జౌళి మంత్రిత్వ శాఖ
మార్కెటింగ్ ఈవెంట్లలో హస్తకళాకారులు పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
హస్తకళాకారులందరికీ సమానమైన, న్యాయమైన అవకాశాన్ని ఇవ్వనున్న ఆన్‌లైన్ ప్రక్రియ
Posted On:
10 OCT 2022 1:53PM by PIB Hyderabad
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మార్కెటింగ్ ఈవెంట్లలో (కార్యక్రమాలలో ) పాల్గొనేందుకు హస్తకళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియకు డెవలప్‌మెంట్ కమిషనర్ (హ్యాండీక్రాఫ్ట్స్) కార్యాలయం శ్రీకారం చుట్టింది. దీనితో హస్తకళాకారులకు పూర్తిగా డిజిటీకరించిన మార్కెటింగ్ వేదికను ఇది అందచేస్తుంది.
వారి ఉత్పత్తులను విక్రయించేందుకు మద్దతునిచ్చే లక్ష్యంతో ప్రతిసంవత్సరం దేశంలోని భిన్న ప్రాంతాలలో సుమారు 200 మార్కెటింగ్ కార్యక్రమాలను కార్యాలయం నిర్వహిస్తున్నది. దరఖాస్తుల ఎంపిక నుంచి అంతిమంగా స్టాల్ కేటాయింపు వరకూ ఎటువంటి మానవ చొరవలు లేకుండా పూర్తిగా కంప్యూటీకరించిన ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమం కానుంది. ఈ ఆన్‌లైన్ ప్రక్రియ హస్తకళాకారులందరికీ సమానమైన, ఉచితమైన, పారదర్శకమైన అవకాశాన్ని కల్పిస్తుంది. హస్తకళాకారులకు దీనిపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సంబంధిత సిబ్బందికి దరఖాస్తులు సమర్పించడంపై విస్త్రతమైన మార్గదర్శకాలను అందించడం జరిగింది (ఇదే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది).
మార్కెటింగ్ కార్యకలాపాల కోసం అర్హులైన చేతివృత్తి పనివారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు డెవలప్‌మెంట్ కమిషనర్ ( హ్యాండీక్రాఫ్ట్స్) కార్యాలయం ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ పోర్టల్ (http://indian.handicrafts.gov.in)ను ప్రారంభించింది. హస్తకళాకారులు తమకు కేటాయించిన పెహెచాన్ కార్డు (గుర్తింపు) నెంబరుతో లాగిన్ అయ్యి, నమోదు చేసుకున్న మొబైల్ నెంబరుకు పంపిన ఒటిపి ద్వారా ధ్రువీకృతం అవుతారు. దిల్లీ హాట్ సహా మార్కెటింగ్ కార్యక్రమాలకు దరఖాస్తులను అందుకుని, ఎంపిక చేసే ప్రక్రియలు పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతాయి. దేశీయ మార్కెటింగ్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు భౌతికంగా దరఖాస్తులను ఆహ్వానించే పద్ధతిని ఇకపై కొనసాగించరు.
***
(Release ID: 1866710)
Visitor Counter : 166