ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా ను మరియు చంబా ను అక్టోబర్ 13న సందర్శించనున్న ప్రధాన మంత్రి
ఔషధ నిర్మాణరంగం లో ఆత్మనిర్భరత ప్రయాసల నువృద్ధి చెందింపచేయడం కోసం ఊనా లో బల్క్ డ్రగ్ పార్కు కు శంకుస్థాపన చేయనున్నప్రధాన మంత్రి
ఐఐఐటి ఊనా నుప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు; దీనికి 2017వ సంవత్సరం లో ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు
ఊనా హిమాచల్నుండి న్యూఢిల్లీ కి రాక పోక లు జరిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు కూడా ప్రధాన మంత్రిపచ్చ జెండా ను చూపనున్నారు
చంబా లోరెండు జల విద్యుత్తు పథకాల కుప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు
హిమాచల్ ప్రదేశ్ లో ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్ వై) - III ని కూడా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
12 OCT 2022 3:46PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ను అక్టోబర్ 13వ తేదీ నాడు సందర్శించనున్నారు. ఊనా లో ప్రధాన మంత్రి ఊనా హిమాచల్ రైల్ వే స్టేశన్ నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక పచ్చ జెండా ను చూపుతారు. అటు తరువాత, ఒక సార్వజనిక సదస్సు లో ప్రధాన మంత్రి పాల్గొని, ఐఐఐటి ఊనా ను దేశ ప్రజల కు అంకితం చేయడంతో పాటుగా ఊనా లో బల్క్ డ్రగ్ పార్కు కు శంకుస్థాపన చేస్తారు. తదనంతరం, చాంబా లో ఒక సార్వజనిక సదస్సు లో ప్రధాన మంత్రి పాల్గొని రెండు జల విద్యుత్తు పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు గా హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై) -III ని ప్రారంభిస్తారు.
ఊనా లో ప్రధాన మంత్రి
ఆత్మ నిర్భర్ భారత్ ను ఆవిష్కరిద్ధాం అంటూ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ను దేశం అందుకొని అనేక కొత్త కొత్త కార్యక్రమాల కోసం ప్రభుత్వం సమర్థన ద్వారా పలు రంగాల లో స్వయంసమృద్ధి ని సాధించే దిశ లో ముందుకు కదులుతోంది. ఇటువంటి ఒక కీలక రంగమే ఔషధ నిర్మాణ రంగం. ఈ రంగం లో ఆత్మ నిర్భరత ను సాధించడం కోసం, ప్రధాన మంత్రి ఊనా జిల్లా లోని హరోలీ లో ఒక బల్క్ డ్రగ్ పార్కు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ని 19 వందల కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఎపిఐ దిగుమతుల మీద ఆధారపడడాన్ని ఈ పార్కు తగ్గించనుంది. దీని ద్వారా దాదాపు గా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ను ఆకర్షించడంతో పాటుగా 20 వేల మంది కి పైగా ప్రజల కు ఉపాధి అందగలదన్న అంచనా కూడా ఉంది. ఇది ఆ ప్రాంతం లో ఆర్థిక కార్యకలాపాల కు ఉత్తేజాన్ని కూడా అందించగలుగుతుంది.
ప్రధాన మంత్రి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ (ఐఐఐటి) ఊనా ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనికి 2017వ సంవత్సరం లో శంకుస్థాపన చేసింది కూడా ప్రధాన మంత్రే. వర్తమానం లో ఈ ఇన్స్ టిట్యూట్ లో 530 కి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ప్రధాన మంత్రి కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభిక ప్రయాణానికి సూచకం గా ఆకుపచ్చని జెండా ను కూడా చూపనున్నారు. అంబ్ అందౌరా నుండి న్యూ ఢిల్లీ కి ప్రయాణించే ఈ రైలు, దేశం లో పరిచయం చేస్తున్నటువంటి నాలుగో వందే భారత్ రైలు కానుంది. అంతేకాదు ఇదివరకటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లతో పోలిస్తే ఇది ఒక ఆధునిక వర్శన్ అని చెప్పాలి. ఇది మరింత ఎక్కువ తేలికపాటిది గా ఉండడం తో పాటుగా అతి స్వల్ప వ్యవధిలో అధికతమ వేగాన్ని అందుకొనే సామర్థ్యాన్ని కలిగివుంది. ఇది గంట కు వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకనుల లో అందిపుచ్చుకొంటుంది. ఈ రైలు ను ప్రవేశపెట్టడం ఆ ప్రాంతం లో పర్యటన రంగాని కి జోరు ను అందించడం లో సాయపడటం తో పాటు గా ఒక సుఖప్రధమైనటువంటి మరియు వేగవంతమయినటువంటి ప్రయాణ మాధ్యమాన్ని కూడా అందించనుంది.
చంబా లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి రెండు జల విద్యుత్తు పథకాల ను .. 48 మెగా వాట్ల సామర్థ్యం కలిగి వుండే ఛంజూ - III హైడ్రో ఇలెక్ట్రిక్ ప్రాజెక్టు మరియు 30 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి వుండే దేవ్ థల్ ఛంజూ హైడ్రో ఇలెక్ట్రిక్ ప్రాజెక్టు కు.. శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టు ల ద్వారా ఏటా 270 మిలియన్ యూనిట్ లకు పైగా విద్యుత్తు ను ఉత్పత్తి అవుతుంది. మరి హిమాచల్ ప్రదేశ్ కు ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు గా 110 కోట్ల రూపాయల వార్షిక రాబడి దక్కుతుందన్న అంచనా ఉంది.
ప్రధాన మంత్రి హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు గా 3125 కి.మీ. రహదారుల ఉన్నతీకరణ కోసం ‘్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’ (పిఎంజిఎస్ వై)-III ని కూడా ప్రారంభించనున్నారు. ఈ దశ లో భాగం గా రాష్ర్టం లో 15 సరిహద్దు ప్రాంత బ్లాకులు మరియు సుదూర బ్లాకుల లో 440 కి.మీ. ల రహదారుల ఉన్నతీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 420 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసింది.
**
(Release ID: 1867191)
Visitor Counter : 157
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam