నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో బిల్డ్, ఆపరేట్ మరియు ట్రాన్స్‌ఫర్ విధానంలో కాండ్లా వద్ద గల్ఫ్ ఆఫ్ కచ్ వెంబడి మల్టీపర్పస్ కార్గో (కంటైనర్/లిక్విడ్ కాకుండా) బెర్త్ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
Posted On:
12 OCT 2022 4:18PM by PIB Hyderabad
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో బిల్డ్, ఆపరేట్ మరియు ట్రాన్స్‌ఫర్ విధానంలో కాండ్లా వద్ద గల్ఫ్ ఆఫ్ కచ్ వెంబడి మల్టీపర్పస్ కార్గో (కంటైనర్/లిక్విడ్ కాకుండా) బెర్త్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2,250.64 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం ఖర్చులో 1719.22 కోట్ల రూపాయలను మల్టీపర్పస్ కార్గో అభివృద్ధికి ఏర్పాటైన సంస్థ ( బెర్తు వెంబడి డ్రెడ్జింగ్ పనులు, టర్నింగ్ సర్కిల్, అప్రోచ్ ఛానల్ పనులు), మిగిలిన 531.42కోట్లరూపాయలను సాధారణ వినియోగదారు యాక్సెస్ ఛానల్ నిర్మాణం, మూలధన డ్రెడ్జింగ్ మరియు సాధారణ వినియోగదారు రహదారి నిర్మాణం కోసం రాయితీ సంస్థ ( దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ) సమకూరుస్తాయి.
నిర్మాణం పూర్తైన తర్వాత భవిష్యత్ బహుళార్ధసాధక కార్గో (కంటైనర్/లిక్విడ్ కాకుండా) అవసరాలను తీర్చడానికి ఈ బెర్తు ఉపయోగపడుతుంది. 2026 నాటికి రవాణా అవసరాలు 2.85 ఎంఎంటీపిఏ వరకు మరియు 2030 నాటికి 27.49 ఎంఎంటీపిఏ వరకు ఉంటాయని అంచనా. కాండ్లా వద్ద గల్ఫ్ ఆఫ్ కచ్ వెంబడి ట్యూన్ టెక్రా వద్ద మల్టీపర్పస్ కార్గో (కంటైనర్/లిక్విడ్ కాకుండా) బెర్తును అభివృద్ధి చేయడం వల్ల ఉత్తర భారతదేశం (జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు)లో ఉన్న విస్తారమైన లోతట్టు ప్రాంతాలకు కంటైనర్ టెర్మినల్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రయోజనాలు అందించడంతో పాటు కాండ్లా రేవు సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రాంత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, నూతన ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడుతుంది.
ఎంపిక చేసిన సంస్థ బీఓటీ పద్దతిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుంది. అయితే, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ సాధారణ వినియోగ సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది.
ప్రాజెక్టు వివరాలు:
i. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక నిర్మాణ సంస్థను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రైవేట్ డెవలపర్/బిల్డ్ ఆపరేట్ & ట్రాన్స్‌ఫర్ ( బీఓటీ) ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలి. రాయితీ పొందే సంస్థ (ప్రైవేట్ డెవలపర్/ బీఓటీ ఆపరేటర్) ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ రూపకల్పన, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, సేకరణ, అమలు, ప్రారంభం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ ఒప్పందాన్ని రాయితీ అధికారం గల సంస్థ (దీనదయాళ్ పోర్ట్) అమలు చేస్తుంది. గుర్తించిన సరుకుల రవాణా, నిర్వహణకు గుత్తేదారు 30 సంవత్సరాల కాలానికి బాధ్యత వహిస్తాడు. . సాధారణ యాక్సెస్ ఛానల్ మరియు సాధారణ వినియోగదారు రహదారి వంటి సాధారణ సహాయక మౌలిక సదుపాయాలకు రాయితీ అథారిటీ (దీనదయాళ్ పోర్ట్) బాధ్యత వహిస్తుంది.
ii. ఒకేసారి నాలుగు నౌకలను నిర్వహించడానికి ఆఫ్-షోర్ బెర్తు సౌకర్యం, అనుబంధ సౌకర్యాల కల్పన కోసం రూ.1,719.22 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతారు. సంవత్సరానికి 18.33 మిలియన్ టన్నుల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రాజెక్టు కలిగి ఉంటుంది.
iii. తొలుత 1,00,000 డెడ్‌వెయిట్ టన్నేజ్ (DWT) సామర్ధ్యం కలిగే 15 ఏం డ్రాఫ్ట్ నౌకల రవాణా అవసరాలను ప్రాజెక్టు తీరుస్తుంది. దీనికోసం 15 ఎం డ్రాఫ్ట్‌తో రాయితీ అథారిటీ ఛానెల్ నిర్మాణానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి నిర్వహిస్తుంది.ఒప్పందం అమలులో ఉండే కాలంలో 18 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన నౌకల రాకపోకల కోసం బెర్తులను లోతు చేయడం, టర్నింగ్ సర్కిల్ వెడల్పు చేయడం లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ స్వేచ్ఛ కలిగి ఉంటుంది. రెండు సంస్థలు అవగాహనకు వచ్చి వ్యయ భాగస్వామ్యం, ఇతర సంబంధిత అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు అములు చేయాల్సి ఉంటుంది. అధిక ఆటుపోట్ల సగటు పెరుగుదల ప్రకారం, రాయితీదారు కు అందుబాటులో ఉంచబడే యాక్సెస్ ఛానెల్ డ్రాఫ్ట్ గరిష్ట డ్రాఫ్ట్‌గా పరిగణించబడుతుంది.
నేపథ్యం
భారతదేశంలో పన్నెండు ప్రధాన ఓడరేవులలో ఒకటిగా దీనదయాళ్ ఓడరేవు ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ గల్ఫ్‌లో భారతదేశం పశ్చిమ తీరంలో దీనదయాళ్ ఓడరేవు ఉంది. ఉత్తర భారతదేశానికి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు దీనదయాళ్ ఓడరేవు సేవలు అందిస్తోంది, .
***
(Release ID: 1867169)
Visitor Counter : 99