రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
భారతదేశానికి చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మరియు జర్మనీ కి చెందిన కె ప్లస్ మినరల్స్ & అగ్రికల్చర్ జి.ఎం.బి.హెచ్. అనుబంధ సంస్థ అయిన కె ప్లస్ ఎస్. మిడిల్ ఈస్ట్ ఎఫ్.జెడ్.ఈ. డి.ఎం.సి.సి మధ్య అవగాహన ఒప్పందాన్ని ప్రశంసించిన - డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
2025 వరకు ప్రతి సంవత్సరం 1,05,000 మెట్రిక్ టన్నుల చొప్పున మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎం.ఓ.పి) ను రాయితీతో కూడిన భారతదేశ నిర్దిష్ట ధరకు కె. ప్లస్ మిడిల్ ఈస్ట్ ఎఫ్.జెడ్.ఈ. డి.ఎం.సి.సి. సరఫరా చేస్తుంది
"భారతీయ వ్యవసాయ సమాజానికి సరసమైన ధరకు తగినంత ఎం.ఓ.పి. సరఫరాను నిర్ధారించడంలో ఈ దీర్ఘకాలిక ఒప్పందం చాలా దోహదపడుతుంది" : డాక్టర్ మాండవీయ
Posted On:
11 OCT 2022 2:46PM by PIB Hyderabad
కె.ప్లస్ ఎస్. మిడిల్ ఈస్ట్ ఎఫ్.జెడ్.ఈ. డి.ఎం.సి.సి. (జర్మనీలోని కె + ఎస్. మినరల్స్ & అగ్రికల్చర్ జీ.ఎం.బి.హెచ్. అనుబంధ సంస్థ) తో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్.సి.ఎఫ్) సంతకం చేసిన ఒక అవగాహన ఒప్పందాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కి ఈ రోజు అందించారు. ఈ అవగాహన ఒప్పందంపై 2022 అక్టోబర్, 6వ తేదీన సంతకాలు చేశారు. వ్యవసాయ సమాజానికి ఎం.ఓ.పి. లభ్యతను మెరుగుపరచడం, వివిధ గ్రేడ్‌ల కాంప్లెక్స్ ఎరువుల స్వదేశీ ఉత్పత్తిని పెంచడం ఈ ఎం.ఓ.యూ. ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కూడా పాల్గొన్నారు.
వ్యవసాయ సమాజానికి ఎరువుల లభ్యతను నిర్ధారించడానికి వీలుగా సంబంధిత వనరులు సమృద్ధిగా ఉన్న సంపన్న దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా సరఫరా అనుసంధానత లను ఏర్పాటు చేయడం కోసం భారత ప్రభుత్వం దేశీయ ఎరువుల పరిశ్రమ ను ప్రోత్సహిస్తోంది. ముడిసరుకు తో పాటు ఎరువుల ఖనిజాల దిగుమతులపై భారతదేశం ఎక్కువగా ఆధార పడుతున్నందున, ఈ భాగస్వామ్యాలు నిర్దిష్ట కాల వ్యవధిలో ఎరువులు, ముడి పదార్థాల సురక్షితమైన లభ్యతను అందిస్తాయి. అదేవిధంగా అస్థిర మార్కెట్ పరిస్థితుల్లో ధర స్థిరత్వాన్ని కూడా అందిస్తాయి.
అవగాహన ఒప్పందంలో భాగంగా, కె ప్లస్ ఎస్. సంస్థ 2022 నుంచి 2025 వరకు సంవత్సరానికి 1,05,000 మెట్రిక్ టన్నుల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎం.ఓ.పి) ని తగ్గింపుతో కూడిన భారతదేశ నిర్దిష్ట ధరకు సరఫరా చేస్తుంది. ఆర్.సి.ఎఫ్. సంస్థ క్యాప్టివ్ వినియోగంతో పాటు దాని వ్యాపార ప్రయోజనాల కోసం అవసరమైన ఎం.ఓ.పి. ని కె. ప్లస్ ఎస్. సంస్థ సరఫరా చేస్తుంది. ఆర్.సి.ఎఫ్. క్యాప్టివ్ వినియోగంలో 60 శాతం అవసరాన్ని ఈ సరఫరా పూర్తి చేస్తుంది.
ఈ సందర్భంగా, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఆర్.సి.ఎఫ్. బృందాన్ని అభినందిస్తూ, "భారతీయ వ్యవసాయ సమాజానికి సరసమైన ధరకు ఎం.ఓ.పి. తగినంత సరఫరాను నిర్ధారించడంలో, ఆర్.సి.ఎఫ్. సంతకం చేసిన ఈ దీర్ఘకాలిక ఒప్పందం చాలా దోహదపడుతుంది" అని పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో, ఎం.ఓ.పి. అంతర్జాతీయ ధరలు తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పుడు, ఆర్.సి.ఎఫ్. సంతకం చేసిన ఈ దీర్ఘకాలిక ఒప్పందం దేశంలో ఎం.ఓ.పి. ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ సింఘాల్; ఆర్.సి.ఎఫ్., చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్.సి. ముద్గేరికర్ తో పాటు ఎరువుల శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
*****
(Release ID: 1867050)
Visitor Counter : 154