పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఇంధన సమస్య ను భారత ప్రభుత్వం చాలా బాగా అధిగమించింది : కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్. పూరి
మూడు రోజుల 5వ దక్షిణాసియా భూగర్బ శాస్త్ర మహాసభ జియో ఇండియా 2022 ప్రారంభమయ్యింది.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ ఎస్.పూరి ప్రపంచ సదస్సును ప్రారంభించారు
Posted On:
14 OCT 2022 4:15PM by PIB Hyderabad
పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు మరియు గ్యాస్ ధరల నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను తప్పించడం ద్వారా భారత ప్రభుత్వం ప్రపంచ ఇంధన సవాళ్లను బాగా అధిగమించింది. ప్రస్తుతం, మన దేశంలో ప్రతిరోజూ ఐదు మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం వినియోగమవుతోంది , అది కూడా మూడు శాతం పెరుగుతోంది, ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు ఒక శాతం ఎక్కువ. శుక్రవారం ఇక్కడ సీతాపురలోని జేఈసీసీలో ప్రారంభమైన మూడు రోజుల దక్షిణాసియా భూగర్బ శాస్త్ర మహాసభ జియో ఇండియా 2022లో కేంద్ర పెట్రోలియం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ ఎస్. పూరి ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
ప్రముఖ జియాలజిస్ట్ శ్యామ్ వ్యాస్ రావు, మాజీ డైరెక్టర్ (అన్వేషణ), ఓ ఎన్ జి సి కి కూడా మంత్రి ప్రారంభసభ లో జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
ప్రారంభ సభ లో మంత్రి మాట్లాడుతూ, షెడ్యూల్ కంటే 5 నెలల ముందుగానే పెట్రోలులో ఇథనాల్-మిశ్రమ శాతం 2013లో 0.67 శాతం నుండి మే 2022 నాటికి 10 శాతానికి పెరిగిందని, ఇది పర్యావరణానికి మేలు చేసే ఉద్గారాలను 2.7 మిలియన్ టన్నుల కర్భన ఉద్గారాలను (CO2) తగ్గిస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) అంచనాల ప్రకారం, రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశం నాలుగింట ఒక వంతు (25%) వాటా కలిగి ఉంటుంది. 2050 నాటికి సహజ వాయువు డిమాండ్ ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా వేయగా, భారతదేశ ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని బీ పీ అంచనా వేసింది.
పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ, పెరుగుతున్న డిమాండ్ మరియు ఇంధన వనరుల కొరత నేపథ్యంలో భూగర్బ శాస్త్ర నిపుణులు తమ సహకారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. సుస్థిరమైన అభివృద్ధి కోసం చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడానికి లోతైన, అతి-లోతైన మరియు సముద్రతీరానికి తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన భూగర్బ శాస్త్ర సాంకేతిక నిపుణులలో సోదరభావాన్ని కోరారు.
అంతకుముందు, ప్రముఖులు మరియు ప్రతినిధులను స్వాగతిస్తూ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) మరియు ఏ పి జీ యొక్క చీఫ్ ప్యాట్రన్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం జియాలజిస్ట్స్ (APG) ఆధ్వర్యంలో భారతదేశం జియో ఇండియా గత 14 సంవత్సరాలలో ఒక ప్రధాన నాయకుడిగా ఉంది. ద్వైవార్షిక దక్షిణాసియా భూగర్బ శాస్త్ర మహాసభ మరియు ఎగ్జిబిషన్ పరిమాణం మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం పరంగా అభివృద్ధి చెందింది. చమురు మరియు గ్యాస్ రంగంలో ఆటోమేషన్ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్ విలువ దాదాపు రెట్టింపు మరియు 2030 నాటికి సుమారుగా $42 బిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది. చమురు మరియు గ్యాస్ రంగం డిజిటల్ పరివర్తనను సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
***
(Release ID: 1867920)
Visitor Counter : 150