బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్‌ మాసపు బొగ్గు ఉత్పత్తి 12 శాతం పెరిగి 57.93 మిలియన్ టన్నులకు చేరిక‌


- 100 శాతానికి మించి ఇరవై ఐదు గనులలో బొగ్గు ఉత్పత్తి

Posted On: 03 OCT 2022 4:43PM by PIB Hyderabad

గ‌త ఏడాది సెప్టెంబ‌రుతో పోలిస్తే ఈ యేడాది సెప్టెంబ‌రు మాసంలో భారతదేశం మొత్తం బొగ్గు ఉత్పత్తి 51.72 ఎంటీల‌ నుండి 12.01 శాతం పెరిగి 57.93 మిలియన్ టన్నులకు (ఎంటీ) చేరింది. బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క తాత్కాలిక గణాంకాల మేర‌కు గ‌త సెప్టెంబర్ మాసంలో సీఐఎల్‌, ఎస్‌సీసీఎల్‌ మరియు క్యాప్టివ్ మైన్స్/ఇతరాలు వరుసగా 45.67 ఎంటీ, 4.93 ఎంటీ మరియు 7.33 ఎంటీల బొగ్గును ఉత్పత్తి చేశాయి. త‌ద్వారా ఆయా విభాగాలు వ‌రుస‌గా 12.35 శాతం, 8.43 శాతం మరియు 12.37 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  మేటి 37 గనులలో 25 గనుల ఉత్పత్తి స్థాయి 100 శాతానికి పైగా ఉంది. మరో ఐదు గనుల ఉత్పత్తి సెప్టెంబర్‌లో 80 మరియు 100 శాతం మధ్య ఉంది. అదే సమయంలో, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2022లో బొగ్గు పంపిణీ  60.02 ఎంటీల‌ నుండి 1.95 శాతం పెరిగి 61.18 మిలియన్ టన్నులకు (ఎంటీల‌కు) పెరిగింది. సెప్టెంబరు 2022లో సీఐఎల్‌, ఎస్‌సీసీఎల్‌ మరియు క్యాప్టివ్ గనులు/ఇతరులు వరుసగా 48.88 ఎంటీ, 4.77 ఎంటీ మరియు 7.53 ఎంటీల పంపిణీ ద్వారా 1.03, 4.13 మరియు 6.84 శాతం వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబరు 2022లో పవర్ యుటిలిటీస్ డెస్పాచ్ గత సంవత్సరం ఇదే సమయంలో 50.16 ఎంటీతో పోలిస్తే 51.71 ఎంటీకి పెరిగింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 22లో 13.40 శాతం వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2021లో ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కంటే సెప్టెంబర్ 22లో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 13.77 శాతం ఎక్కువ.
                                                               

****

 


(Release ID: 1864993) Visitor Counter : 194