వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రెండు రోజుల పాటు జరిగే పి.ఎం. కిసాన్ సమ్మేళన్`2022ను అక్టోబర్ 17న న్యూఢల్లీిలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Posted On:
15 OCT 2022 12:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్రమోదీ , పిఎం కిసాన్ సమ్మేళన్ 2022ను న్యూఢల్లీిలోని పూసా ఐఎఆర్‌ఐ మేలా గ్రౌండ్‌లో 2022 అక్టోబర్ 17న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పి.ఎం.కిసాన్ ఫ్లాగ్‌షిప్ పథకం కింద 12 వ విడతగా 16,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తారు. దీనిని దేశవ్యాప్తంగా గల లబ్ధిదారుల ఖాతాలలో ప్రత్యక్షనగదు బదిలీ పథకం కింద జమచేస్తారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా అగ్రిస్టార్టప్ సదస్సును, ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖకు చెందిన 600 పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పిఎం`కెఎస్‌కె) కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.భారత్ యూరియా బ్యాగ్‌లను ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
ఒక దేశం` ఒక ఎరువు పేరుతో రైతుల కోసం భారతదేశపు అతిపెద్ద ఎరువుల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి కోట్లాదిమంది రైతులు, అగ్రి స్టార్టప్‌లు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, బ్యాంకర్లు, స్టేక్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రైతులు, అగ్రి స్టార్టప్ ప్లాట్‌ఫారంలను ఒక చోట చేరుస్తుందని ఆయన అన్నారు.
కోటిమందికిపైగా రైతులు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 732 కృషివిజ్ఞాన కేంద్రాలు (కెవికెలు) ,75 ఐకార్ సంస్థలు, 75 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 600 పిఎం కిసాన్ కేంద్రాలు, 50,000 ప్రాథమిక వ్వవసాయ సహకార సొసైటీలు, 2 లక్షల కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు ( సిఎస్‌సి) ఈకార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీ భగవంత్ ఖూబా, వ్యవసాయం , రైతు సంక్షేమశాఖ సహాయ మంత్రులు శ్రీ కైలాష్ చౌదరు, శ్రీమతి శోభా కరండజేలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
పిఎం`కిసాన్ పథకం కింద లబ్ధిదారులైన రైతులకు 12 వ విడత వాయిదా కింద 16,000 కోట్ల రూపాయaల విడుదల
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం పిఎం`కిసాన్ పథకం 12 వ విడత వాయిదా కింద 16,000 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం`కిసాన్) భారత ప్రభుత్వ ప్లాగ్‌షిప్ పథకం.వ్యవవసాయ రంగంలో ఉత్పాదకతోకూడిన, సమగ్ర ప్రగతికి సంబంధించిన విధానాలు కార్యక్రమాల అమలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 24.02.2019న ప్రారంభించారు.ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలవంతున మూడు వాయిదాలలో ఒక్కోవాయిదాకు రూ2,000 వంతున ప్రతినాలుగు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఈ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బదిలీ చేస్తారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలు పిఎం కిసాన్ పథకం కింద 11 వాయిదాలలో 2 లక్షల కోట్లరూపాయలకు పైగా మొత్తాన్ని అందుకున్నాయి. ఇంఉలో 1.6 లక్షల కోట్లరూపాయలు కోవిడ్ మహమ్మారి సమయంలో రైతుల ఖాతాలలో జమచేశారు. 17.10.2022న ప్రధానమంత్రి 12 వ విడత మొత్తాన్ని విడుదల చేయనున్నాఉ. దీనితో లబ్ధిదారుల ఖాతాలకు జమ అయిన మొత్తం 2.16 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది.ఈ పథకం ప్రారంభించినప్పటినుంచి , ఈ పథకం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఇంత భారీ ఎత్తున పథకం చేపట్టినందుకు అన్ని వర్గాల నుంచి అభినందనలు లభించాయి. ఈ పథకం లోగల పారదర్శకత, అర్హులైన రైతులబ్ధిదారుల ఖాతాలలోకి ఎలాంటి ఆటంకం లేకుండా నిధుల బదలీ ప్రశంసలను అందుకుంది. ఈ పథకం దేశంలోని రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూవస్తోంది. ఇది కోవిడ్ సమయంలో వారి రోజువారీ ఖర్చులకు కూడా ఉపయోగపడిరది.
అగ్రి స్టార్టప్ సదస్సు, ఎగ్జిబిషన్ ప్రారంభం:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అగ్రిస్టార్టప్ సదస్సు, ఎగ్జిబిషన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు.సుమారు 300 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి . మెరుగైన సాగుపద్ధతులు, పంగ కోత అనంతర విలువ ఆధారిత పరిష్కారాలు, వ్యవసాయ అనుబంధ ఆవిష్కరణలు, సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, అగ్రి లాజిస్టిక్‌కి సంబంధించిన ఆవిష్కరణలు ప్రదర్శిస్తారు. సుమారు 1500 స్టార్టప్‌లు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నాయి. ఈ ప్లాట్‌ఫాం స్టార్టప్‌లు రైతులు,ఎఫ్.పి.ఓలు, వ్యవసాయరంగ నిపుణులు కార్పొరేట్ రంగం అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీలుకల్పిస్తుంది. అక్టోబర్ 18న స్టార్టప్‌లు, టెక్నికల్ సెషన్ లో తమ అనుభవాలను ఇతర స్టేక్ హోల్డర్లతో పంచుకుంటాయి.అనంతరం, విధాన నిర్ణేతలు, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో అలాగే, స్టార్టప్ వాతావరణాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ పథకాలలో స్టార్టప్ సంస్థల పాత్రను వివరిస్తారు.
దేశంలో వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను ప్రారంభించింది. ఇది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను పునురుత్తేజితం చేయడానికి పనికి వస్తుంది. ఇందుకు సంబంధించి ఐదు నాలెడ్జ్ సంస్థల భాగస్వామ్యంతో దీనిఇక రూపకల్పన చేశారు.
అవి ఐఎఆర్‌ఐ, ఎంఎఎన్‌ఎజిఇ, ఎన్ ఐఎఎం, ఎఎయు, యుఎస్‌ధర్వాడ్, 24 రబి లు, ఇందుకు ప్రీ సీడ్ స్టేజ్ స్టార్టప్‌లకు 5 లక్షల రూపాయలు,సీడ్ స్టేజ్ స్టార్టప్‌లకు 25 లక్షల రూపాయలు అందజేస్తారు. దీనికితోడు ఆకెవివై రాఫ్తార్ కింద 2500 కు పైగా అగ్రిస్టార్టప్‌లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా వ్యవసాయ రంగసమస్యలైన చిన్నకమతాలు , మౌలిక సదుపాయాల లేమి , తక్కువ స్థాయిలో వ్యవసాయ సాంకేతికతను వాడడం, అత్యుత్తమ వ్యవసాయ సాంకేతికత, విపరీతంగా ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూసార క్షీణత వంటి సమస్యలపరిష్కారానికి ఈ శిక్షణ ఇచ్చారు.
6000 కిసాన్ సమృద్ధి కేంద్రాల ప్రారంభం ( పిఎం`కెఎస్‌కె):
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన 600 పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తారు. స్త్రుతం దేశంలో గ్రామస్థాయిలో , సబ్ డివిజన్, తాలూకా, జిల్లాస్థాయిలో 2.7 లక్షల ఎరువుల రిటైల్ షాపులు ఉన్నాయి. ఇవి ఆయా కంపెనీలు, కోఆపరేటివ్ షాప్‌లు, లేదా రిటైల్ దుకాణాలు, ప్రైవేటు డీలర్లు నడుపుతున్నవి. ఎరువుల రిటైల్ షాపులను దశలవారిగా వన్‌స్టాప్‌షాప్‌లుగా మారుస్తారు. వీటిని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధికేంద్రాలుగా (పిఎంకెఎస్‌కె)లుగా పిలుస్తారు..
ఇవి దేశంలోని రైతుల అవసరాలైన ఎరువులు, విత్తనాలు, ఉపకరణాలను అందిస్తాయి. అలాగే భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువుల విషయమై రైతులకు అవగాహన కల్పిస్తాయి. అలాగే వివిధ ప్రభుత్వపథకాల గురించిన సమాచారాన్ని రైతులకు అందిస్తాయి. రిటైలర్లకు బ్లాక్, జిల్లాస్తాయిలో సామర్థ్యాలపెంపునకు ఇవి దోహదపడతాయి. పైలట్ పథకం కింద ప్రతిజిల్లాలో ఒక రిటైల్ షాప్‌ను ఆదర్శ షాప్‌గా తీర్చిదిద్దుతారు. 3,30,499 రిటైల్ ఎరువుల షాపులను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధికేంద్రాలుగా మార్చేందుకు ప్రతిపాదించడం జరిగింది.
ఒక దేశం ఒక ఎరువు పథకం కింద రైతులకు భారత్ యూరియా బ్యాగ్‌ల ఆవిష్కరణ:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ , ఎరువుల రంగంలో అతిపెద్ద కార్యక్రమమైన ఒకదేశం, ఒక ఎరువు (ఒఎన్ ఒఎఫ్)ను ప్రారంభించనున్నారు. ఎరువుల కర్మాగారాలు తమ ఉత్పత్తులను భారత్ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేయాల్సిఉంటుంది. ఎరువులకు సంబంధించి ప్రమాణాలు పాటించేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అది భారత్ యూరియా, భారత్ డిఎపి, భారత్ ఎంఒపి , భారత్ ఎన్‌పికె ఇలా ఏదయిన భారత్ బ్రాండ్ తో మార్కెట్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఎరువుల ఉత్పత్తులకు ఉమ్మడిగా భారత్ బ్రాండ్‌ను తీసుకరావడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రధానమంత్రి ఈ సందర్బంగా భారత్ యూరియా బ్యాగ్‌లను ఆవిష్కరించనున్నారు.
ఎరువులకు సంబంధించి అంతర్జాతీయ ఈ `మాగజైన్ వారపత్రిక ఆవిష్కరణ:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇండియన్ ఎడ్జ్‌పేరుతో ఎరువుల రంగానికి సంబంధించిన అంతర్జాతీయ ఈ మాగజైన్ ను ప్రారంభించనున్నారు. ఇది జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఎరువుల పరిస్థితిపై సమాచారాన్ని ఇవ్వనుంది. ఇందులో ఎరువుల రంగంలో ఇటీవల పరిణామాలు, ధరల తీరుతెన్నుల విశ్లేషణ, ఎరువుల అందుబాటు, వినియోగం, రైతుల విజయగాథలు వంటివాటిని ఇందులో ప్రచురిస్తారు.
***
(Release ID: 1868308)
Visitor Counter : 268