ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో రెండు జల విద్యుత్తు పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై – III) ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

‘‘రాబోయే 25 సంవత్సరాలు 130 కోట్ల మంది భారతీయులకు చాలా కీలకం’’

‘‘రాష్ట్రం లో అభివృద్ధి గతి ని రెట్టింపు చేసిన డబల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క బలాన్ని హిమాచల్ ప్రస్తుతం అర్థం చేసుకొంది’’

‘‘కొండ ప్రాంతాల లో, చేరుకోవడం కష్టమైన ప్రాంతాల లో శీఘ్ర అభివృద్ది తాలూకు ఒక మహా యజ్ఞం సాగుతున్నది’’

‘‘మీరు (ప్రజలు) ఇచ్చే ఆదేశమే నాకు సర్వోన్నతం. మీరే నా అధిష్టాన వర్గం’’

‘‘సేవ చేయాలన్న భావన బలం గా ఉన్నప్పుడు మాత్రమే ఆ తరహా అభివృద్ధి పనులు చోటు చేసుకొంటాయి’’

‘‘ఆధ్యాత్మికత మరియు పర్యటన ల యొక్క శక్తి ని డబల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే గుర్తిస్తుంది’’

Posted On: 13 OCT 2022 2:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో రెండు జల విద్యుత్తు పథకాలు రెండిటి కి ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై) - III ను ప్రారంభించారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రెండు రోజుల కిందట మహాకాలుని నగరాన్ని సందర్శించిన తాను మరి ఈ రోజు న మణిమహేశ్వర్ సాన్నిధ్యానికి వచ్చానన్నారు. చంబా కు సంబంధించినటువంటి వివరాలు ఉన్న ఒక లేఖ ను ఈ ప్రాంతాని కి చెందిన ఓ టీచర్ వద్ద నుండి తాను అందుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ లేఖ లోని వివరాల ను ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఈ సరికే వెల్లడించి ఉన్నారు.

రహదారుల సంధానాని కి సంబంధించిన అనేక పథకాల ను మరియు చంబా లో ఉపాధి కల్పన పథకాల ను ప్రారంభించే అవకాశం తన కు దక్కినందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో తాను ఉన్న రోజుల ను ప్రధాన మంత్రి జ్ఞాపకానికి తెచ్చుకొంటూ ప్రస్తుతం ‘పహాడ్ కా పానీ ఔర్ పహాడ్ కీ జవానీ పహాడ్ కే కామ్ నహీ ఆతీ’ అనే ఒక నానుడి ని గురించి ప్రస్తావించారు. ఈ మాటల కు- పర్వత ప్రాంతాల లోని యువత మరియు జలం .. ఇవి పర్వతాల కు పనికి రావు- అని అర్థం. అయితే వర్తమానం లో ఈ భావం మార్పుల కు లోనవుతోంది. ఇప్పుడు కొండ ప్రాంతాల యువత ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి లో ఒక క్రియాశీల పాత్ర ను పోషించనుంది’’ అని ఆయన అన్నారు.

‘‘రాబోయే 25 సంవత్సరాలు 130 కోట్ల మంది భారతీయుల కు చాలా కీలకం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ఆజాదీ కా అమృత్ కాల్ మొదలైంది. ఈ కాలం లో మనం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలనేటటువంటి లక్ష్యాన్ని సాధించవలసి ఉంది. రాబోయే కొన్ని నెలల్లో హిమాచల్ స్థాపన జరిగి 75 సంవత్సరాలు కూడా పూర్తి కానున్నాయి. అంటే భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్ర్యం తాలూకు వంద సంవత్సరాల ను ఒక ఉత్సవం గా జరుపుకొంటుందో అదే కాలం లో హిమాచల్ సైతం తన ఆవిర్భావం అనంతరం వంద సంవత్సరాల ఘట్టాన్ని జరుపుకొంటుందన్నమాట. ఈ కారణంగానే రాబోయే 25 సంవత్సరాల లో ప్రతి రోజు మనకు చాలా ముఖ్యమైంది అని ప్రధాన మంత్రి వివరించారు.

దిల్లీ లో హిమాచల్ ప్రదేశ్ కు ఏమంత పలుకుబడి లేనటువంటి రోజుల ను మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క కోరికల ను, అభ్యర్థనల ను చిన్న చూపు చూసినటువంటి కాలాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ పరిణామాల ఫలితం గా, చంబా వంటి ముఖ్య ధార్మిక ప్రదేశాలు, ప్రాకృతిక శోభ ఉట్టిపడే స్థలాలు అభివృద్ధి పరుగు లో వెనుకబడిపోయాయన్నారు. చంబా యొక్క బలాల ను గురించి తనకు తెలిసివున్నందు వల్ల చంబా కు ఆకాంక్ష భరిత జిల్లా గా మలచే ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరిగింది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. కేరళ కు చెందిన బాలలు ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ భావన తో హిమాచల్ కు తరలిరావడం పట్ల ఆయన ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

డబల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క బలాన్ని ప్రస్తుత హిమాచల్ గ్రహించిందని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఈ ప్రభుత్వం రాష్ట్రం లో అభివృద్ధి యొక్క గతి ని రెట్టింపు చేసిందన్నారు. ఇదివరకటి ప్రభుత్వాలు పని భారం మరియు ఒత్తిడి తక్కువ గా ఉన్నటువంటి, మరి అలాగే రాజకీయ ప్రయోజనాలు అధికం గా ఉన్నటువంటి ప్రాంతాల కు మాత్రమే సేవల ను అందించేవి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. తత్ఫలితంగా సుదూర ప్రాంతాలు మరియు ఆదివాసి ప్రాంతాల లో అభివృద్ధి చాలా స్వల్పం గా మిగిలిపోయింది. ‘‘అవి రహదారులు కావచ్చు, లేదా విద్యుత్తు కావచ్చు లేదా నీరు కావచ్చు అటువంటి ప్రాంతాల ప్రజలు ప్రయోజనాల ను అందుకోవడం లో ఆఖరు న మిగిలిపోయే వారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘డబల్ ఇంజిన్ ప్రభుత్వం పని చేసే సరళి మిగతా వాటి కంటే భిన్నమైంది. మా ప్రాధాన్యం ఏమిటి అంటే ప్రజల జీవనాన్ని సులభతరం గా ఎలా మార్చాలి అనేదే. అందుకనే మేం ఆదివాసి ప్రాంతాల మీద, ఇంకా కొండ ప్రాంతాల మీద గరిష్ఠ శ్రద్ధ ను తీసుకొంటున్నాం’’ అని ఆయన అన్నారు. గ్యాస్ కనెక్శన్ లు, తాగునీటి ని నల్లా ద్వారా సరఫరా చేయడం, ఆరోగ్య సేవ లు, ఆయుష్మాన్ భారత్, ఇంకా రహదారి సంధానం సమకూర్చడం వంటి చర్యల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ కార్యాలు సుదూర ప్రాంతాల లో, కొండ ప్రాంతాలలో ప్రజా జీవనం లో పరివర్తన ను తీసుకువస్తున్నాయన్నారు. ‘‘మేం పల్లె ప్రాంతాల లో వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామంటే, అదే కాలం లో వైద్య కళాశాలల ను జిల్లాల లో సైతం తెరుస్తున్నాం’’ అని ఆయన నొక్కి చెప్పారు. పర్యటన కు రక్షణ కల్పించడం కోసం టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాని కి హిమాచల్ ఏ విధం గా అగ్ర తాంబూలాన్ని ఇచ్చిందీ అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దేశం లో అత్యంత వేగం గా అందరి కి టీకామందు ను ఇప్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ని మరియు ఆయన జట్టు ను శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

గ్రామీణ ప్రాంతాల లో రహదారుల నిర్మాణాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ 2014వ సంవత్సరం వరకు చూసుకొంటే స్వాతంత్ర్యం వచ్చింది మొదలు 7000 కిలోమీటర్ల నిడివి కలిగిన పల్లె ప్రాంత రహదారుల ను 1800 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. అయితే గత 8 సంవత్సరాల లో 12000 కి.మీ. రహదారుల ను కేవలం 5000 కోట్ల వ్యయం తో నిర్మించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న ఆరంభించిన పథకాలు 3000 కి.మీ. గ్రామీణ రహదారుల కు రూపుదిద్దుతాయి అని ఆయన వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్ వినతుల తో దిల్లీ కి వచ్చే రోజులు చెల్లిపోయాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం హిమాచల్ కొత్త పథకాల తాలూకు సమాచారం తోను, తన పురోగతి కి సంబంధించిన వివరాలతోను మరియు తన హక్కుల ను వివరిస్తూ తనకు కావలసిన వాటిని గురించి అడగడానికి వస్తోంది అని ఆయన అన్నారు. మీరే నా అధిష్ఠానవర్గం. నేను దీనిని నా యొక్క సౌభాగ్యం గా తలుస్తున్నాను. ఈ కారణంగానే మీకు సేవ చేయడం నాకు ఒక భిన్నమైనటువంటి ఉల్లాసాన్ని, శక్తి ని అందిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

గడచిన 8 సంవత్సరాల లో జరిగిన అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి స్పష్టంగా చెప్తూ, దేశవ్యాప్తం గా కొండ ప్రాంతాల లోను దుర్గమ ప్రాంతాల లోను ఆదివాసి ప్రాంతాల లోను శీఘ్ర అభివృద్ధి కి సంబంధించిన ఒక మహా యజ్ఞ‌ం సాగుతోంది’’ అన్నారు. దీని యొక్క లాభాలు హిమాచల్ లోని చంబా కు మాత్రమే పరిమితం కావు. ఈ లాభాల ను పంగీ-భార్ మౌర్, ఛోటా - బడా భంగాల్, గిరింపార్, కిన్నౌర్, ఇంకా లాహౌల్ –స్పీతీ లు కూడా అందుకొంటున్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాంక్ష యుక్త జిల్లా ల అభివృద్ధి ర్యాంకింగు లో చంబా రెండో స్థానాన్ని సంపాదించినందుకు ఛంబా కు ఆయన అభినందన లు తెలిపారు.

ఆదివాసి సముదాయాల అభివృద్ధి విషయం లో తీసుకుంటున్న శ్రద్ధ గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సిర్ మౌర్ పరిధి లోని గిరిపార్ ప్రాంతాని కి చెందిన హటీ సముదాయాని కి ఆదివాసి హోదా ను ఇవ్వాలన్న మరొక ప్రముఖ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొందన్నారు. ‘‘ఆదివాసి ప్రజల పురోగతి కి మా ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నదో ఈ నిర్ణయం చాటిచెబుతోంది’’ అని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోను మరియు కేంద్రం లోను మునుపటి ప్రభుత్వాలు సుదూర గ్రామాల ను మరియు ఆదివాసి గ్రామాల ను ఒక్క ఎన్నికల కాలం లో మాత్రమే పట్టించుకొనేవి. అయితే ఇప్పటి డబల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజల కు నిరంతరాయం గా సేవ చేయడం కోసం శ్రమిస్తోంది అని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి కాలం లో పేద కుటుంబాల కు సహాయాన్ని అందించడం కోసం ప్రభుత్వం నడుం భిగించడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెస్తూ ఉచిత రేశన్ కార్యక్రమాన్ని ప్రముఖం గా ప్రస్తావించారు. ’’ప్రభుత్వం గడచిన ఒకటిన్నరేళ్ళు గా దేశం లో 80 కోట్ల మందికి పైగా ఆహార ధాన్యాల ను అందిస్తోందని తెలిసి ప్రపంచం భారతదేశాన్ని చూసి ఆశ్చర్యపోతోంది’’ అని ఆయన అన్నారు. భారతదేశం లో అమలుపరుస్తున్న కోవిడ్ టీకాకరణ కార్యక్రమం యొక్క సాఫల్యాన్ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్తూ, ఈ సఫలత తాలూకు ఖ్యాతి అంతా ఆరోగ్య విభాగం మరియు ఆశా శ్రమికుల క్రియాశీల భాగస్వామ్యాని దే అని కొనియాడారు. సేవ చేయాలి అనే భావన బలం గా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి తాలూకు ఆ తరహా కార్యాలు చోటుచేసుకొంటాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఉపాధి పరంగా కొండ ప్రాంతాలు, ఆదివాసి ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మేం ఈ ప్రాంతాల కు ఉన్న బలాన్ని, ఇక్కడి ప్రజల యొక్క బలం గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. ‘‘ఆదివాసి ప్రాంతాల లో జల సంపద మరియు వన సంపద అమూల్యమైనవి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చంబా అనేది దేశం లో జల విద్యుత్తు ఉత్పాదన ఆరంభం అయిన ప్రాంతానికి చెందినది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న శంకుస్థాపన జరిగిన పథకాలు విద్యుత్తు ఉత్పాదన రంగం లో హిమాచల్ మరియు చంబా ల వాటా ను అధికం చేస్తాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు నుండి చంబా, హిమాచల్ వందల కోట్ల రూపాయల ను ఆర్జించనున్నాయి. మరి ఇక్కడి యువత ఉపాధి అవకాశాల ను అందుకొంటుంది’’ అని ఆయన అన్నారు. ‘‘కిందటి ఏడాది లో ఈ తరహా పెద్ద జల విద్యుత్తు పథకాలు నాలుగింటి కి ప్రారంభోత్సవం చేసేటటువంటి మరియు శంకుస్థాపన చేసేటటువంటి అవకాశాలు నాకు లభించాయి. కొన్ని రోజుల కిందట బిలాస్ పుర్ లో ఆరంభించిన హైడ్రో ఇంజీనియరింగ్ కాలేజి సైతం హిమాచల్ యువతీ యువకుల కు మేలు చేస్తుంది’’ అని ఆయన అన్నారు.

తోట పంట ల పెంపకం, పశు పోషణ, హస్తకళ లు.. ఈ రంగాల లో హిమాచల్ కు ఉన్న బలాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, పుష్పాలు, చంబా లోని చుఖ్, రాజ్ మా మాద్రా, చంబా చెప్పులు, చంబా థాల్, ఇంకా పాంగి కి తంగి వంటి స్థానిక ఉత్పత్తుల ను ప్రోత్సహిస్తున్న స్థానిక స్వయం సహాయ సమూహాల ను ప్రశంసించారు. ఈ ఉత్పాదన లు దేశాని కి లభించిన వారసత్వం అని ఆయన అభివర్ణించారు. వోకల్ ఫార్ లోకల్ ను ఒక ఉదాహరణ గా ఆయన చెప్తూ, స్థానిక ఉత్పాదనల ను ప్రోత్సహించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు అండగా ఉంటున్నందుకు స్వయం సహాయ సమూహాలతో అనుబంధం కలిగి ఉన్న మహిళల ను ప్రశంసించారు. ఈ ఉత్పాదనల ను ఒక జిల్లా, ఒక ఉత్పాదన పథకం లో భాగం గా కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలియజేశారు. ఈ వస్తువుల ను విదేశీ ఉన్నతాధికారుల కు కానుక గా ఇవ్వడానికి తాను చూస్తుంటానని ఆయన అన్నారు. అలా చేస్తే హిమాచల్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు యావత్ ప్రపంచాని కి తెలుస్తాయి. అంతే కాకుండా మరింత మంది వ్యక్తులు హిమాచల్ లో తయారయ్యే ఉత్పాదనల ను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు అని ఆయన అన్నారు.  

‘‘డబల్ ఇంజిన్ ప్రభుత్వం అనేది ఎటువంటి ప్రభుత్వం అంటే అది తన సంస్కృతి ని, వారసత్వాన్ని మరియు విశ్వాసాన్ని గౌరవించేది. చంబా తో సహా, యావత్తు హిమాచల్ విశ్వాసాని కి మరియు వారసత్వాని కి నిలయం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని వారసత్వ భాండాగారం మరియు పర్యటన సంబంధి అంశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కుల్లూ లో నిర్వహించిన దసరా మహోత్సవాన్ని తాను సందర్శించిన విషయాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. మనకు ఒక వైపు న వారసత్వం, మరొక వైపున పర్యాటకం ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. డల్హౌసి మరియు ఖజ్జియార్ వంటి యాత్రా స్థలాలు ఆధ్యాత్మికత, ఇంకా పర్యటన సంపద ల పరంగా హిమాచల్ కు ఒక చోదక శక్తి గా నిలవబోతున్నాయి అని ఆయన అన్నారు. ‘‘డబల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క శక్తి కి గుర్తింపు ను కల్పిస్తుంది. హిమాచల్ తన నిర్ణయాన్ని ఖాయపరచుకొంది. అది పాత ఆచారాన్ని మార్చివేసి మరి ఒక కొత్త సంప్రదాయాన్ని ఏర్పరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భారీ గా తరలివచ్చిన జన సమూహాని కి ప్రధానమంత్రి తన అభివాదాన్ని అందజేస్తూ, ఈ గొప్ప సమూహం లో తాను హిమాచల్ యొక్క వృద్ధి కి మరియు సంకల్పాల కు ఉన్నటువంటి శక్తి ని గమనిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగం ముగింపు లో, హిమాచల్ ప్రదేశ్ ప్రజల సంకల్పాల కు మరియు స్వప్నాల కు తన సమర్థన కొనసాగుతుంది అంటూ హామీ ని ఇచ్చారు.  

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సమాచార- ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్, పార్లమెంటు సభ్యులు శ్రీ కిశన్ కపూర్, ఇందు గోస్వామి గారు, బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు శ్రీ సురేశ్ కశ్యప్ మరియు ఇతరులు ఉన్నారు.

 

పూర్వరంగం

ప్రధాన మంత్రి రెండు జల విద్యుత్తు పథకాల ను .. 48 మెగా వాట్ల సామర్థ్యం కలిగి వుండే ఛంజూ - III హైడ్రో ఇలెక్ట్రిక్ ప్రాజెక్టు మరియు 30 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి వుండే దేవ్ థల్ ఛంజూ హైడ్రో ఇలెక్ట్రిక్ ప్రాజెక్టు కు.. శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్రాజెక్టు లు ఏటా 270 మిలియన్ యూనిట్ లకు పైగా విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ ప్రాజెక్టు ల ద్వారా హిమాచల్ ప్రదేశ్ కు దాదాపు గా 110 కోట్ల రూపాయల వార్షిక రాబడి దక్కుతుందన్న అంచనా ఉంది.

ప్రధాన మంత్రి హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు గా 3125 కి.మీ. రహదారుల ఉన్నతీకరణ కోసం ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’ (పిఎంజిఎస్ వై)-III ని కూడా ప్రారంభించారు. ఈ దశ లో భాగం గా రాష్ర్టం లో 15 సరిహద్దు ప్రాంత బ్లాకులు మరియు సుదూర బ్లాకుల లో 440 కి.మీ. ల రహదారుల ఉన్నతీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 420 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసింది.

 

 


(Release ID: 1867509)