వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు మరియు వినియోగదారుగా అలాగే ప్రపంచంలో 2వ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా ఆవిర్భవించిన భారతదేశం
2021-22 చక్కెర సీజన్‌లో 5000 ఎల్‌ఎంటీ చెరకు ఉత్పత్తితో రికార్డు; ఇథనాల్ ఉత్పత్తికి 35 ఎల్‌ఎంటీ చక్కెర వినియోగం; ఈ సీజన్‌లో 359 ఎల్‌ఎంటీ చక్కెరను ఉత్పత్తి చేసిన మిల్లులు
అత్యధికంగా 109.8 ఎల్‌ఎంటీ చక్కెర ఎగుమతుల నమోదు
చక్కెర మిల్లులు/డిస్టిలరీలు ఇథనాల్ అమ్మకం ద్వారా ₹ 18,000 కోట్లను ఉత్పత్తి చేశాయి
సీజన్ ముగిసే నాటికి మిల్లర్లు మొత్తం చెరకు బకాయిల్లో 95% చెల్లించారు; షుగర్ సీజన్ 2020-21కు 99.9% కంటే ఎక్కువ చెరకు బకాయిలు చెల్లించబడ్డాయి
Posted On:
05 OCT 2022 2:21PM by PIB Hyderabad
షుగర్ సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్) 2021-22లో దేశంలో 5000 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) కంటే ఎక్కువ చెరకు ఉత్పత్తి చేయబడింది. అందులో సుమారు 3574 ఎల్‌ఎంటీ చెరకుతో చక్కెర మిల్లులు 394 ఎల్‌ఎంటీ చక్కెరను ఉత్పత్తి చేశాయి. ఇందులో 35 ఎల్‌ఎంటీ చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించగా, 359 ఎల్‌ఎంటీ చక్కెరను మిల్లులు ఉత్పత్తి చేశాయి. దీంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా మరియు వినియోగదారుగా అలాగే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా అవతరించింది.
ఈ సీజన్ భారతీయ చక్కెర రంగానికి అద్భుతమైన సీజన్‌గా నిరూపించబడింది. చెరకు ఉత్పత్తి, చక్కెర ఉత్పత్తి, చక్కెర ఎగుమతులు, సేకరించిన చెరకు, చెల్లించిన చెరకు బకాయిలు మరియు ఇథనాల్ ఉత్పత్తిలో అన్ని రికార్డులు ఈ సీజన్‌లో నమోదయ్యాయి.
2020-21 వరకు పొడిగించబడిన ఆర్థిక సహాయం లేకుండానే అత్యధికంగా 109.8 ఎల్‌ఎంటీ ఎగుమతులు చేయడం ఈ సీజన్‌లోని మరో హైలైట్. అంతర్జాతీయ మద్దతు ధరలు మరియు భారత ప్రభుత్వ విధానం భారతీయ చక్కెర పరిశ్రమ యొక్క ఈ ఘనతకు దారితీసింది. ఈ ఎగుమతుల వల్ల రూ.40,000 కోట్ల విదేశీ కరెన్సీ దేశానికి లభించింది.
దేశంలోని వ్యాపారానికి అత్యంత సహాయకారిగా ఉన్న మొత్తం పర్యావరణ వ్యవస్థతో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, చక్కెర మిల్లులు, ఇథనాల్ డిస్టిలరీల సమకాలిక మరియు సహకార ప్రయత్నాల ఫలితమే చక్కెర పరిశ్రమ విజయగాథ. 2018-19 ఆర్థిక ఇబ్బందుల నుంచి 2021-22లో స్వయం సమృద్ధి సాధించే దశకు చక్కెర రంగాన్ని దశలవారీగా నిర్మించడంలో గత 5 సంవత్సరాల నుండి సకాలంలో ప్రభుత్వ జోక్యాలు కీలకంగా మారాయి.
2021-22 చక్కెర సీజన్‌లో చక్కెర మిల్లులు 1.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన చెరకును సేకరించాయి. భారత ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం (సబ్సిడీ) లేకుండా 1.12 లక్షల కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులను విడుదల చేశాయి. ఈ విధంగా చక్కెర సీజన్ ముగింపులో చెరకు బకాయిలు ₹ 6,000 కోట్ల కంటే తక్కువగా ఉన్నాయి, ఇది ఇప్పటికే 95% చెరకు బకాయిలు క్లియర్ చేయబడిందని సూచిస్తుంది. 2020-21 కోసం 99.9% కంటే ఎక్కువ చెరకు బకాయిలు క్లియర్ చేయబడ్డాయి.
చక్కెర మిల్లులను ఇథనాల్‌కు మళ్లించడానికి మరియు మిగులు చక్కెరను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తద్వారా చక్కెర మిల్లులు రైతులకు చెరకు బకాయిలను సకాలంలో చెల్లించడానికి మరియు మిల్లులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి మెరుగైన ఆర్థిక పరిస్థితులను కలిగి ఉంటాయి.
గత 5 సంవత్సరాలలో జీవ ఇంధన రంగంగా ఇథనాల్ వృద్ధి చెందడం చక్కెర రంగానికి విస్తారంగా మద్దతునిచ్చింది. 2021-22లో ఇథనాల్ అమ్మకాల ద్వారా చక్కెర మిల్లులు/డిస్టిలరీలు సుమారు ₹ 18,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది రైతుల చెరకు బకాయిలను ముందస్తుగా క్లియరెన్స్ చేయడంలో తన పాత్రను పోషించింది. మొలాసిస్/చక్కెర ఆధారిత డిస్టిలరీల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 605 కోట్ల లీటర్లకు పెరిగింది మరియు ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్ (ఈబిపి) కార్యక్రమం కింద 2025 నాటికి 20% బ్లెండింగ్ లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతి ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్త సీజన్‌లో చక్కెరను ఇథనాల్‌గా మళ్లించడం 35 ఎల్‌ఎంటీ నుండి 50 ఎల్‌ఎంటీకి పెరుగుతుందని అంచనా వేయబడింది. దీని వలన చక్కెర మిల్లులకు దాదాపు ₹ 25,000 కోట్ల ఆదాయం వస్తుంది.
2.5 నెలల పాటు దేశీయ అవసరాలను తీర్చడానికి అవసరమైన 60 ఎల్‌ఎంటీల చక్కెర నిల్వలు ఉన్నాయి. చక్కెరను ఇథనాల్ మరియు ఎగుమతులకు మళ్లించడం మొత్తం పరిశ్రమ యొక్క విలువ గొలుసును అన్‌లాక్ చేయడానికి దారితీసింది. అలాగే చక్కెర మిల్లుల మెరుగైన ఆర్థిక పరిస్థితులు తదుపరి సీజన్‌లో మరిన్ని ఐచ్ఛిక మిల్లులకు దారితీస్తాయి.
***
(Release ID: 1865429)
Visitor Counter : 1254