సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

టెలివిజన్ మరియు డిజిటల్ మీడియాలో ఇప్పటికీ కనిపిస్తున్న బెట్టింగ్ ప్రకటనలకు వ్యతిరేకంగా మంత్రిత్వశాఖ మార్గదర్శకాల జారీ


ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వార్తలను సర్రోగేట్ ఉత్పత్తిగా ఉపయోగిస్తాయి..వార్తల ముసుగులో బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తాయి

దేశవ్యాప్తంగా బెట్టింగ్ చట్టవిరుద్ధ కార్యక్రమం, దీనికి సంబంధించిన ప్రకటనలపై ఫైన్‌ విధించవచ్చని డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు టీవీ ఛానళ్లకు మంత్రిత్వ శాఖ తెలియజేసింది

బెట్టింగ్ ప్రకటనలతో భారతీయులను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని ఆన్‌లైన్ బెట్టింగ్ మధ్యవర్తులకు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల జారీ చేసింది

Posted On: 03 OCT 2022 7:38PM by PIB Hyderabad

వినియోగదారులకు ముఖ్యంగా యువత మరియు పిల్లలకు గణనీయమైన ఆర్థిక మరియు సామాజిక ఆర్థిక ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు రెండు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో ఒకటి ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లకు మరొకటి డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ మరియు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు. ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌ల ప్రకటనలు మరియు అలాంటి సైట్‌ల సర్రోగేట్ ప్రకటనలను చూపడం మానుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలను ప్రచురించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ గతంలో 13 జూన్ 2022న వార్తాపత్రికలు, ప్రైవేట్ టీవీ ఛానెల్‌లు మరియు డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

టెలివిజన్‌లో అనేక స్పోర్ట్స్ ఛానెల్‌లు, అలాగే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఇటీవల ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు వారి సర్రోగేట్ న్యూస్ వెబ్‌సైట్‌ల ప్రకటనలను ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటిలో ఫెయిర్‌ప్లే,పరిమ్యాచ్,బెట్‌వే,వోల్ఫ్‌777 మరియు 1ఎక్స్‌బెట్‌ వంటి ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల యొక్క ప్రత్యక్ష మరియు సర్రోగేట్ ప్రకటనలను కలిగి ఉన్న ఆధారాలు అడ్వైజరీలకు అనుబంధంగా ఉన్నాయి.

ఆన్‌లైన్ ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు డిజిటల్ మీడియాలో బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేయడానికి వార్తల వెబ్‌సైట్‌లను సర్రోగేట్ ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అటువంటి సందర్భాలలో సర్రోగేట్ న్యూస్ వెబ్‌సైట్‌ల లోగోలు బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పోలి ఉన్నాయని మంత్రిత్వ శాఖ కనుగొంది. అంతేకాకుండా, బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా వార్తా వెబ్‌సైట్‌లు భారతదేశంలోని ఏ చట్టపరమైన అధికారం క్రింద నమోదు చేయబడవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాంటి వెబ్‌సైట్‌లు వార్తల ముసుగులో బెట్టింగ్ మరియు జూదాన్ని సర్రోగేట్ ప్రకటనలుగా ప్రచారం చేస్తున్నాయి.

దేశంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం కాబట్టి ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలు అలాగే వాటి సర్రోగేట్లు కూడా చట్టవిరుద్ధమని మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, కేబుల్ టీవీ నెట్‌వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 మరియు ఐటీ రూల్స్, 2021లోని నిబంధనలపై మార్గదర్శకాలు ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి ప్రకటనలు  సంబంధిత చట్టాలకు అనుగుణంగా లేవని మంత్రిత్వ శాఖ పేర్కొంది మరియు టీవీ ఛానెల్‌లకు స్పష్టం చేసింది. అటువంటి బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా వారి సర్రోగేట్ న్యూస్ వెబ్‌సైట్‌లను ప్రసారం చేయకుండా ఉండాలని నిబంధనలు అతిక్రమిస్తే డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లు, టీవీ ఛానెల్‌లపై శిక్షార్హమైన చర్య తీసుకోవచ్చని గుర్తుచేశాయి. భారతీయ ప్రేక్షకులను ఇటువంటి ప్రకటనలను లక్ష్యంగా చేసుకోవద్దని మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ ప్రకటన మధ్యవర్తులకు కూడా సూచించింది.

బెట్టింగ్ మరియు జూదం వినియోగదారులకు ముఖ్యంగా యువత మరియు పిల్లలకు గణనీయమైన ఆర్థిక మరియు సామాజిక-ఆర్థిక ప్రమాదాన్ని కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని ప్రకారం ప్రకటనల ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ బెట్టింగ్/గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహించడం ప్రజా ప్రయోజనాల కోసం సూచించబడదు.

సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ రెండు మార్గదర్శకాల రూపకల్పనలో వినియోగదారుల వ్యవహారాల శాఖతో సన్నిహిత సమన్వయంతో పనిచేసింది.

దిగువ లింక్‌లలో రెండు మార్గదర్శకాలను చదవవచ్చు:

టీవీ ఛానెల్‌లకు మార్గదర్శకాలు: https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Private%20Satellite%20TV%20Channels%2003.10.2022.pdf
డిజిటల్ మీడియాకు మార్గదర్శకాలు: https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Digital%20News%20Publishers%20and%20OTT%20Platforms%2003.10.2022%20%281%29.pdf

 

***(Release ID: 1864991) Visitor Counter : 184