సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
న్యూఢిల్లీ సీపీ అవుట్‌లెట్‌లో అత్యధికంగా ఒకే రోజు రూ. 1.34 కోట్ల అమ్మకాలు జరిపిన కేవీఐసి
Posted On:
06 OCT 2022 3:09PM by PIB Hyderabad
ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున కేవీఈసి న్యూఢిల్లీ సీపీ అవుట్‌లెట్ ఖాదీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో న్యూఢిల్లీ సీపీ అవుట్‌లెట్ 1.34 కోట్ల రూపాయల విలువ చేసే ఖాదీ వస్త్రాలు విక్రయించి రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసింది. గతంలో 2021 అక్టోబర్ 30వ తేదీన జరిగిన 1.29 కోట్ల రూపాయల అమ్మకాలు అత్యధిక రికార్డుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ 2వ తేదీన సీపీ అవుట్‌లెట్ లో 1.01 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో జాతీయ మరియు అంతర్జాతీయ వేదికల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2014 సంవత్సరంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రంగం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఖాదీ వస్త్ర అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఖాదీ ఇండియా కేవీఐసి తన ప్రధాన విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అనేక సందర్భాల్లో ఈ కేంద్రంలో ఒక రోజులో కోటి రూపాయలకు మించి అమ్మకాలు నమోదయ్యాయి. ఈ అంశాన్ని రేడియో ద్వారా ప్రధానమంత్రి నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనేకసార్లు ప్రసవించారు.
ఖాదీ వినియోగం ద్వారా నేత కార్మికులను ప్రోత్సహించి వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించాలని 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరింది. దీని ప్రభావంతో 2022 అక్టోబర్ 2న భారీ ఎత్తున ఖాదీ వస్త్రాల అమ్మకం జరిగింది.
న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఖాదీ ఇండియా విక్రయ కేంద్రం ఒక్క రోజులో 1.34 కోట్ల రూపాయల విలువ చేసే అమ్మకాలు జరిపింది. 2021 అక్టోబర్ 2 న జరిగిన 1.01 కోట్ల రూపాయల అమ్మకాలు ఇంతవరకు రికార్డుగా ఉన్నాయి.ఒక్కరోజులో గతంలో నమోదు చేసిన రికార్డును కూడా కేంద్రం అధిగమించింది. గతంలో 2021 అక్టోబర్ 30న జరిగిన 1.29 కోట్ల రూపాయల రికార్డును అధిగమించి 2022 అక్టోబర్ 2న 1.34 కోట్ల రూపాయల విలువ చేసే ఖాదీ వస్త్రాలను కేంద్రం విక్రయించింది.
కేవలం రాజకీయ నినాదంతో కాకుండా ఆర్థిక, సామాజిక, సాంఘిక అంశాలను దృష్టిలో ఉంచుకుని మహాత్మా గాంధీ ఖాదీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రజల్లో ప్రధానమంత్రి పట్ల ఉన్న ఆదరణ, గౌరవం కూడా ఖాదీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ఖాదీ వినియోగాన్ని ఎక్కువ చేయాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించిన దేశ ప్రజలు ఖాదీని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. ప్రజల స్పందనతో నేత కార్మికులకు రానున్న దీపావళి నిజమైన కాంతులను ప్రసరిస్తుంది.
2022 సెప్టెంబర్ 25న నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి విజ్ఞప్తికి ప్రజలు స్పందించడంతో ఢిల్లీ కేంద్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని కేవీఐసి చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ అన్నారు.
ప్రధానమంత్రి అందిస్తున్న ప్రోత్సాహంతో ఖాదీ వస్త్ర అమ్మకాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఖాదీ వైపు మొగ్గు చూపిస్తున్నారని శ్రీ మనోజ్ కుమార్ అన్నారు.
***
(Release ID: 1865616)
Visitor Counter : 166