్మించిన అల్యూమినియం ఫ్రైట్ రేక్ - 61 BOBRNALHSM1ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించిన శ్రీ అశ్విని వైష్ణవ్


రైల్వే, బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిందాల్కో కలిసి స్వదేశంలో అభివృద్ధి చేసిన వ్యాగన్లు
సాంప్రదాయ వ్యాగన్ల తో పోల్చి చూస్తే అల్యూమినియం వల్ల అనేక ప్రయోజనాలు

Posted On: 16 OCT 2022 3:57PM by PIB Hyderabad

సరుకుల రవాణా కోసం  దేశంలో మొట్టమొదటిసారిగా అల్యూమినియం ఉపయోగించి నిర్మించిన అల్యూమినియం ఫ్రైట్ రేక్ - 61 BOBRNALHSM1ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు కేంద్ర రైల్వే,ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి  శ్రీ అశ్విని వైష్ణవ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు. బిలాస్పూర్  వరకు రైలు సరుకులు రవాణా చేస్తుంది. 

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అల్యూమినియం వ్యాగన్లను ఆర్దీఎస్ఓ, హిండాల్కో, బెస్కో వ్యాగన్ కలిసి అభివృద్ధి చేసి రూపొందించాయి. 

   అల్యూమినియం రేక్ ప్రత్యేకతలు :

•  వెల్డింగ్ లేకుండా పూర్తిగా లాక్‌బోల్టెడ్ విధానంలో నిర్మాణం.
•  వ్యాగన్ బరువు ఇనుముతో చేసిన  సాధారణ   వ్యాగన్  కంటే 3.25 టన్నులు తక్కువగా ఉంటుంది, 180 టన్నుల అదనపు బరువును మోసుకెళ్లే  సామర్థ్యంతో ఒక్కో వ్యాగన్‌కు ఉంటుంది.
• మొత్తం బరువు వ్యాగన్‌ బరువు  నిష్పత్తి 2.85 గా ఉంటుంది. 

• బరువు తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుంది. కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది. ఎక్కువ బరువు గల సరుకులు రవాణా చేసి రైలు ఖాళీగా వస్తున్న సమయంలో తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. జీవిత కాలంలో అల్యూమినియం ఉపయోగించి నిర్మించిన ఒక వ్యాగన్ 14,500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల ను తగ్గిస్తుంది.

•  రేకుల రేకుల పునఃవిక్రయం విలువ 80% వరకు ఉంటుంది. .

• సూపర్ స్ట్రక్చర్ అంతా అల్యూమినియం అయినందున ధర 35% ఎక్కువగా ఉంటుంది. .
•  తుప్పు మరియు రాపిడి నిరోధకత ఎక్కువగా ఉంటుంది. దీంతో నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. 

ఎక్కువగా దిగుమతి అయ్యే  నికెల్, కాడ్మియం వినియోగం ఉక్కు రంగంలో ఎక్కువగా ఉంటుంది.  అల్యూమినియం వ్యాగన్ల తయారీ వల్ల నికెల్, కాడ్మియం దిగుమతి తగ్గుతుంది. దేశీయ  అల్యూమినియం రంగం అభివృద్ధి చెందుతుంది. 

***


(Release ID: 1868350) Visitor Counter : 233